Movies

షూటింగ్‌లో గాయపడిన టబూ

Auto Draft

బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ నటిస్తున్న ‘భోలా’ సినిమా చిత్రీకరణలో అపశృతి చోటు చేసుకుంది. ఈ సినిమాలో ట్రక్‌ ఛేజింగ్‌ సీన్‌ షూట్‌ చేస్తున్న సమయంలో నాయిక టబూకు గాయాలయ్యాయి. యాక్షన్‌ సీక్వెన్సుల చిత్రీకరణ సందర్భంగా జరిగిన ప్రమాదంలో ట్రక్‌ అద్దాలు పగిలి టబూకు గుచ్చుకున్నాయి. సెట్‌లోనే ప్రథమ చికిత్స అందించారు. ఒక రోజు విశ్రాంతి అనంతరం ఆమె షూటింగ్‌కు హాజరుకావొచ్చని వైద్యులు చెప్పినట్లు తెలిసింది.