బ్లౌజులు, లెహెంగాలకు కొత్త అందాన్ని జోడించాలంటే వాటికి అదనపు హంగులు జోడించాలి. అలాంటిదే ‘లట్‌కాన్’! ఉలెన్ కుచ్చులు, బీడ్స్, మెరిసే రాళ్లు, ఫ్యాబ్రిక్… ఇలా వినూత్నమైన స్టైల్స్‌లో లట్కాన్లు దొరుకుతున్నాయి. వీటిని అటాచ్ చేసి సరికొత్త అందాలతో మెరిసిపోండి! బ్లౌజుల వెనక మెడ దగ్గర రోప్స్ కట్టి, లట్కాన్లను వేలాడదీయవచ్చు, లేదంటే అడుగున రెండు అంచులనూ కలుపుతూ డోరీ కట్టుకోవచ్చు. ఎలా అలంకరించుకున్నా డోరీ రంగులు బ్లౌజ్‌తో మ్యాచ్ అయ్యేలా ఉంటే చాలు! కొంత సృజనాత్మకత ప్రదర్శించాలని అనుకుంటే క్లాత్‌తో తయారైన జంతువుల బొమ్మలు తగిలించుకోవచ్చు. చిలకలు, ఏనుగులు లాంటి బొమ్మలు అందంగా ఉంటాయి. రాళ్లు పొదిగిన లట్కాన్లు దుస్తులకు హెవీ లుక్‌ను తెచ్చిపెడతాయి. కాబట్టి పెళ్లిళ్లు లాంటి వేడుకల్లో ధరించే భారీ దుస్తులకు ఇలాంటి డోరీలు జోడించాలి.