DailyDose

ఏసీబీకి చిక్కిన పోలీస్ హెడ్ – TNI నేటి నేర వార్తలు

ఏసీబీకి చిక్కిన పోలీస్ హెడ్ –  TNI   నేటి నేర వార్తలు

* రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. వేములవాడ ఠాణాలో పని చేస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌ చంద్రప్రకాశ్‌ ఓ వ్యక్తి నుంచి రూ.6వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుడు భరత్‌ బద్దిపోచమ్మ ఆలయం వద్ద చికెన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. ఈ నెల 8న పక్కనే ఉన్న ముస్లిం వ్యాపారితో గొడవ జరిగింది.దీంతో అదే రోజు ఇరువురు పోలీస్‌స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. 9న వేముల భరత్‌ కేసుకు సంబంధించి ఐఓగా ఉన్న హెడ్‌ కానిస్టేబుల్‌ చంద్ర ప్రకాశ్ 41ఏ సీఆర్పీసీ కింద నోటీసు నోటీసులు ఇచ్చాడు. స్టేషన్‌ బెయిల్‌ ఇప్పించినందుకు రూ.10వేలు ఇవ్వాలని హెడ్‌కానిస్టేబుల్‌ డిమాండ్‌ చేశాడని బాధితుడు ఆరోపించాడు.ఆ తర్వాత ఏసీబీ అధికారులను ఆశ్రయించి.. చివరకు రూ.6వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో గురువారం పట్టణ పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా ఉన్న పండ్ల దుకాణం వద్దకు వచ్చిన హెడ్‌ కానిస్టేబుల్‌ చంద్రప్రకాశ్‌కు భరత్‌ డప్పులు ఇస్తుండగా.. అక్కడే మాటువేసి ఉన్న ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తన బృందంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

*మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని జ‌బ‌ల్‌పుర్ ఆర్టీవో అధికారి ఇంట్లో ఆర్థిక నేర విభాగానికి చెందిన అధికారులు సోదాలు నిర్వ‌హించారు. ఆర్టీవో ఆఫీస‌ర్‌తో పాటు ఆయ‌న భార్య‌కు సంబంధించిన ప్రాప‌ర్టీల‌ను కూడా త‌నిఖీ చేశారు. అయితే అక్ర‌మ రీతిలో ఆదాయానికి మించి ఆస్తులు క‌లిగి ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. సుమారు త‌మ ఆదాయానికి 650 రేట్లు ఎక్కువ ఆదాయం ఉన్న‌ట్లు అధికారులు తేల్చారు. ఈ కేసులో 16 ల‌క్ష‌ల న‌గ‌దు, జ్వ‌ల‌రీని స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీవో ఆఫీస‌ర్ సంతోష్ పౌల్‌తో పాటు భార్య లేఖా పౌల్‌పై ఆర్థిక‌శాఖ త‌నిఖీలు నిర్వ‌హించింది. ఆర్టీవో ఆఫీసులో లేఖ కూడా క్ల‌ర్క్‌గా ప‌నిచేస్తోంది. అవినీతి జ‌రిగిన‌ట్లు ఫిర్యాదు అందిన నేప‌థ్యంలో అధికారులు సోదాలు నిర్వ‌హించారు.

*బీహార్‌లోని పట్నాలో దారుణం చోటుచేసుకుంది. పట్నాలోని సిపారా ప్రాంతంలో ఓ కూరగాయల వ్యాపారి కూతురిని ఓ యువకుడు తుపాకీతో కాల్చాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. యువతి వీధిలోనుంచి వస్తుండగా ఓ యువకుడు ఆమెను దాటుకుని వచ్చి కొద్ది దూరంలో నిల్చున్నాడు. ఆమె అతడిని దాటి వెళ్లిన తర్వాత.. అప్పటికే తనతో తెచ్చుకున్న తుపాకీని సంచిలోనుంచి తీసి ఆమె మెడపై కాల్చాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో పడిఉన్న ఆమెను స్థానికులు దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆ యువతి చికిత్స పొందుతున్నదని పోలీసులు తెలిపారు. కాల్పులకు ప్రేమ వ్యవహారమే కారణమని వెల్లడించారు. యువకుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఇదంతా ఓ ఇంటికి ఉన్న కెమెరాలో రికార్డయింది.

*పశ్చిమ బెంగాల్‌కు చెందిన పోలీస్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఉత్తర 24 పరగణాస్‌ జిల్లాలో ఇద్దరు అనుమానితులను అరెస్ట్‌ చేశారు. ఈ ఇద్దరు వ్యక్తులు అల్‌ఖైదాకు పని చేస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఉత్తర 24 పరగణాస్‌లోని షాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖరీబారి వద్ద బుధవారం రాత్రి ఎస్‌టీఎఫ్‌ అధికారులు దాడులు జరిపి.. ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో ఒకరు దక్షిణ్ దినాజ్‌పూర్ జిల్లాలోని గంగారాంపూర్ నివాసి అనీ, మరొకరు హుగ్లీ జిల్లాలోని ఆరంబాగ్‌కు చెందినవారన్నారు.

*ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని గోరంట్ల మండలం వానవోలులో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. గ్రామానికి చెందిన వాల్మీకి పాపన్న, వెంకటలక్ష్మమ్మ అనే దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వయోభారంతో ఇబ్బందులు పడుతున్న దంపతులు ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని, శవ పంచనామా నిర్వహించి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

*కర్ణాటకకు చెందిన వెంకటేశ్, మంగ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు శ్రీకాంత్‌ ఉన్నారు. శ్రీకాంత్‌ హైదరాబాద్‌ వినాయకనగర్‌లోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడికి కొంతకాలం క్రితం రాజేంద్రనగర్‌కు చెందిన యువతి ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. యువతి కుటుంబసభ్యులు పెళ్లికి అంగీకరించకపోవడంతో జూన్ 4న నగరంలోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. వినాయకనగర్‌లోనే ఇద్దరూ కొంతకాలంగా కలిసి ఉంటున్నారు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు.. తమ కుమార్తెకు వివాహ వయస్సు రాకముందే పెళ్లి చేసుకోవడం చట్టవిరుద్ధమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు.. శ్రీకాంత్‌ను మైనర్‌గా నిర్ధారించి.. జులై 28న యువతిని వారి కుటుంబసభ్యులకు అప్పగించారు.

*విశాఖలో బుధవారం సాయంత్రం నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ రౌడీషీటర్‌ దారుణ హత్యకు గురయ్యారు. ఎంవీపీ కాలనీ ఉషోదయ కూడలిలో బుధవారం ఇద్దరు యువకులు అతణ్ని కత్తితో పొడిచి, పీక కోసి పాశవికంగా హత్య చేయడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వారు తేరుకోకముందే నిందితులు సంఘటన స్థలం నుంచి పారిపోయారు. అందరూ స్నేహితులే అయినప్పటికీ అంతర్గతంగా పెంచుకున్న ద్వేషం చివరకు రౌడీషీటర్‌ దారుణ హత్యకు దారితీసినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

*విశాఖలో బుధవారం సాయంత్రం నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ రౌడీషీటర్‌ దారుణ హత్యకు గురయ్యారు. ఎంవీపీ కాలనీ ఉషోదయ కూడలిలో బుధవారం ఇద్దరు యువకులు అతణ్ని కత్తితో పొడిచి, పీక కోసి పాశవికంగా హత్య చేయడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వారు తేరుకోకముందే నిందితులు సంఘటన స్థలం నుంచి పారిపోయారు. అందరూ స్నేహితులే అయినప్పటికీ అంతర్గతంగా పెంచుకున్న ద్వేషం చివరకు రౌడీషీటర్‌ దారుణ హత్యకు దారితీసినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

*జమ్ముకశ్మీర్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో అన్నమయ్య జిల్లాకు చెందిన రాజశేఖర్ అనే జవాన్ మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

*తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల శివారులో జాతీయ రహదారి పై ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 13 మందికి గాయాలయ్యాయి. గుంటూరు నుంచి 35 మంది ప్రయాణికులతో విశాఖపట్నానికి వెళ్తున్న బస్సు మంగళవారం అర్ధరాత్రి నల్లజర్ల సమీపంలోకి రాగానే ప్రమాదానికి గురయ్యింది. ముందు వెళ్తున్న వాహనాన్ని అధిగమించే క్రమంలో అదుపుతప్పి బోల్తాపడింది. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొని ప్రయాణికులను బస్సులోంచి బయటకు తీశారు. గాయపడ్డవారిని నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
*కడప శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, లారీ ఢీకొన్న ఘటనలో జిల్లా మెప్మా పీడీ సతీమణి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు.

*ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం మైలవరంలో సాంఘిక సంక్షేమ వసతి గృహం ఉంది. అందులో తిరువూరు మండలానికి చెందిన ముగ్గురు విద్యార్థినులు ఉంటున్నారు. బాలికోన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. సెలవుల్లో ఇంటికి వెళ్లిన ఈ ముగ్గురూ.. తర్వాత ఇళ్ల నుంచి మంగళవారం వసతిగృహానికి తిరిగి వచ్చారు. ఆ రోజు ప్రశాంతంగానే గడిచింది. బుధవారం సాయంత్రం ఆ ముగ్గురు బాలికల్లో ఒకరి మెడపై, చెంప మీద స్వల్ప గాయాలు ఉన్నాయి.ఈ విషయాన్ని తోటి విద్యార్థినులు గమనించారు. వెంటనే వెళ్లి వార్డెన్‌కు తెలిపారు. పరుగు పరుగున వచ్చిన వార్డెన్.. విద్యార్థినిని విచారించారు. ఏం జరిగిందని ప్రశ్నించగా.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మాస్కు ధరించి తనపై హత్యాయత్నం చేశాడని చెప్పింది. కంగారుపడిన వార్డెన్‌.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వసతిగృహానికి చేరుకున్న పోలీసులు.. విద్యార్థినిని ఆరా తీశారు. పోలీసులను చూడగానే భయపడిపోయిన సదరు బాలిక.. అసలు విషయం చెప్పేసింది.ఇదంతా ఓ ప్లాన్ అని చెప్పింది. దీనికి కర్త, కర్మ తాము ముగ్గురమే అని తెలిపింది. ఆశ్చర్యపోయిన పోలీసులు.. వార్డెన్.. ఇలా ఎందుకు చేశారని ప్రశ్నించింది. తమకు మళ్లీ ఇంటికి వెళ్లాలని అనిపించిందని, అందుకే ముగ్గురం కలిసి ఈ ప్లాన్ వేశామని చెప్పింది. తాను పెన్సిళ్లు చెక్కే షార్పనర్‌ బ్లేడుతో మెడ, చెంపపై గాట్లు పెట్టుకున్నానని సదరు బాలిక తెలిపింది. తొలుత తాము ఉల్లిపాయలు పెట్టుకుని జ్వరం వచ్చినట్లు నాటకం ఆడదామనుకున్నామని, కానీ.. తోటి విద్యార్థినుల ప్రోద్బలంతో ఇలా గాయపరుచుకున్నామని బాలిక చెప్పింది. దీంతో.. ఉపాధ్యాయులు, వార్డెన్‌, పోలీసులు అవాక్కయ్యారు.అనంతరం విద్యార్థినుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ముగ్గురు విద్యార్థినులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను.. వసతిగృహ వార్డెన్‌ బెజవాడ అలివేలు మంగమ్మ వెల్లడించారు.

*తెరాస నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. హత్యకు పాల్పడ్డట్లు అనుమానిస్తున్న 8 మంది నిందితుల్లో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హత్యకు వాడిన కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితులను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. నిందితుల్లో ఏ2గా రంజాన్‌, గంజి స్వామి (ఏ4), నూకల లింగయ్య (ఏ5), బోడపట్ల శ్రీను (ఏ6), నాగేశ్వరరావు (ఏ7), నాగయ్య (ఏ8)గా పోలీసులు పేర్కొన్నట్లు సమాచారం.

మరోవైపు ఖమ్మం గ్రామీణ మండలం తెల్దారుపల్లి పోలీసుల పహారాలో ఉంది. గ్రామంలోని కూడళ్లలో పోలీసులు బృందాలుగా ఏర్పడి పహారా కాస్తున్నారు. 12 చోట్ల మొత్తం 92 మంది పోలీసులు పికెటింగ్‌ నిర్వహిస్తున్నారు. 12 మంది ఎస్‌ఐలు, ఇద్దరు సీఐల ఆధ్వర్యంలో పికెటింగ్‌ కొనసాగుతోంది. మండల వ్యాప్తంగా ఈనెల 18వ తేదీ వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని సీపీ విష్ణు ఎస్‌.వారియర్‌ ప్రకటించారు. తెల్దారుపల్లిలో కృష్ణయ్య హత్య నేపథ్యంలో కృష్ణయ్య అనుచరులు, గ్రామస్థులు గ్రామంలోని తమ్మినేని కోటేశ్వరరావు, మరికొందరి ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు గట్టి బందోబస్తును నిర్వహిస్తున్నారు. గ్రామంలోని ప్రతి ఇంటిపై నిఘా పెట్టారు. గ్రామస్థులు, ముఖ్యంగా కృష్ణయ్య అనుచరుల కదలికలపై పోలీసులు ఎప్పటికపుడు ఆరా తీస్తున్నారు.

*గుంటూరు: జిల్లాలోని తెనాలి మండలం కొలకలూరులో విషాదఘటన చోటుచేసుకుంది. అప్పుల బాధతో తల్లి, కొడుకు, కోడలు పురుగుల మందు తాగారు. వారిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లి, కొడుకు మృతి చెందగా కోడలు పరిస్థితి విషమంగా ఉంది. మృతులు వసుంధర, కిరణ్‌గా గుర్తించారు. జరిగిన ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
*విశాఖ గాజువాక ఆటోనగర్ అన్నాక్యాంటీన్ సమీపంలో పేలుడు సంభవించింది. గురువారం తెల్లవారుజామున పాన్‌షాపులో పేలుడుతో ప్రహరీగోడ ధ్వంసమైంది. పేలుడు ధాటికి షాపు పైకప్పు ఎగిరి పడింది. గ్యాస్ పేలుడు సంభవించినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు అక్కడకు చేరుకుని ఘటనా స్ధలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
*అఫ్ఘానిస్థాన్‌లోని కాబూల్‌లో ఓ మదర్సాలో బుధవారం భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో 21మంది మృతిచెందగా.. కనీసం 40మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు. నగరంలోని కొతల్‌-ఈ-ఖాయిర్‌ ఖానా వద్ద సాయంత్రం ప్రార్థన సమయంలో ఈ పేలుడు సంభవించిందని పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని కాబూల్‌ సెక్యూరిటీ కమాండ్‌ అధికార ప్రతినిధి ఖాలిద్‌ జడ్రాన్‌ వెల్లడించారు. పేలుడు తీవ్రతకు సమీపంలోని భవనాల అద్దాల పగిలిపోవడం గమనార్హం.

* అఫ్ఘానిస్థాన్‌లోని కాబూల్‌లో ఓ మదర్సాలో బుధవారం భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో 21మంది మృతిచెందగా.. కనీసం 40మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు. నగరంలోని కొతల్‌-ఈ-ఖాయిర్‌ ఖానా వద్ద సాయంత్రం ప్రార్థన సమయంలో ఈ పేలుడు సంభవించిందని పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని కాబూల్‌ సెక్యూరిటీ కమాండ్‌ అధికార ప్రతినిధి ఖాలిద్‌ జడ్రాన్‌ వెల్లడించారు. పేలుడు తీవ్రతకు సమీపంలోని భవనాల అద్దాల పగిలిపోవడం గమనార్హం.

*గుజరాత్‌ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌ (ఏటీఎస్‌) పోలీసులు పెద్దఎత్తున డ్రగ్స్‌ సీజ్‌ చేశారు. వడోదరకు సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ కర్మాగారంలో 225 కిలోల మెఫెడ్రోన్‌ అనే నిషేధిత పదార్థాన్ని మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఈ దాడి చేశామని, సీజ్‌ చేసిన సరుకు విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.1,125 కోట్లు ఉంటుందని అధికారులు బుధవారం ప్రకటించారు. అంతేకాక, ఈ కేసుకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేశామని, మరికొందరి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.

*శ్రీసత్యసాయి: జిల్లాలోని చిలమత్తూరు మండలం కోడూరు దగ్గర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. లారీని వెనుకనుంచి ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ’ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

* ఏలూరు జిల్లా లింగపాలెం మండలం భోగోలు వద్ద అర్ధరాత్రి పిడుగుపడి నలుగురు వలస కూలీలు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం, కత్తిపూడి ప్రాంతాల నుంచి వచ్చిన వి.ధర్మరాజు (25), కొండబాబు(35), వేణు(19), ఆర్‌.రాజు(28) అక్కడికక్కడే మృతి చెందారు.

* భార్యతో గొడవపడి ఉన్మాదిగా మారాడో భర్త. అభంశుభం తెలియని కన్నబిడ్డలిద్దరినీ గొంతుకోసి నిర్దాక్షిణ్యంగా హత్య చేశాడు. ఆపై తాను గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఈ ఘోరం జరిగింది. నిందితుడి భార్య వివరాల ప్రకారం.. కొల్లాపూర్‌ మండలం కుడికిళ్ల గ్రామానికి చెందిన మాల ఓంకార్‌ (35) గతంలో ఇద్దరు భార్యలను వదిలిపెట్టాడు. మహేశ్వరి అనే యువతిని మూడో పెళ్లి చేసుకున్నాడు. వీరికి చందన (7), విశ్వనాథం (3) పిల్లలు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకుంటానని మహేశ్వరి, వద్దని.. ఇంకా పిల్లలు కావాలి అంటూ ఓంకార్‌ కొన్నాళ్లుగా గొడవపడుతున్నారు. బుధవారం దంపతులు, పిల్లలను వెంటబెట్టుకొని బైక్‌పై నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆస్పత్రికి బయలుదేరారు.

* మహిళ రెచ్చగొట్టే విధంగా దుస్తులు ధరించిన సందర్భాల్లో లైంగిక వేధింపుల కేసు ప్రాథమికంగా నిలవబోదని కేరళకు చెందిన ఒక కోర్టు అభిప్రాయపడింది. వృద్ధుడు, దివ్యాంగుడు అయిన రచయిత సివిక్‌ చంద్రన్‌కు లైంగిక వేధింపు కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ ఈ వ్యాఖ్య చేసింది. కొళికోడ్‌ సెషన్స్‌ జడ్జి ఎస్‌.కృష్ణకుమార్‌ ఈ విషయాన్ని తన ఆదేశాల్లో పేర్కొన్నారు. అవాంఛనీయ రీతిలో ప్రవర్తించినప్పుడు మాత్రమే ఐపీసీ సెక్షన్‌ 354ఏ ప్రకారం లైంగిక వేధింపుల కేసు పెట్టడానికి అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుత కేసులో సమర్పించిన ఫొటోలను పరిశీలిస్తే ఆమె రెచ్చగొట్టే తరహా దుస్తులు ధరించి ఎక్స్‌పోజింగ్‌కు పాల్పడినట్టు కనిపిస్తోందని చెప్పారు. ‘‘ఈ సెక్షన్‌ కింద కేసు పెట్టాలంటే శరీరాన్ని తాకి ఉండాలి. అవాంఛనీయ రీతిలో ప్రవర్తించి ఉండాలి.

*రాజకీయాలను వ్యాపారంగా మలచుకోవడంలో కోమటిరెడ్డి బ్రదర్స్‌ దిట్ట అని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. వారికి ఏ పార్టీ కాంట్రాక్టులు ఇస్తే ఆ పార్టీలోకి వెళతారని ఆరోపించారు. మునుగోడు ప్రజల విశ్వాసాన్ని మోదీ, అమిత్‌షాల వద్ద రాజగోపాల్‌రెడ్డి తాకట్టు పెట్టారన్నారు. బుధవారం మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ, చౌటుప్పల్‌ మండలాల్లో ఆసరా పథకం కింద కొత్తగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజగోపాల్‌రెడ్డి మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేస్తే తిరిగి కాంగ్రెస్‌ పార్టీ నుంచే పోటీ చేయాలన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ కుటుంబం కాంగ్రెస్‌ పార్టీతోనే అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణ హక్కులను ఆంధ్రా రాజకీయ నేతల వద్ద వారు అమ్ముకున్నారని, నల్లగొండ జిల్లా ప్రజల నీటి వాటాను వైఎస్‌కి అమ్మిన ద్రోహులని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ ఖాళీ అయిందని తెలిసే బీజేపీలోకి వెళ్తున్నారని ఆరోపించారు. గతంలో తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా ఉంచేందుకే టీఆర్‌ఎస్‌ ఉప ఎన్నికల అస్త్రాన్ని ప్రయోగించిందని తెలిపారు. రాజీనామా చేసిన వారంతా తిరిగి టీఆర్‌ఎస్‌ నుంచే పోటీ చేశారని గుర్తు చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి దక్కేది మూడో స్థానమేనని, అధికారాన్ని దుర్వినియోగం చేసేవారే టీఆర్‌ఎస్‌ నుంచి వెళ్లిపోతున్నారని అన్నారు.

*ఏలూరు జిల్లా లింగపాలెం మండలం భోగోలు వద్ద అర్ధరాత్రి పిడుగుపడి నలుగురు వలస కూలీలు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం, కత్తిపూడి ప్రాంతాల నుంచి వచ్చిన వి.ధర్మరాజు (25), కొండబాబు(35), వేణు(19), ఆర్‌.రాజు(28) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన కె.గణేశ్‌, బుల్లయ్య, అర్జున్‌ను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి… అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు.

*ఉన్మాదిగా మారిన ఒ భర్త కోర్టు ఆవరణలోనే తన భార్య గొంతును కత్తితో కోశాడు. అంతకు పది నిమిషాల ముందే కోర్టులో నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ఇద్దరమూ కలిసి బతుకుతామని నిర్ణయానికి కూడా వచ్చారు. కానీ అంతలోనే పారిపోయేందుకు ప్రయత్నించాడు.

*ఈజిప్టు రాజధాని కైరోలోని ఇంబాబా జిల్లాలో ఉన్న అబు సిఫైన్‌ కాప్టిక్‌ చర్చిలో ఆదివారం చోటుచేసుకున్న అగ్నిప్రమాదం, 41మందిని బలితీసుకుంది. ఈ ప్రమాదం ఎలా సంభవించిందన్నదానిపై స్పష్టత లేదని చర్చి అధికారులు తెలిపారు. ప్రమాదం పట్ల ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా అల్‌-సిసీ దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. అన్ని ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేసి, ఘటన స్థలానికి పంపించామని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన ఫేస్‌బుక్‌లో వెల్లడించారు.

*మచిలీపట్నం లో దారుణం జరిగింది. 17 ఏళ్ల బాలిక కిడ్నాప్‌ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఒక నిందితుడు అరెస్ట్ చేశారు. మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చి బలవంతంగా తీసుకెళ్లారని బాలిక బంధువులు తెలిపారు. వంతెన కిందకి తీసుకెళ్లి హింసించి బలాత్కారం చేశారని చెబుతున్నారు. ఒక యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించామని, పోలీసులు ఇంతవరకు రెండో నిందితుడిని పట్టుకోలేదని తెలిపారు. తమకు న్యాయం జరగలేదని వాపోయారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాలిక బంధువులు కోరుతున్నారు.

*పన్ను కట్టకుండా అక్రమంగా కారులో తరలిస్తున్న బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. ప్రొద్దుటూరు నుంచి కోయంబత్తూరుకు తీసుకెళ్తుండగా.. వైఎస్సార్ జిల్లా చాపాడులో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో 3కిలోల బంగారంతో పాటు, రూ.1.30కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.

* తెలంగాణలోని నల్గొండ జిల్లా తిప్పర్తిమండలం ఎల్లమ్మగూడెం సర్పంచి సంధ్య భర్త విజయ్‌రెడ్డిని దుండగులు దారుణంగా హత్యచేశారు. పొలం పనులు ముగించుకొని ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తుండగా ముగ్గురు వ్యక్తులు తొలుత ఆయన ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. అనంతరం కత్తులు, గొడ్డళ్లతో విచక్షణా రహితంగా దాడి చేయడంతో విజయ్‌రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం మృతదేహాన్ని కాల్వలో పడేసి వెళ్లిపోయారు.
*కర్నూలు జిల్లా కోడుమూరులో దారుణం చోటు చేసుకుంది. తండ్రి గొంతు కోసి కుమారుడు దారుణహత్యకు పాల్పడ్డాడు. దిన్నెదేవరపాడుకు చెందిన బోయ ఎర్ర పుల్లయ్యను కుమారుడు బ్రహ్మ.. కోడుమూరు హంద్రీ వంతెన వద్ద హత్య చేసి పరారయ్యాడు. తండ్రి పుల్లయ్య గతంలో తల్లిని చంపాడన్న కోపంతో.. కుమారుడు బ్రహ్మ అతడ్ని హత్య చేసినట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
*చిత్తూరు జిల్లా గంగవరం మండలం మామడగు వద్ద జరిగిన ప్రమాదంలో తల్లీకుమారుడు మృతి చెందారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన వెంకట్ కుటుంబం ఉద్యోగరీత్యా బెంగుళూరులో స్థిరపడ్డారు. ఈరోజు తమిళనాడులోని వేలూరులో స్నేహితుడిని కలిసి కుటుంబంతో సహా బెంగుళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో గంగవరం దగ్గర కారు టైరు పంక్చరై.. వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ముందు సీట్లో కూర్చున్న గాయత్రి (30), కుమారుడు విథున్ (3) ప్రాణాలు కోల్పోయారు. తండ్రి, కుమార్తెకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది.

* ఎన్టీఆర్ జిల్లా నందిగామ విచక్షణ రహితంగా వ్యక్తిపై దాడి చేసిన నందిగామ బడా వ్యాపారవేత్తదాడిలో తీవ్రంగా గాయపడ్డ నాగేశ్వరరావు బాధితుడు నందిగామ రమణ కాలనీ కు చెందిన గుంటుపల్లి నాగేశ్వరరావుగా(33) గుర్తింపువివాహేతర సంబంధం వలన దాడి జరిగినట్టు సమచారం. తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన బాధితుడు. నాకు న్యాయం చేయాలని పోలీసులకు వేడుకోలు. ఇంటికి బట్టలు పెడతానని పిలిపించి మొదటగా బడా వ్యాపారవేత దాడి చేసి తరువాత గుర్తు తెలియని వ్యక్తుల చేత దాడి చేయించాడని వాపోయిన బాధితుడు. తమకు న్యాయం చేయాలని కన్నీరు మున్నిరుగా విలపిస్తున్న భార్య పిల్లలు.

*మంగళగిరి పట్టణ ఎల్బీ నగర్ లో ఇంటూరి త్రివేణి (30) శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో హత్య కు గావించబడి0ది.భర్త ఇంటూరి శివ శంకర్ ఆమె గొంతు నులిమి హత్యకు పాల్పడినట్లు గా త్రివేణి కుటింబికులు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.త్రివేణి గొంతుపై గాయాలు ఉన్నాయి.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పట్టణ పోలీసులు.

*అక్కకు రక్షగా ఉండాల్సిన తమ్ముడే.. ఆమెను పొట్టనపెట్టుకున్నాడు. ఆమె ప్రియుడిని కూడా హతమార్చాడు. రాఖీ పండగ రోజే ఈ అమానవీయ ఘటన జరగడం కలచివేస్తోంది. మహారాష్ట్రలోని జల్‌గావ్‌లో శుక్రవారం రాత్రి ఈ పరువు హత్య కలకలం రేపింది. మైనర్‌ అయిన నిందితుడు హత్య అనంతరం పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. రాకేశ్‌ సంజయ్‌ రాజ్‌పుత్‌(22), వర్ష సమాథాన్‌ కోలీ(20) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శుక్రవారం పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ విషయం వర్ష ఇంట్లో తెలిసింది. దీంతో ఆమె తమ్ముడు పిస్టల్‌ తీసుకొని వారిని వెంబడించాడు. ఈ క్రమంలోనే రాజ్‌పుత్‌ను కాల్చి చంపిన నిందితుడు.. తన సోదరిని గొంతు నులిమి చంపినట్లు తెలుస్తోంది. అనంతరం ప్రధాన నిందితుడు పిస్టల్‌తో పోలీసులకు లొంగిపోయాడు. మరో మైనర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యలో భాగమైన మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

*హైదరాబాద్‌ నుంచి విహారయాత్రకు వచ్చారు. నాగార్జునసాగర్‌ అందాలను ఆస్వాదించారు. మార్గమధ్యలో ఉన్న అక్కంపల్లి రిజర్వాయర్‌ను కూడా చూడాలనుకొన్నారు. రిజర్వాయర్‌లో నీళ్లను చూడగానే వాళ్లకు స్నానం చేయాలనిపించింది. కట్టకు ఆనుకొని ఉన్న మెట్ల మీద నుంచి కిందికి దిగుతుండగా ఓ యువకుడు జారి నీళ్లలో పడిపోయాడు. అతన్ని కాపాడటానికి మరో యువకుడు చేయందించాడు. అదుపు తప్పి అతడు కూడా నీటిలో మునిగిపోయాడు. ఆ ఇద్దరిని కాపాడబోయి మూడో యువకుడు కూడా రిజర్వాయర్‌లో పడిపోయాడు. ఎవరికీ ఈత రాకపోవడంతో ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో ఫార్మసీ చదువుతున్న ఆ విద్యార్థుల విహార యాత్ర తీవ్ర విషాదంగా మారింది. నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లిలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్యాయర్‌లో మునిగి శనివారం ముగ్గురు విద్యార్థులు చనిపోయారు.

*పెందుర్తి ఎమ్మెల్యే అదీ్‌పరాజ్‌ అనుచరుడు మనోహర్‌, అతని స్నేహితుడు కల్యాణ్‌ ఓ వైద్యురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. అడ్డుకోబోయిన ఆమె భర్తను పొడిచి పారేస్తామంటూ హల్‌చల్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. బాధితుల కథనం ప్రకారం శరగడం శేషు విశాఖ జిల్లా పెందుర్తి ప్రశాంతినగర్‌ సమీపంలో మెడికల్‌ షాపు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య డాక్టర్‌. ఆ దంపతులు శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో బైక్‌పై పెళ్లికి బయలుదేరారు. నల్లక్వారీ సమీపంలోని మర్రిచెట్ల కాలనీకి చెందిన మనోహర్‌, అతని స్నేహితుడు కల్యాణ్‌ బైక్‌పై వీరిని అనుసరిస్తూ డాక్టర్‌ను వేధించసాగారు.

* మరో అడ్వొకేట్‌ దారుణ హత్యకు గురయ్యాడు. కారుతో వెంబడించి.. ఢీకొట్టి.. కత్తులతో, వేటకొడవళ్లతో నరికిన దారుణంగా హత్య చేశారు.

* మదురైలో ఆర్ధిక శాఖ మంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ కారుపై చెప్పు విసిరేసిన కేసులో పోలీసులు ఐదుగురు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. జమ్ము-కశ్మీర్‌లో తీవ్రవాదుల దాడిలో మృతిచెందిన సైనికుడు లక్ష్మణన్‌ భౌతికకాయానికి అంజలి ఘటించేందుకు శనివారం ఉదయం మంత్రి త్యాగరాజన్‌, కలెక్టర్‌ అనీష్‌ శేఖర్‌, మేయర్‌ ఇంద్రాణి, అధికారులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విమానాశ్రయానికి చేరుకున్నారు. కార్యక్రమం అనంతరం మంత్రి వెళ్తుండగా, ఆయన కారుపై గుర్తు తెలియని వ్యక్తులు చెప్పు విసిరేశారు. ఈ సమాచారం తెలుసుకున్న డీఎంకే శ్రేణులు రైల్వేస్టషన్‌లోకి చొరబడి రైల్‌రోకో(Railroco) చేపట్టారు. మంత్రిని అవమానించిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అదే సమయంలో బీజేపీ అధ్యక్షుడు అన్నామలైను కించపరిచేలా మంత్రి వ్యాఖ్యానించారని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తరఫున మదురై నగర పోలీస్‏స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, మంత్రి కారుపై చెప్పు విసిరేసిన వ్యవహారంపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ జరిపి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కుమార్‌, మీడియా విభాగం కార్యదర్శి బాల, గోపినాధ్‌, జయకృష్ణన్‌, మహమ్మద్‌ యాకూబ్‌ తదితరులను అరెస్ట్‌ చేశారు.

*చార్జింగ్‌ పెట్టిన ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీ పేలింది. ఈ ఘటనలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం ఎన్జీవోస్‌ కాలనీలో నివాసముంటున్న చుండి కోటేశ్వరరావు (33) తన ఎలక్ర్టిక్‌ బైక్‌ (మ్యాక్‌ కంపెనీ)కు శనివారం రాత్రి తన ఇంట్లో చార్జింగ్‌ పెట్టాడు. అయితే చార్జింగ్‌ను చెక్‌ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వాహనంలోని బ్యాటరీ భారీ శ బ్దంతో పేలి మంటలు చెలరేగాయి. దీంతో కోటేశ్వర రావు ముఖం, చేతులు, ఛాతికి మంటలు అంటుకుని గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకుని వారు మంటలు ఆర్పడంతో ప్రమాదం తప్పింది.

*ఎన్టీఆర్‌: జిల్లాలోని జాతీయ రహదారిపై ప్రైవేట్‌ బస్సుకి తప్పిన ప్రమాదం తప్పింది. ఆ బస్సు విశాఖ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ప్రమాదం తప్పింది. అదుపుతప్పి రోడ్డు పక్క గుంటలోకి బస్సు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు.

* ఎమ్మిగనూరు మండలం పార్లపల్లిలో దారుణం జరిగింది. హైస్కూల్‌ దగ్గర 10వ తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా యువకుడు ప్రవర్తించే ప్రయత్నం చేశారు. దీంతో తోటి విద్యార్థులు అడ్డుకున్నారు. అనంతరం యువకుడు పరారయ్యారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

*బిహార్ బాంకా జిల్లాలో నకిలీ పోలీసుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఓ గెస్ట్ హౌస్ను పోలీస్ స్టేషన్గా మార్చి అక్రమాలకు పాల్పడుతున్న నకిలీ పోలీసులను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి ఆయుధాలు, యూనిఫామ్స్, ఎఫ్ఐఆర్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనురాగ్ అనే వ్యక్తికి చెందిన గెస్ట్ హౌస్ను పోలీస్ స్టేషన్గా మార్చి అక్రమాలకు పాల్పడుతున్నారు. వీరిని అరెస్ట్ చేసి విచారించగా.. తామంతా రోజువారీ కూలీకి పనిచేస్తున్నామని చెప్పారు. అనితా దేవి అనే మహిళ ఈ పోలీసు బృందాన్ని నడుపుతోంది. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తనను ఇన్స్పెక్టర్గా నియమించారని అనితా చెప్పింది.

*ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులోని ఓ నగల దుకాణంలో చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతోపాటు ప్రత్యేక బృందాల ద్వారా దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. నిందితుల నుంచి రూ.8.90 లక్షల విలువైన 52 గ్రాముల బంగారం,16 కిలోల వెండి, రూ.61 వేలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

*తమ ప్రేమను పెద్దలు నిరాకరించడంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సీతానగరం మండలం బగ్గందొరవలస గ్రామంలో బుధవారం జరిగిన ఈ సంఘటనపై పార్వతీపురం జిల్లా ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఎల్‌.స్రవంతి ఇంటరీ్మడియట్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఎం.శ్రీను కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. వారిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. స్రవంతి తల్లిదండ్రులు ఆమెకు వేరే పెళ్లి నిశ్చయించారు. ఈ విషయం ప్రేమికుడికి స్రవంతి చెప్పి గ్రామంలోని సచివాలయం వద్దకు రమ్మంది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేక చనిపోదామని నిర్ణయం తీసుకుని పురుగు మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశారు. విషయం గమనించిన శ్రీను సోదరుడు గణపతి ఆటోలో ఇద్దరిని పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించారు. ఈ ఘటనపై ఔట్‌పోస్టుపోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*ఎమ్మిగనూరు మండలం పార్లపల్లిలో దారుణం జరిగింది. హైస్కూల్‌ దగ్గర 10వ తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా యువకుడు ప్రవర్తించే ప్రయత్నం చేశారు. దీంతో తోటి విద్యార్థులు అడ్డుకున్నారు. అనంతరం యువకుడు పరారయ్యారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

* ఎమ్మిగనూరు మండలం పార్లపల్లిలో దారుణం జరిగింది. హైస్కూల్‌ దగ్గర 10వ తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా యువకుడు ప్రవర్తించే ప్రయత్నం చేశారు. దీంతో తోటి విద్యార్థులు అడ్డుకున్నారు. అనంతరం యువకుడు పరారయ్యారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

*తిరుమల బ్రేక్ దర్శనం నకిలీ టికెట్ల దందా కేసులో ఐదుగురిని అరెస్టు చేశారు. టీటీడీ సూపరింటెండెంట్ మల్లికార్జున్‌తో పాటు మరో ఐదుగురు వంశీకృష్ణ, మురళీకృష్ణ, వెంకటసుబ్బారావు విజయకుమారి, నవ్యశ్రీ అరెస్ట్‌ చేశారు. కొన్నేళ్లుగా భారీగా వీఐపీ బ్రేక్, సుపథం దర్శన టికెట్లతో పాటు..గదులను అధిక ధరకు కేటాయించినట్లు టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. రూ.500 బ్రేక్ దర్శనం టికెట్‌ను రూ.3 వేలకు, రూ.300 సుపథం టికెట్‌ను రూ.2 వేలకు మల్లికార్జున్ విక్రయించాడు. మొత్తం 25 గదులు, 721 దర్శనం టికెట్లపై అధిక ధరలు వసూలు చేసినట్లు టీటీడీ విజిలెన్స్ నిర్దారించింది.

*నంద్యాల: జిల్లాలోని బనగానపల్లెలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. పలుకూరు-చెరువుపల్లె సమీపంలో రెండు బైకులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు పలుకూరుకు చెందిన తండ్రీకొడుకులుగా గుర్తించారు. మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలాని చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృ‌తదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

*తన విద్యార్హతకు తగిన ఉద్యోగం దొరకలేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌, కడప జిల్లా సంతకొవ్వూరు పరిధి గంగనపల్లి గ్రామానికి చెందిన కంచర్ల గంగమహేశ్వర్‌ రెడ్డి (29) బీటెక్‌ పూర్తి చేశాడు. కొంతకాలం ఓ ప్రైవేటు ఉద్యోగం చేసి మానేశాడు. హైదరాబాద్‌లో ఉద్యోగం కోసం ఇటీవలే నగరానికి వచ్చాడు. కానీ ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. దీంతో సికింద్రాబాద్‌ సమీపంలోని ఆర్‌ఆర్‌ఐ క్యాబిన్‌ వద్ద రైలు కింద పడి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు.

**ప్రకాశం: జిల్లాలోని వెలిగండ్ల మండలం పూలికుంట్లలో దారుణఘటన చోటుచేసుకుంది. కంటికి కనురెప్పలా చూసుకోవాల్సిన తండ్రే కూతురిని కాటేశాడు. అసలు విషయంలోకి వెళ్తే… కూతురిపై తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రిపై పోలీసులు తల్లీకూతురు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు
*గుంటూరు: జిల్లాలోని మంగళగిరి పట్టణానికి చెందిన, తల్లి కొడుకు అదృశ్యమయ్యారు. మండ్రు పద్మ(45) ఆమె కుమారుడు(17) అదృశ్యమయినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ పోలీస్ స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

* మహారాష్ట్రలో అనుమానాస్పద బోట్లు కలకలం సృష్టించాయి. రాయ్‌గఢ్ జిల్లా శ్రీవర్ధన్‌లో అనుమానాస్పద బోటు కనిపించడంతో జిల్లాలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ బోటులో ఏకే-47 రైఫిళ్లతో పాటు కాట్రిజ్డ్‌లు లభ్యమయ్యాయి. ఈ క్రమంలో భద్రతా కారణాల దృష్ట్యా జిల్లావ్యాప్తంగా పోలీసులు దిగ్బంధించారు. దీంతో పాటు హరిహరేశ్వర్‌లో ఓ చిన్న బోటు కనిపించగా, అందులో లైఫ్ జాకెట్, కొన్ని అనుమానాస్పద వస్తువులు దొరికాయి.

*విశాఖ నగరంలో దారుణం జరిగింది. పెందుర్తి నియోజకవర్గం పరిధిలో మరో వాచ్ మెన్ భార్య హత్యకు గురైంది. వారం రోజుల వ్యవధిలో మూడు హత్యలు జరిగాయి. వరుస హత్యలతో పెందుర్తి వాసులు బెంబేలెత్తిపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. సుజాతనగర్, నాగమల్లి లేఅవుట్‌లో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా భార్యాభర్తలు దేవుడు, పాపికొండలు పనిచేస్తున్నారు. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి పాపికొండలును హతమార్చాడు. ఘటనా స్థలంలో అనుమానితున్ని పెందుర్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న ఇనుపరాడ్డును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

*ఏపీలోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. విజయవాడ నుంచి చిలకలూరిపేటకు వెళ్తుండగా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతులు ఎవరనేది వివరాలను సేకరిస్తున్నారు.