Devotional

వైభవంగా జరుగతున్న శ్రీవారి పవిత్రోత్సవాలు – ఆధ్యాత్మిక వార్తలు

వైభవంగా జరుగతున్న శ్రీవారి పవిత్రోత్సవాలు – ఆధ్యాత్మిక వార్తలు

1. తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాల్లో మంగళవారం వైభవంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. వేద ఘోష, మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవ మూర్తులకు, ఆలయంలోని ఇతర పరివార దేవతలకు, ధ్వజస్తంభానికి,భూవరాహస్వామికి, బేడి ఆంజనేయస్వామికి పవిత్రమాలల సమర్పణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు యాగశాలలో పవిత్రోత్సవాల వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జీయర్‌స్వాములు, డిప్యూటీఈవో రమే్‌షబాబు తదితరులు పాల్గొన్నారు

2.రొట్టెల పండుగలో తగ్గిన భక్తుల రద్దీ
నెల్లూరు జిల్లాలోని బారాషహీద్ దర్గా వద్ద రెండవ రోజు రొట్టెల పండుగ ను ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే గతంతో పోలిస్తే రొట్టెల పండుగకు వచ్చే భక్తుల రద్దీ తగ్గింది. ఈరోజు రాత్రికి గంధమహోత్సవం నిర్వహించనున్నారు. టీడీపీ హయాంలో నిర్మించిన భక్తుల వసతి గృహాన్ని ఓ వైసీపీ నేత టెంకాయల దుకాణంగా మార్చేశాడు. అటు స్వర్ణాల చెరువులో నీటిని శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వస్తోంది. రొట్టెలు మార్చుకునెందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దర్గాకి కిలో మీటర్ల దూరంలోనే వాహనాలు నిలిపివేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా పోలీసు ఆంక్షలు విధించారు

3.తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 22 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పట్టనుంది. అలాగే నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.77 కోట్లుగా ఉంది. నిన్న శ్రీవారిని 65,939 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు 32,894 మంది భక్తులు సమర్పించుకున్నారు

4.పెరటాశి తర్వాత దర్శనానికి రండి: టీటీడీ
ఆగస్టు 11 నుంచి 15వ తేదీ వరకు వరుస సెలవుల కారణంగా తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులు ప్రణాళికబద్ధంగా దర్శనం, వసతిని ముందుగానే బుక్‌ చేసుకుని తిరుమలకు రావాలని టీటీడీ మంగళవారం ఓ ప్రకటన ద్వారా కోరింది. ‘వేసవి రద్దీ తగ్గినప్పటికీ వారాంతపు రద్దీతో పాటు పండుగతో కూడా వరుస సెలవులు ఆగస్టు 19వరకు కొనసాగుతాయి. పైగా పవిత్రమైన పెరటాశి మాసం సెప్టెంబరు 18వ తేదీన ప్రారంభమై అక్టోబరు 17వ తేదీన ముగుస్తుంది. ఈమధ్య కాలంలో తిరుమలలో యాత్రికుల రద్దీ అనూహ్యంగా పెరిగే అవకాశముంది. ఈ కారణంగా వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు తిరుమలకు పెరటాశి మాసం తర్వాత రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం’ అని పేర్కొంది

5.వృద్ధులు, దివ్యాంగులకు టీటీడీ విజ్ఞప్తి
ఆగస్టు 11 నుంచి 15వ తేదీ వరకు వరుస సెలవుల కారణంగా తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులు ప్రణాళికబద్ధంగా దర్శనం, వసతిని ముందుగానే బుక్‌ చేసుకుని తిరుమలకు రావాలని టీటీడీ మంగళవారం ఓ ప్రకటన ద్వారా కోరింది. ‘వేసవి రద్దీ తగ్గినప్పటికీ వారాంతపు రద్దీతో పాటు పండుగతో కూడా వరుస సెలవులు ఆగస్టు 19వరకు కొనసాగుతాయి. పైగా పవిత్రమైన పెరటాశి మాసం సెప్టెంబరు 18వ తేదీన ప్రారంభమై అక్టోబరు 17వ తేదీన ముగుస్తుంది. ఈమధ్య కాలంలో తిరుమలలో యాత్రికుల రద్దీ అనూహ్యంగా పెరిగే అవకాశముంది. ఈ కారణంగా వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు తిరుమలకు పెరటాశి మాసం తర్వాత రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ’ అంటూ టీటీడీ ఆ ప్రకటనలో పేర్కొంది

6.అట్టహాసంగా రొట్టెల పండుగ ప్రారంభం
మతసామరస్యానికి ప్రతీకగా, కోర్కెల పండుగగా పేరుగడించిన రొట్టెలపండుగ మంగళవారం నెల్లూరులో అట్టహాసంగా ప్రారంభమైంది. తొలిరోజే లక్ష మందికి పైగా భక్తజనం తరలివచ్చినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లు రొట్టెలపండుగ జరగలేదు. ఈ ఏడాది జరుగుతున్న ఈ వరాల పండుగకు భక్తులు భారీగా తరలివస్తారని జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నగర పాలక సంస్థ, రెవెన్యూ, విద్యుత్‌, పోలీస్‌ శాఖల సిబ్బంది సమన్వయంతో సేవలు అందిస్తున్నారు. రొట్టెల పండుగలో తొలిరోజు అర్ధరాత్రి సందల్‌మాల్‌ను (బారాషహీద్‌లను శుభ్రం చేసి గంధం పూయడం) భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం రాష్ట్ర మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కలెక్టర్‌ చక్రధర్‌రావు, ఎస్పీ విజయరావు, మేయర్‌ స్రవంతి, కమిషనర్‌ హరిత దర్గాను దర్శించుకుని ప్రార్థనలు చేశారు. స్వర్ణాల చెరువు ఘాట్‌ వద్ద, దర్గా వద్ద క్యూలైన్లను పరిశీలించి, సిబ్బందికి సూచనలు చేశారు. తొలిరోజు స్వర్ణాల చెరువులో చదువు, వివాహ, ఆరోగ్య రొట్టెలకు డిమాండ్‌ ఏర్పడింది

7.మొహర్రం సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో షియా ముస్లింలు మంగళవారం మాతం నిర్వహించారు. ధర్మ పరిరక్షణ కోసం మహమ్మద్‌ ప్రవక్త మనవడు హజ్రత్‌ ఇమాం హుస్సేన్‌ సహా 72 మంది అమరులైన ఘటనను స్మరించుకుంటూ షియాలు పెద్ద సంఖ్యలో మాతంలో పాల్గొన్నారు. కత్తులు, బ్లేడ్లు, కొరడాలతో తమ శరీరాలపై గాయాలు చేసుకున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణం దొరకోటలోని పీర్ల వద్ద నవాబు వంశీయుల వారసులు మీర్‌ ఫజుల్‌ అలీఖాన్‌, ఆయన కుటుంబసభ్యులు, షియా ముస్లింలు ప్రార్థనలు చేశారు. అనంతరం పీర్ల ఊరేగింపు నిర్వహించారు. పట్టణంలోని మొత్తం 40 పీర్ల చావిళ్ల నుంచి పీర్ల ఊరేగింపులు జుర్రేరు వాగుకు చేరుకున్నాయి. అక్కడ పీర్లను శుద్ధి చేసి తిరిగి పీర్ల చావిళ్లకు చేర్చారు. వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన ప్రజలు మిద్దెలు, మేడలపై ఎక్కి మాతంను తిలకించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు.
రాత్రి సినిమా హాళ్లు కూడా బంద్‌ చేయించారు. వీధి లైట్లు నిలిపేశారు. డోన్‌ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బనగానపల్లె సీఐ సుబ్బరాయుడు, ఎస్‌ఐలు రామిరెడ్డి, శంకర్‌నాయక్‌ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని కోనేరుసెంటర్‌, పమిమిడిముక్కల మండలం అలీనఖీపాలెం, తోట్లవల్లూరు మండలం ఐలూరు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా నగరం, మామిడికుదురు గ్రామం, చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం ఆవలకొండలోనూ మాతం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవలకొండకు తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్‌ ప్రాంతాల నుంచి కూడా షియాలు తరలివచ్చారు. ఆవలకొండ నుంచి ఫకీర్‌తోటకు పీర్లను ఊరేగింపుగా తీసుకొచ్చారు.

8. వైభవంగా బోనాలు
శేరిలింగంపల్లి గ్రామంలో సోమవారం పోచమ్మ తల్లి ఆలయంలో రేవంత ముదిరాజ్‌ ఆధ్వర్యంలో బోనాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొని ఫలహారబండి ఊరేగింపును కొబ్బరికాయకొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన అధ్య క్షుడు మారబోయిన రాజుయాదవ్‌, వివేకానందనగర్‌, చందానగర్‌ డివిజన్ల అధ్యక్షులు సంజీవరెడ్డి, రఘునాథ్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి రవీందర్‌గౌడ్‌, నాయకులు కృష్ణయాదవ్‌, పద్మారావు, కొండా విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

9. శ్రీశైలంలోని భ్రమరాంబ, మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు దర్శించుకొన్నారు. సోమవారం తెల్లవారుజామునే కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకోగానే.. ఆలయ అధికారులు, అర్చక, వేదపండితులు కలిసి తిలకధారణ చేసి స్వాగతం పలికారు. శ్రావణ సోమవారం ఏకాదశి కావడంతో మల్లికార్జున స్వామి వారికి అభిషేకం చేశారు. అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు.