DailyDose

యోగా ఎలా మొదలైంది?

యోగా ఎలా మొదలైంది?

యోగా పదిహేనువేల సంవత్సరాల కింద హిమాలయాలలోని ఎగువ ప్రాంతాలలో ఒక యోగి ప్రత్యక్షమయ్యారు. ఆయన నిశ్చలంగా కూర్చుని ఉన్నారు. ఆయన ఎవరో, ఎక్కడనుంచి వచ్చారో ఎవరికీ తెలియదు. ఆయన సమక్షం చాలా అసాధారణంగా ఉండటం వల్ల చాలా మంది ప్రజలు ఆయన చుట్టూ గుమిగూడారు. ఏదో అద్భుతం జరుగుతుందన్న ఆశతో వారంతా నెలల కొద్దీ వేచి చూసారు. అప్పుడప్పుడు ఆయన కనుల నుండి వెలువడే ఆనందభాష్పాలు తప్ప, ఆయన జీవించే ఉన్నారు అన్నదానికి వేరే సంకేతాలేమి లేవు.అంతకు ముందుకానీ, ఆ తరువాత కానీ మానవ చేతనను పెంపొందించడానికి అంతకన్న గొప్పగా దోహదపడినవారు ఎవరూ లేరు. ఒకరు అలా నెలల తరబడి కేవలం కూర్చుని ఉన్నారంటే అతను భౌతిక విషయాలచే ఇక ఏ మాత్రం శాసించబడటం లేదని అర్థం. అదే అద్భుతం కదా! కాని అది వారు గ్రహించలేకపోయారు. అందువల్ల ఒక ఏడుగురు తప్ప అందరూ వెళ్లిపోయారు. వారు ఆయనను, ‘మీకు తెలిసింది ఏమిటో, మాకూ తెలుసుకోవాలని ఉంది!’ అంటూ అభ్యర్థించారు. ఆయన వాళ్ళను పట్టించుకోలేదు. కాని వాళ్ళు అక్కడే ఉండిపోయారు. వారి పట్టుదలను చూసిన వారికి ఆయన ఒక చిన్న ప్రక్రియను భోధించారు. ఏడుగురూ దానిని ఎంతో అభ్యాసం చేసారు. రోజులు వారాలయ్యాయి, వారాలు నెలలు అయ్యాయి, నెలలు సంవత్సరాలు అయ్యాయి. 84 ఏళ్ళ సాధన తరువాత ఆదియోగి మళ్ళీ వారిని చూడటం జరిగింది. వారు తేజోవంతులుగా, తన దగ్గర ఉన్నదాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండడాన్ని ఆయన గమనించారు. ఇక ఆయన వారిని పట్టించుకోకుండా ఉండలేకపోయారు. తర్వాత పౌర్ణమినాడు ఆయన దక్షిణంవైపునకు తిరిగి ఆ ఏడుగురికీ గురువుగా కూర్చున్నారు. ఆ రోజు ఆదిగురువు ఆవిర్భవించారు. అంటే ఆదియోగి ఆదిగురువుగా మారారు. ఇప్పటికీ ఆ రోజుని మనం గురు పూర్ణిమగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా కృషితో మనిషి క్రమంగా పరిణామం చెందగలిగే అవకాశాన్ని ఆయన కల్పించారు. అంతకు ముందుకానీ, ఆ తరువాత కానీ మానవ చేతనను పెంపొందించడానికి అంతకన్న గొప్పగా దోహదపడినవారు ఎవరూ లేరు.ఆదియోగి వారికి యోగ శాస్త్రాన్ని బోధించడం ఆరంభించారు. అందులోని ఏడు విధానాలను ఏడుగురికీ బోధించారు. మానవ జీవిత నిర్మాణాన్నీ, అది పనిచేసే విధానాన్నీ బోధించారు. మానవుడు ముక్తి పొందడానికి 112 మార్గాలను, స్పష్టమైన పద్ధతులతో అందజేసారు. ఆ సప్తరుషులను మధ్య ఏషియా, దక్షిణ అమెరికా, ఉత్తర ఆఫ్రికా, ఆగ్నేయ ఏషియా, హిమాలయ దక్షిణ ప్రాంతాలను పంపారు.ఒకరు ఆయనతో ఉండిపోయారు. ఆఖరివారు దక్షిణ భారతానికి వచ్చారు. ఆయనే అగస్త్యులవారు. ఆయన దక్కను పీఠభూమికి దక్షిణంగా ఉండే ప్రతి జనావాసానికీ ఆధ్యాత్మిక ప్రక్రియను బోధన, తత్వం, మతంలా కాకుండా – ఒక జీవన విధానంలా అందేట్లు చూశారు. ఈ రోజుకు కూడా మన సంస్కృతిలో ఆయన చేసిన కృషి కనిపిస్తుంది.

యాంగ్జయిటీ, డిప్రెషన్‌
ఒత్తిడికి లోనైనప్పుడు శరీరంలో చోటుచేసుకునే మార్పులను నియంత్రించటం ద్వారా ఆ ప్రభావం శరీరంపై పడకుండా యోగా అడ్డుకుంటుంది. యోగా వల్ల స్ట్రెస్‌ రెస్పాన్స్‌ సిస్టమ్‌ పనితీరు క్రమబద్ధమై రక్తపోటు తగ్గటం, గుండె స్థిరంగా కొట్టుకోవటం, శ్వాస మెరుగవటం లాంటి లక్షణాలు మొదలవుతాయి. వీటి వల్ల ఎలాంటి మందుల అవసరం లేకుండానే, ఆందోళన, డిప్రెషన్‌లాంటి మానసిక రుగ్మతలు నయమవుతాయి.

ఙ్ఞాపకశక్తి, ఏకాగ్రత
జీవితంలో ఎదురయ్యే ఒడిదొడుకులు, మానసిక ఒత్తిడులు దైనందిన జీవితంలో చేసే చిన్న చిన్న పనుల మీద ఏకాగ్రత లోపించటానికి కారణమవుతూ ఉంటాయి. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక సతమతమవుతూ ఉంటాం. యోగా మనసులోని గజిబిజి ఆలోచనలను పారదోలి పంచేంద్రియాలకు స్వాంతన అందిస్తుంది. మెదడులోని నిరంతర గందరగోళాన్ని వదిలించి, ధ్యాసను మళ్లిస్తే ఏకాగ్రత కుదరటంతోపాటు ఙ్ఞాపకశక్తి మెరుగవుతుందని స్వానుభవంలో తెలుస్తుంది. ఇది యోగాతోనే సాధ్యం.

ఎముకలు, కండరాలు
యోగాసనాల ద్వారా కండరాలు, ఎముకలు, కీళ్లు వాటి పూర్తి సామర్ధ్యం మేరకు పని చేస్తాయి. యోగా వల్ల కీళ్ల మధ్య ఉండే మెత్తని మృదులాస్థి సాగి, దగ్గరవుతూ ఉంటుంది. ఇలా మరే వ్యాయామంలో జరిగే అవకాశమే లేదు. ఇలా యోగాలో జరగటం వల్ల కార్టిలేజ్‌కు కొత్త పోషకాలు అంది, కదలికలకు అనుగుణంగా కీళ్లు ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా వంగగలుగుతాయి. ఫలితంగా మృదులాస్థి క్షీణించి కీళ్లు అరిగిపోవడమనే సమస్య తలెత్తదు.
వెన్ను బలవర్ధకంవెన్నుపూసల మధ్య ఉండే స్పైనల్‌ డిస్క్‌లు దగ్గరవుతూ, దూరమవుతూ నాడులకు తగిన చేతనను అందిస్తాయి. యోగాసనాల్లోని ముందుకు, వెనక్కు వంగే, మెలితిరిగే భంగిమల వల్ల వెన్నుపూసల మధ్య ఫ్లెక్సిబిలిటీ మెరుగై పటుత్వం సమకూరుతుంది.

రోగనిరోధక శక్తి
వివిధ యోగాసనాల ద్వారా కండరాలను సాగదీయటం వల్ల లింఫ్‌ గ్రంథుల స్రావాలు పెరుగుతాయి. ఇమ్యూన్‌ సెల్స్‌తో నిండి ఉండే ఈ స్రావాల విడుదలతో ఇన్‌ఫెక్షన్‌తో పోరాడే గుణం, క్యాన్సర్‌ కణాల నాశనం, కణాల పనివల్ల విడుదలయ్యే వ్యర్ధాల విసర్జనలు జరుగుతాయి. ఫలితంగా రోగనిరోధక శక్తి మెరుగవుతుంది.

మధుమేహం
కార్టిసోల్‌, అడ్రినలిన్‌ హార్మోన్‌ స్రావాలను నియంత్రించటం, బరువు తగ్గించటం, ఇన్సులిన్‌కు స్పందించే గుణాన్ని పెంచటం ద్వారా యోగా చేసే మధుమేహుల చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. ఫలితంగా మధుమేహంతో లింకయి ఉండే గుండె పోటు, కిడ్నీ ఫెయిల్యూర్‌లాంటి ప్రాణాంతక పరిస్థితులు తలెత్తవు.
నాడీ వ్యవస్థయోగాను నాడుల పనితీరు మెరుగుపరచటానికి కూడా ఉపయోగించవచ్చు. రాత్రుళ్లు నిద్ర పట్టనప్పుడు రిలాక్సేషన్‌ కోసం, మనసును స్వాధీనంలో ఉంచుకోవటం కోసం కూడా యోగాభ్యాసాన్ని సాధన చేయొచ్చు.