NRI-NRT

అరిజోన రాష్ట్రం లో ఆటా ఫీనిక్స్ టీం ప్రారంభం

అరిజోన రాష్ట్రం లో ఆటా ఫీనిక్స్ టీం ప్రారంభం

అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారు నూతనంగా ఫీనిక్స్, అరిజోన, టీం ఆరంభించారు. జూన్ 5 వ తారీఖున అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో దాదాపు 400  పైగా తెలుగు వారు పాల్గొన్నారు. ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల మరియు సెక్రటరీ హరి ప్రసాద్ రెడ్డి లింగాల ముఖ్య అతిధులుగా విచ్చేసిన ఈ కార్యక్రంలో చిన్నారులు, పెద్దలు ఎంతో ఉత్సాహంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు, పాటల పోటీలు మరియు నృత్య పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజేతలకు బహుమతులు అందచేశారు.   
IMG-20220609-WA0134
అట ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల మాట్లడుతూ 100 మందికి పైగా కొత్త సభ్యులు చేరటం ఎంతో సంతోషంగా వుంది అని  ఫీనిక్స్ లోకల్ టీం సేవలు కొనియాడారు. విజేతలకు బహుమతులు అందచేశారు.  రఘు  గాడి , రీజినల్ కోఆర్డినేటర్, శేషిరెడ్డి గాదె కో-చైర్  అట స్పోర్ట్స్ ,వంశీ ఏరువారం ర్.సి., చెన్నయ్య మద్దూరి ర్.సి., బిందా కిరణ్ ఈవెంట్ కోఆర్డినేటర్  కొత్తగా మెంబెర్స్ చేర్పించటంలో ఎంతో తోడ్పాటుని అందించారు. వ్యాఖ్యాతలుగా నివేదిత గాడి, భార్గవి  మహీధర్, కిరణ్మయి జ్యోతుల & నీరజ వ్యవరించారు.  ఆటా సెక్రటరీ హరి ప్రసాద్ రెడ్డి  లింగాల మాట్లాడుతూ భవిష్యత్తులో ఈ టీం మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలి అని ఆకాంక్షించారు, ఆర్గనైజింగ్ టీం సభ్యులు శిల్ప పెనెత్స, రేఖ రెడ్డి ,మదన్ గోపాల్ బొల్లారెడ్డి , ఋక్కు మిల, అనుదీప్ యాపల,సుదర్శన్ మాచుపల్లి, ప్రసాద్ తాటికొండ, ప్రశాంత్  గంగవల్లి  & విజయ్ కందుకూరి తదితరులుని అభినందించారు.
IMG-20220609-WA0135
IMG-20220609-WA0136
IMG-20220609-WA0137
IMG-20220609-WA0138
IMG-20220609-WA0139
IMG-20220609-WA0140
IMG-20220609-WA0141
IMG-20220609-WA0142