WorldWonders

ఇదెక్కడి తంటారా బాబు !

ఇదెక్కడి తంటారా బాబు !

నూతన దంపతులు కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెడుతుంటారు. అదే ఇండోనేషియాలోని టిడాంగ్ కమ్యూనిటీకి చెందిన కొత్త జంటలు మాత్రం అత్యంత కఠినమైన నియమాన్ని పాటిస్తూ వైవాహిక జీవితాన్ని స్వాగతిస్తుంటాయి. ఇండోనేషియా – మలేషియా సరిహద్దుకు సమీపంలో ఉన్న బోర్నియో అనే ప్రాంతంలో ఉంటారు. ఆ తెగవారు. అక్కడ పెళ్లయ్యాక కొత్త దంపతులు మూడు రోజులపాటు మరుగుదొడ్డిని ఉపయోగించకూడదనే చిత్రమైన నిబంధన తరతరాలుగా ఉంది. ఆ నియమాన్ని ఉల్లంఘిస్తే కీడు జరుగుతుందని వారు విశ్వసిస్తారు. అందుకే పెళ్లికి ముందునుంచే వధూవరులని అందుకు తగ్గట్టు సిద్ధం చేస్తుంటారట. తక్కువ ఆహారం ఇవ్వడంతోపాటు కొన్ని మూలికల్నీ తినిపిస్తారట. దాంతో వారు ఎలాంటి సమస్యలు లేకుండా ఆ మూడురోజులూ గడిపేసి కొత్త జీవితంలోకి అడుగుపెడుతుంటారట.