Politics

సీఎం కేసీఆర్‌కు హైకోర్టు నోటీసులు జారీ.. ఎందుకో తెలుసా..?

Auto Draft

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసిం‍ది. భూముల వ్యవహారంలో సీఎం కేసీఆర్‌తో అధికారులు, కలెకర్టర్‌కు సైతం రాష్ట్ర అ‍త్యున్నత న్యాయస్థానం నుంచి నోటీసులు వెళ్లాయి. వివరాల ప్రకారం.. తెలంగాణలోని పలు జిల్లాలో టీఆర్‌ఎస్‌ కార్యాలయాలకు గాను భూమి కేటాయింపులు జరిగాయి. ఇందులో భాగంగా.. హైదరాబాద్‌ కార్యాలయం కోసం బంజారాహిల్స్​లో 4,935 గజాలు కేటాయించారు. కాగా, ఎంతో విలువ చేసే గజం భూమిని రూ. 100కే (గజం చొప్పున) కేటాయించినట్టు రిటైర్డ్‌ ఉద్యోగి మహేశ్వర్‌రాజ్‌.. హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో, పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. విచారణ అనంతరం హైకోర్టు.. సీఎం కేసీఆర్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డితో పాటు సీఎస్‌, సీసీఎల్‌ఏ, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని అత్యున్నత నాయ్యస్థానం ఆదేశించింది.