Politics

భాజపాకు తెలంగాణ మహిళా మంత్రి వార్నింగ్ – TNI నేటి రాజకీయ వార్తలు

భాజపాకు తెలంగాణ మహిళా మంత్రి వార్నింగ్ –  TNI  నేటి  రాజకీయ వార్తలు

* బీజేపీ నేతలు మాజోలికి వస్తే రోడ్లమీద తిరగరని మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. మంగళవారం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. కులాల మధ్య మతాల మధ్య గొడవ పెట్టిన ఘనత బీజేపీదేనని, బీజేపీ నేతలు ఇళ్ల నుంచి బయటకు వచ్చే ముందు చెప్పిరండి అంటూ సూచించారు. ప్రస్తుతం దేశంలో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, సీఎం కేసీఆర్‌కు భయపడి అక్రమ కేసులు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. మహిళా నాయకురాలి ఇంటిపై దౌర్జన్యం చేయడం మంచిపద్ధతి కాదని సత్యవతి మండిపడ్డారు

* ఏపీపై పవన్‌ వ్యాఖ్యలు వాస్తవమే : సోమిరెడ్డి
ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు స్వేచ్ఛగా బతకడం కోసం మరో ఉద్యమం చేయక తప్పదని అన్నారు. టీడీపీ నాయకుడు సోమిరెడ్డి తెలిపారు. ఏపీలో వైసీపీ అరాచక పాలన కొనసాగిస్తుందని. ఏపీ విముక్తే లక్ష్యమని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యల ను సమర్ధించారు. ఏపీ ప్రజల మనోభావాలనే పవన్‌ కల్యాణ్‌ వ్యక్తపరుస్తున్నాడని అన్నారు.ప్రజా శ్రేయస్సు దృష్ట్యా వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకూడదన్న పవన్‌ వ్యాఖ్యలు వాస్తవమే నని వివరించారు. వైసీపీ నాయకులు జైళ్లకు పోక తప్పదనే భయంతోనే విమర్శిస్తున్నారని మండిపడ్డారు. పవన్‌ లేవనెత్తిన అంశాలకు మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని తెలిపారు.

* ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు నిరాధారం : మహేష్ బిగాల
ఢిల్లీ లిక్క‌ర్ స్కాంకు సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేట‌ర్ మ‌హేశ్ బిగాల ఖండించారు. ఆ ఆరోప‌ణ‌లు నిరాధార‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి రాద‌ని తెలిసి.. టీఆర్ఎస్ నాయ‌కుల‌పై నిందలు మోపి, ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ క‌విత‌పై బుర‌ద‌జ‌ల్లడం స‌రికాద‌న్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజ‌కీయాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని తెలిపారు. స‌రైన స‌మ‌యంలో ప్ర‌జ‌లే బీజేపీకి బుద్ధి చెప్తార‌ని మ‌హేశ్ బిగాల స్ప‌ష్టం చేశారు.

* పాదయాత్రలో ఏం జరగుతుందో ప్రమాణం చేస్తారా?: ఎర్రబెల్లి
ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఖండించారు. కేసులు పెట్టి భయపెట్టాలని కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పాదయాత్రలో ప్రశ్నించేవారిపై బీజేపీ నేతలు దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతచిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. బండి సంజయ్.. పాదయాత్రపై దమ్ముంటే చర్చకు రావాలి, పాదయాత్రలో జరుగుతున్నదేంటి.. ప్రమాణం చేసి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు

* కేసీఆర్‌ను ఎదుర్కోలేక.. కవితపై బీజేపీ నిరాధార ఆరోపణలు : విప్‌ బాల్క సుమన్‌
కేంద్రాన్ని స్పష్టంగా, సూటిగా ప్రశ్నిస్తున్న నేత దేశంలో ఒకే ఒక్కరు సీఎం కేసీఆర్‌ అనీ, బీజేపీ మోసాలను అన్ని వేదికల్లోనూ ప్రశ్నిస్తున్నారని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. కేసీఆర్‌ ప్రశ్నలకు మోదీ, అమిత్‌ షాలకు వణుకుపుడుతోందన్నారు. టీఆర్‌ఎస్‌ ఎల్పీలో ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గణేశ్‌ గుప్తాతో కలిసి మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని నడుస్తున్నదని మోదీ ప్రభుత్వం కాదని.. ఏడీ (అటెన్షన్‌ డై వర్షన్‌) ప్రభుత్వం నడుస్తోందని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ ఉద్యమ పార్టీ అనీ, కేసీఆర్‌ ఉద్యమ బెబ్బులి అన్నారు. కేసీఆర్‌ను ఎదుర్కోలేక బీజేపీ.. ఎమ్మెల్సీ కవితపై నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు.

*రాక్షస పాలనను అంతమొందించాలి: షర్మిల
‘ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, బూటకపు సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలాంటి రాక్షస పాలనను అంతమొందించి ప్రజలు ఆయనకు తగిన గుణపాఠం నేర్పాలి’ అని వైఎస్సార్‌ టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌. షర్మిల అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని మిట్టనందిమల్ల నుంచి ప్రజాప్రస్థానం పాదయాత్రను షర్మిల కొనసాగించారు. మిట్టనందిమల్ల, ఈర్లదిన్నె, కిష్టంపల్లి, నందిమల్ల క్రాస్‌ రోడ్డు, నందిమల్ల పీజేపీ క్యాం పు మీదుగా జూరాల ప్రాజెక్టు వరకు పాదయాత్రను కొనసాగించారు. ఈర ్లదిన్నె, కిష్టంపల్లిలో షర్మిల మాట్లాడుతూ.. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మించకుండా కేసీఆర్‌ పాలమూరు ప్రజలను దగా చేశారని ఆరోపించారు.

డబ్బులు తీసుకున్నట్లు పవన్ నిరూపించగలడా? : గుడివాడ అమర్‌నాథ్జ
నసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్వ్యాఖ్యలకు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ కౌంటర్ ఇచ్చారు. ఏపీలో పెట్టుబడిదారుల నుంచి కమీషన్ తీసుకుంటున్నట్లు పవన్ నిరూపించగలడా? అని ప్రశ్నించారు.‘‘పవన మాటలు చూస్తుంటే చంద్రబాబు దగ్గర డీల్ కుదిరినట్లుంది. చంద్రబాబు కోసం పుట్టిన పార్టీ జనసేన. పవన్ కళ్యాణ్ ఎవరి స్క్రిప్ట్ చదువుతున్నారో అందరికి తెలుసు. సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పవన్‌కు కనిపించలేదా..కళ్ళున్న కాబోదిలా పవన్ వ్యవహరిస్తున్నారు.. ప్రభుత్వం బెదిరిస్తే పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో తిరగగలడా?’’ అని ప్రశ్నించారు.

*మహిళగా ఉండి ఆ వ్యాపారంలోకి వెళ్లడానికి సిగ్గుగా లేదా?: మధుయాష్కీ
లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్రను బయటపెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ డిమండ్ చేశారు. కేసీఆర్ వెంటనే కవితను బర్తరఫ్ చేయాలని సూచించారు. కవితకు ఆదాయ మార్గాలు లేకుండా వందల కోట్లు ఎలా వచ్చాయి?, మహిళగా ఉండి లిక్కర్‌ వ్యాపారంలోకి వెళ్లడానికి సిగ్గుగా లేదా? అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం వెంటనే కేసీఆర్ కుటుంబీకులపై ఈడీ, సీబీఐ దర్యాప్తు చేయించాలన్నారు. లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ పాత్ర పైనా దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆయన ఆరోపించారు.

*బీజేపీ, వైసీపీ.. రెండూ కసాయి పార్టీలే: తులసిరెడ్డి
‘‘బీజేపీ, వైసీపీ… రెండూ కసాయి పార్టీలుగా తయారయ్యాయి. అవి రాష్ట్రానికి పట్టిన రాహు కేతువులు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం, మోసం, అన్యాయం చేసింది. జగన్‌రెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి తాకట్టుపెట్టారు’’ అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన ఓ ప్రకటన చేశారు. ప్రత్యేక హోదా నుంచి విశాఖ ఉక్కు వరకూ వివిధ అంశాలలో కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందంటూ వివరించారు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లుంది వైసీపీ పరిస్థితి అని అన్నారు. ‘‘వైసీపీ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా, మద్యాంధ్రగా, జూదాంధ్రగా, డ్రగ్గాంధ్రగా, గంజాయి ఆంధ్రగా, బూతులాంధ్రగా మార్చింది. ల్యాండ్‌, శాండ్‌, వైన్‌, మైన్‌ మాఫియా రాజ్యమేలుతోంది. బీజేపీ, వైసీపీలను రాష్ట్ర పొలిమేరల నుంచి తరిమికొడితే తప్ప రాష్ట్రానికి మోక్షం లేదు’’ అని తులసిరెడ్డి విరుచుకుపడ్డారు.

*పెట్టుబడులొస్తే.. అప్పులెందుకు చేశారు?: అచ్చెన్న
‘‘రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలను వెళ్లగొట్టడం, కక్ష్య సాధింపుతో ఉన్న భవనాలను పడగొట్టడం… ఇది తప్ప మూడేళ్లలో జగన్‌రెడ్డి మూడు పరిశ్రమలనైనా రాష్ట్రానికి తెచ్చారా?’’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన చేశారు. చంద్రబాబు తెచ్చిన పరిశ్రమలను జగన్‌ తెచ్చినట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. నాడు టీడీపీ ప్రభుత్వం పరిశ్రమలకు భూములు కట్టబెడుతోందంటూ విషప్రచారం చేసిన జగన్‌రెడ్డి అదే భూముల్లో శంకుస్థాపనలు ఎలా చేస్తున్నారని నిలదీశారు. ‘‘గత మూడేళ్లలో రూ.39,350 కోట్ల పెట్టుబడితో 98 పెద్ద పరిశ్రమలు స్థాపించి, 60,541 మందికి ఉద్యోగాలు కల్పించామని, రూ.8,285 కోట్లతో 31,671 చిన్న పరిశ్రమలతో 1,98,521 ఉద్యోగాల కల్పన జరిగిందని ముఖ్యమంత్రి చెప్తున్నారు. కానీ సర్వే గణాంకాల ప్రకారం 2019 ఏప్రిల్‌ నుంచి 2021 డిసెంబరు వరకు పెద్ద పరిశ్రమల్లో 33,560, చిన్న పరిశ్రమల్లో 1,48,809 ఉద్యోగాలు మాత్రమే కల్పించినట్లు ఉంది. 70 వేల ఉద్యోగాల తేడా ఈ ఆరు నెలల్లో వచ్చిందా? ఇన్ని ఉద్యోగాలు వస్తే డిగ్రీ ఉన్న వారిలో 33ు నిరుద్యోగిత ఎలా ఉంటుంది? అని ప్రశ్నించారు. విదేశీ నిధులు 2021లో తెలంగాణకు 1,585 మిలియన్‌ డాలర్లు, కర్ణాటకకు 18,554 మిలియన్‌ డాలర్లు రాగా ఏపీకి 178 మిలియన్‌ డాలర్లు మాత్రమే వచ్చాయని చెప్పారు.

*తెలంగాణలో మార్పు కోసం వచ్చిన ఎన్నికే ఇది: రాజగోపాల్‌రెడ్డి
తెలంగాణలో మార్పు కోసం వచ్చిన ఎన్నికే ఇదని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయే ఎన్నిక అని, సీఎం కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారు? అని ప్రశ్నించారు. మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పుతో కుటుంబ పాలన పోయి.. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు. మునుగోడు ఉప ఎన్నిక.. భవిష్యత్ తరాల కోసమని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠమే లక్ష్యంగా బీజేపీ మునుగోడు ఉప ఎన్నికకు సమరభేరి మోగించనుంది. దుబ్బాక, హుజూరాబాద్‌ తరహాలోనే మునుగోడును కూడా తన ఖాతాలో జమ చేసుకోవాలని, తద్వారా టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుకునేందుకు తహతహలాడుతున్న బీజేపీ నాయకత్వం, అందుకు కార్యాచరణను సిద్ధం చేసుకుంది.

*మునుగోడు ప్రజలను మరోసారి కేసీఆర్ మోసం చేస్తున్నారు: రేవంత్రెడ్డి
మునుగోడు ప్రజలను మరోసారి సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ధ్వజమత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గం ప్రజలకు సాగునీరు అందండం లేదని తెలిపారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ను కేసీఆర్ సర్కార్ పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. కమ్యూనిస్టులను అత్యంత చులకనగా మాట్లాడిన వ్యక్తి కేసీఆరేనని, దిక్కులేని పరిస్థితుల్లో ఇవాళ కమ్యూనిస్టుల కాళ్లు పట్టుకుంటున్నారని ఎద్దేవాచేశారు. కార్మికుల పక్షాన పోరాడే.. కమ్యూనిస్టుల పట్ల గౌరవం ఉందని, కార్మికుల జీవితాల్లో చీకట్లు తెచ్చిన కేసీఆర్ను కమ్యూనిస్టులు ఎలా క్షమించారు? అని ప్రశ్నించారు. కేసీఆర్తో కలుస్తామన్న కమ్యూనిస్టుల నిర్ణయం నిరాశకు గురిచేసిందని తెలిపారు. లోక్సభలో విద్యుత్ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీనేనని గుర్తుచేశారు. ఆగస్టు 8న విద్యుత్ బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు.. టీఆర్ఎస్ నేతలు ఒక్కరు కూడా సభలో లేరని తెలిపారు. దీన్ని బట్టి విద్యుత్ బిల్లులకు టీఆర్ఎస్ మద్దతు తెలిపినట్లే అర్థమవుతోందన్నారు. బీజేపీ (BJP)కి సంపూర్ణంగా టీఆర్ఎస్ (TRS) లొంగిపోయిందని రేవంత్రెడ్డి పేర్కొన్నారు.

*జగన్‌ యువతను అన్ని విధాల మోసం చేశారు: అనురాగ్‌ ఠాకూర్
సీఎం జగన్‌రెడ్డి యువతను అన్ని విధాల మోసం చేశారని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని విమర్శించారు. జగన్‌ను గెలిపించిన యువతే.. ఇప్పుడు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉందని హెచ్చరించారు. వైసీపీ సర్కార్ ఎంతమందికి ఉద్యోగాలిచ్చిందో చెప్పాలని అనురాగ్‌ ఠాకూర్ డిమాండ్ చేశారు. ఏపీలో మద్యం, ల్యాండ్ మాఫియాలు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని దుయ్యబట్టారు. ఢిల్లీ డ్రగ్ మాఫియాలో సీఎం కేజ్రీవాల్పా త్ర ఉందని ఆరోపించారు. లిక్కర్ మాఫియాతో ఏపీ ప్రభుత్వానికి లింకు ఉందని తెలిపారు. త్వరలోనే అన్ని బయటకొస్తాయని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో అవినీతి జరిగే రాష్ట్రాల్లో నాలుగో స్థానంలో ఏపీ, రెండో స్థానంలో తెలంగాణ ఉందని తెలిపారు. సీఎం కేసీఆర్, జగన్‌ అవినీతిలో పోటీపడుతున్నారని అనురాగ్‌ ఠాకూర్ దుయ్యబట్టారు.

*రాష్ట్రాభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం: సోము వీర్రాజు
బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఏపీలో జగన్‌ను గద్దె దింపే సత్తా ఒక్క బీజేపీకే ఉందన్నారు. జగన్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, త్వరలో అందరూ నివ్వెరపోయేలా పరిణామాలు ఉంటాయని తెలిపారు. విగ్రహాలు, రథాలు ధ్వంసంపై బీజేపీ పోరాటంతో ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. రాయలసీమ యాత్ర చేసి ప్రాజెక్టుల పనులు చేపడతామని పేర్కొన్నారు. ప్రధాని మోదీ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని, రాష్ట్రాభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

*తొలిరోజు 75 లక్షల మొక్కలు నాటాం : ఇంద్రకరణ్‌
స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ప్రారంభించిన ప్రత్యేక హరితహారంలో మొదటి రోజు రాష్ట్రవ్యాప్తంగా 75 లక్షల మొక్కలను నాటినట్లు అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌ కొత్తగూడ బొటానికల్‌ గార్డెన్‌లో మొక్కలు నాటి ప్రత్యేక హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్యావరణ, పచ్చదనంతోనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, చెట్లు లేకపోతే మనగడనే లేదన్నారు. తెలంగాణలో హరితహారం కార్యక్రమాన్ని అమలు చేయడంతో రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందన్నారు. నాటిన మొక్కలను బాధ్యతగా సంరక్షించుకోవాలన్నారు. ప్రత్యేక హరితహారం ద్వారా ఈ ఏడాది 19.54 కోట్ల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు.

*జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు: సీఎం రమేష్
సీఎం జగన్ప్ర జలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని సీఎం రమేష్ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగాలు ఇవ్వలేదని, పరిశ్రమలు తీసుకురాలేదని విమర్శించారు. ఏపీలో యువత భవిష్యత్కు భరోసా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం జగన్ మాటలను విశ్వసించే పరిస్థితి రాష్ట్రంలో లేదన్నారు. ప్రతి పనిలోనూ రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి‌ పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేసే మోదీకి పట్టం కట్టాలని సీఎం రమేష్ పిలుపునిచ్చారు.

*ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే: యార్లగడ్డ
ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు, శంకుస్థాపన, ప్రారంభోత్సవ శిలాఫలకాలు, ఫ్లెక్లీలు, బ్యానర్లు తెలుగులోనే ఉండాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ హెచ్చరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని హిందీ భవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగులో శిలాఫలకాల తయారీలో విఫలమైతే బాధ్యులైన ప్రభుత్వ శాఖాధిపతి లేదా సంస్థాధిపతికి రూ.10వేల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. తెలుగులో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపని అధికారులకు, తెలుగు భాష అమలును సమీక్షించని శాఖాధిపతికి రూ.5వేలు, ప్రభుత్వ ఉద్యోగి ప్రజలతో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాల్లో తెలుగును ఉపయోగించకపోతే రూ.10వేల వరకు జరిమానా ఉంటుందన్నారు.

*కాంగ్రెస్‌ అధికారంలోకి రాకపోతే రాజ్యాంగాన్ని మార్చేస్తారు
కాంగ్రెస్‌ పార్టీ 2024లో అధికారంలోకి రాకపోతే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రచించిన భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజీపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఏఐయూడబ్ల్యూఈసీ జాతీయ చైర్మన్‌ ఉదిత్‌రాజ్‌ ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం ఆలిండియా అనార్గనైజ్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ కాంగ్రెస్‌ (ఏఐయూడబ్ల్యూఈసీ) రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌వీ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభకు ఉదిత్‌రాజ్‌తోపాటు, పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదిత్‌రాజ్‌ మాట్లాడుతూ.. అసంఘటిత రంగ కార్మికుల కోసం కాంగ్రెస్‌ పాలనలో అనేక చట్టాలు, సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేసిందన్నారు. అయితే బీజేపీ వాటిని నిర్వీర్యం చేసిందని.. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసిందని ఆరోపించారు. జాతి సంపదను కేవలం ఐదు కుటుంబాలకు ప్రధాని మోదీ పంచిపెడుతూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శైలజానాథ్‌ మాట్లాడుతూ రాహుల్‌గాంధీ వచ్చే నెల 7న కన్యాకుమారి నుంచి కాశ్మీరు వరకు పాదయాత్ర ప్రారంభిస్తున్నారని, ఈ పాదయాత్ర నాలుగురోజులు ఆంధ్రప్రదేశ్‌లో ఉంటుందన్నారు. అదోని మీదుగా సుమారు 100 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారని చెప్పారు.

*నారా లోకేష్ అరెస్టు అప్రజాస్వామికం: బొరగం శ్రీనివాసులు
టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) అక్రమ అరెస్టును టీడీపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు ఖండించారు. పలాసలో టీడీపీ నేతలు, కార్యకర్తల ఆస్తుల విధ్యంసమే లక్ష్యంగా వైసీపీ (YSRCP) నేతలు పనిచేస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నేతల అక్రమాలను ప్రశ్నించిన టీడీపీ కౌన్సిలర్ సూర్యనారాయణ ఇంటిని కూల్చేందుకు యత్నించడం ప్రశ్నించే గొంతులను అణచివేయడమేనన్నారు. వైసీపీ మంత్రులు, నాయకుల చేతిలో పోలీసులు కీలు బొమ్మలుగా మారడం బాధాకరమన్నారు. పలాసలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పోలీసు శాఖకు అప్రతిష్టపాలు చేస్తుందన్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు కక్షపూరిత చర్యలు మానుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

*కేంద్రం.. మా జోలికి రావొద్దు: ఎర్రబెల్లి
‘‘మా జోలికి రావొద్దు.. పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నాం. అధికారం కోసం కుట్రలు చేసి విచ్ఛిన్నం చేయవద్దు’’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హనుమకొండలోని వరంగల్‌ మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయ ఆవరణలో శనివారం అశోక స్థూపాన్ని ఆవిష్కరించారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తెలంగాణకు కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వకపోయినా అభివృద్ధిలో ముందుకుపోతున్నామని చెప్పారు. మహాత్మాగాంధీ చూపిన అహింసా మార్గంలోనే కేసీఆర్‌ ఉద్యమాన్ని నడిపించి రాష్ట్రాన్ని సాధించారన్నారు.

*వైసీపీ హయాంలో రైతులు దోపిడీకి గురవుతున్నారు: శైలజానాథ్
(YCP) వైసీపీ హయాంలో రైతులు దోపిడీకి గురవుతున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురంలో కాంగ్రెస్ నేతల వినూత్న నిరసన చేపట్టారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. పాతూరు కూరగాయల మార్కెట్ను పరిశీలించి.. కూరగాయల ధరలను శైలజానాథ్ అడిగి తెలుసుకున్నారు. కొత్తిమీర కట్ట అమ్ముతూ నిరసన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుతోనే నిత్యావసరాల ధరలు పెరిగాయని తెలిపారు. నిత్యావసరాల ధరల పెంపును వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 4న ఢిల్లీ రామ్లీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని శైలజానాథ్ ప్రకటించారు.

*సమాజంలో మార్పు కోసమే అన్నయ్య పార్టీ పెట్టారు: పవన్t
సమాజంలో మార్పు కోసమే అన్నయ్య (చిరంజీవి) పార్టీ పెట్టారని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) తెలిపారు. తానెప్పుడూ పదవి కోరుకోలేదని, సమాజంలో మార్పు కోరుకున్నానని పేర్కొన్నారు. కులమతాలపై రాజకీయం చేస్తే దేశం విచ్ఛిన్నం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వారసత్వ రాజకీయాలకు కొంతైనా అడ్డుకట్ట వేయాలని కోరారు. రాయలసీమలోని మాల, మాదిగలు, బోయ, కురబ, పద్మశాలి, బలిజల గురించి ఏనాడైనా ఆలోచించారా? అని ప్రశ్నించారు. పేదరికంలో ఉన్న కులాల గురించే తాను ఆలోచిస్తానని చెప్పారు. సీమలోని రెడ్డి, క్షత్రియ కులాల్లో కూడా పేదలు ఉన్నారని తెలిపారు. అగ్ర కులాలు ఘర్షణ పడితే సమాజంలో ఇబ్బందులు వస్తాయని చెప్పారు. అన్ని కులాలకూ సాధికారత రావాలని ఆకాంక్షించారు. సమాజం ఎప్పుడూ ఒకేలా ఉండకూడదని మార్పు రావాలన్నారు. వైసీపీ (YCP) ప్రభుత్వ పనుల వల్ల రెడ్డి కులానికీ నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. సొంత బాబాయ్‌ని చంపినవారినీ ఇంకా ఎందుకు పట్టుకోలేదు? అని ప్రశ్నించారు. సుగాలి ప్రీతి ఘటన కేసులో నిందితులపై చర్యలేవీ? అని పవన్‌కల్యాణ్ ప్రశ్నించారు.

*ఇళ్లపట్టాల పేరుతో కోట్లు కాజేశారు: జనార్దన్ రెడ్డి
బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి‌ (Katasani Ram Reddy)పై మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి (BC Janardhan Reddy) ఘాటు విమర్శలు చేశారు. ఇళ్లపట్టాల పేరుతో కాటసాని రూ.2 కోట్లకు పైగా ప్రజల నుంచి అక్రమంగా వసూలు చేశారని ఆరోపించారు. ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని ప్రజల నుంచి ఒత్తిడి రావడంతో కాటసాని ఫ్రస్టేషన్‌లో ఉన్నాడని తెలిపారు. సొంత బావమరిదితో కిరాయి హత్యలకు పాల్పడడం, డబ్బుల కోసం బెంగళూరులో కాంట్రాక్టర్‌పై హత్యాయత్నం చేశారని ఆరోపించారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి సవాల్ విసిరారు.

*మరణం వెనుక వైసీపీ నేతల హస్తం: పిల్లి
వైసీపీ అక్రమ మైనింగ్‌లో తలదూర్చిన వారంతా జగన్‌రెడ్డి గ్యాంగ్‌ చేతుల్లో కనుమరుగవుతున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు ఆరోపించారు. జగన్‌రెడ్డికి అక్రమ లింకుల్లో ఉన్న వారంతా ఇలా ఆత్మహత్యలకు గురి కావాల్సిందేనా? అని ప్రశ్నించారు. వైసీపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన సంఘటనలపై ముఖ్యమంత్రి, పోలీసులు వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. శనివారం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథ్‌రెడ్డి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయన్నారు. ‘రామచంద్రారెడ్డి కుటుంబంపై ఎవరు కక్ష కట్టారు? ఆ కుటుంబంలోని వ్యక్తులంతా ఎందుకు ఆత్మహత్యకు యత్నిస్తున్నారు? మంజునాథ్‌రెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది?’ అని ప్రశ్నించారు. ఆయన మరణం వెనుక వైసీపీ నేతల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయని ఆరోపించారు. మంజునాథ్‌రెడ్డి తండ్రి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడిన వీడియోనూ మీడియాకు చూపించారు.

*ఆ రెండు పత్రాలూ బయటపెట్టాలి: రఘురామ
ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ యజమాని జిమ్‌ స్టాఫర్డ్‌కు ఏపీ సీఐడీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌ రాసిన లేఖను, దానికి ప్రత్యుత్తరంగా వారు ఇచ్చిన వాస్తవ నివేదికను బయటపెట్టాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్‌ చేశారు. ఆ రెండు పత్రాలకు మధ్య ఉన్న తేడా తెలిసిపోతే ఖేల్‌ఖ తం… దుకాణం బంద్‌ అని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఢిల్లీలో మాట్లాడారు. గోరంట్ల మాధవ్‌ డర్టీ వీడియోపై టీడీపీ నాయకులు విడుదల చేసింది తప్పుడు నివేదికని ఎలా నిర్ధారిస్తారన్నారు. జిమ్‌ స్టాఫర్డ్‌ కార్యాలయ సిబ్బంది ఒరిజినల్‌ రిపోర్టులో ఒకటి, రెండు పదాలను మార్చి నివేదిక ఇచ్చి ఉండొచ్చు కదా అని అనుమానం వ్యక్తం చేశారు.మీడియా ప్రతినిధులకు సునీల్‌ కుమార్‌… ఒరిజినల్‌ నివేదిక ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. కాగా, ఎక్స్చేంజీలో విద్యుత్తు కొనుగోళ్లకు 24 గంటల వ్యవధిలో డబ్బులు చెల్లించాలని, అలాంటప్పుడు మూడేళ్ల 3 నెలల క్రితం పదవి నుంచి దిగిపోయిన చంద్రబాబుకు, ప్రస్తుత విద్యుత్తు కొనుగో లు బకాయిలకు సంబంధం ఏమిటో చెప్పాలని రఘురామ డిమాండ్‌ చేశా రు. రాష్ట్ర విభజన అనంతరం రెండున్నరేళ్ల పాటు ప్రజలు విద్యుత్‌ కష్టాలను ఎదుర్కొన్న మాట వాస్తవమేనని, కానీ గత ప్రభుత్వ చివరి రెండున్నర ఏళ్లలో ఆ ఇబ్బందులు తొలగిపోయాయన్నారు.

*కులం బోర్డుతో రాజకీయాలు తగవు: సవితమ్మ
ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి, వైసీపీ ప్రభుత్వానికి, ఆ పార్టీ నేతలకు దమ్ముంటే ఎంపీ మాధవ్‌ న్యూడ్‌ వీడియోని ఢిల్లీలోని కేంద్ర ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపాలని రాష్ట్ర కురుబ కార్పొరేషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ ఎస్‌ నవితమ్మ డిమాండ్‌ చేశారు. ఎంపీ మాధవ్‌ కులం బోర్డు తగిలించుకుని, కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

*రాష్ట్రం పారిశ్రామికంగా వెనుకబడింది: అయ్యన్న
వైసీపీ మూడేళ్ల పాలనలో రాష్ట్రం పారిశ్రామికంగా వెనుకబడిందని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. శుక్రవారం వీడియో సందేశాన్ని విడుదల చేశా రు. ఏపీని పారిశ్రామికంగా అభివృద్ధి చేసినట్టు సీఎం జగన్‌ గొప్పలు చెప్ప డం హాస్యాస్పదమన్నారు. ‘‘చంద్రబాబు రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చిన సంగ తి ప్రజలందరికీ తెలుసు. అప్పట్లో ఏపీకి 14 కంపెనీలు చంద్రబాబు తీసుకురాగా… జగన్‌రెడ్డి సీఎం అయిన తర్వాత కమీషన్లకు భయపడి పారిశ్రామికవేత్తలు పారిపోయారు’’ అని అయ్యన్న ఆరోపించారు.

*సీఐడీ చీఫ్‌ని శాశ్వతంగా ఉంచుతారా: పిల్లి
‘‘వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో వాస్తవమా? కాదా? అని తేల్చాల్సిన సీఐడీ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆ వీడియోపై ఆరోపణలను నివృత్తి చేయడానికి ఏం చర్యలు తీసుకున్నారు? కమ్మకులానికి చెందిన వారిని మాధవ్‌ దూషించినప్పుడు సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ ఎందుకు బయటకు రాలేదు? జగన్‌రెడ్డి ఏమైనా.. సీఐడీ చీఫ్‌గా సునీల్‌కుమార్‌ని శాశ్వతంగా ఉంచుతారనుకుంటున్నారా?’’ అని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

*ఫ్లోరైడ్‌ రక్కసిని కేసీఆర్‌ పారదోలారు: జగదీష్‌రెడ్డి
2014కు ముందు మునుగోడు లో దీన పరిస్థితులు ఉండేవని, ఎడారిలాంటి నల్లగొండ జిల్లాను సీఎం కేసీఆర్‌ సస్యశ్యామలంగా మార్చారని మంత్రి జగదీష్‌రెడ్డి కొనియాడారు. మునుగోడులో టీఆర్ఎస్‌ ఆధ్వర్యంలో ప్రజాదీవెన సభ నిర్వహించారు. ఈ సభలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఫ్లోరైడ్‌ రక్కసిని కేసీఆర్‌ పారదోలారని తెలిపారు. గతంలో కేసీఆర్‌ ఎక్కడికెళ్లినా జిల్లా ఫ్లోరైడ్‌ గురించే చెప్పేవారని, నల్లగొండకు ఏదైనా చేస్తే ముందు ఫ్లోరైడ్‌ నివారణే అన్నారని జగదీష్‌రెడ్డి గుర్తుచేశారు.

*కాళేశ్వరం వండర్‌ కాదు, బ్లండర్‌: కె.లక్ష్మణ్‌
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరిట రూ.90వేల కోట్ల ప్రజాధనం దోచుకున్నారని, కాళేశ్వరం వండర్‌ కాదు, బ్లండర్‌ అని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ సెల్‌ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మం డలం గూడూరులో విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్‌ ఇంజనీర్‌ అవతారమెత్తి, కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్‌ చేసి, ఈ ప్రాజెక్టు వండర్‌ అంటూ వారికివారే కితాబిచ్చుకున్నారని తెలిపారు. కాళేశ్వరం పంపుహౌ్‌సతోపాటు మోటార్లు కూడా నీట మునిగిపోవడంతో, ఈ ప్రాజెక్టు వండర్‌ కాదని, బ్లండర్‌ అని స్పష్టమైందన్నా రు. కాళేశ్వ రం ప్రాజెక్టు కాస్త ఖాళీ ఈశ్వరం… కాజేశ్వరం ప్రాజెక్టుగా మారిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణ వ్యయాన్ని రూ.30వేల కోట్ల నుంచి రూ.1.20లక్షల కోట్లకు పెంచుకుని, రూ.90వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అవినీతిని ప్రశ్నిస్తే మంత్రులు కొత్త భాష్యం చెబుతున్నారని విమర్శించారు.

*వైసీపీ హయాంలో రైతులు దోపిడీకి గురవుతున్నారు: శైలజానాథ్
వైసీపీ హయాంలో రైతులు దోపిడీకి గురవుతున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురంలో కాంగ్రెస్ నేతల వినూత్న నిరసన చేపట్టారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. పాతూరు కూరగాయల మార్కెట్ను పరిశీలించి.. కూరగాయల ధరలను శైలజానాథ్ అడిగి తెలుసుకున్నారు. కొత్తిమీర కట్ట అమ్ముతూ నిరసన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుతోనే నిత్యావసరాల ధరలు పెరిగాయని తెలిపారు. నిత్యావసరాల ధరల పెంపును వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 4న ఢిల్లీ రామ్లీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని శైలజానాథ్ ప్రకటించారు.

*రాబోయే రోజుల్లో మహాసంగ్రామం: ఎంఏ బేబీ
విజయవాడ ఎంబీవీకేలో ‘జాతీయోద్యమంలో కమ్యూనిస్టుల పాత్ర- దేశంలో నేటి పరిస్థితులు’ అనే అంశంపై సదస్సు జరిగింది. సదస్సులో పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఎంఏ బేబీ మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్నప్పటికీ ఆ ఫలాలు నేటికీ అట్టడుగు వర్గాలకు అందడం లేదన్నారు. మహాత్మాగాంధీ, కమ్యూనిస్టులు ఆశించిన విధంగా దేశంలో పరిస్థితులు లేవని తెలిపారు. రాబోయే రోజుల్లో మహాసంగ్రామం చేయాల్సి ఉందని చెప్పారు.

*కాలాతీత జ్ఞానాన్ని ప్రసాదించిన శ్రీకృష్ణుడు: చంద్రబాబు
భగవద్గీత ద్వారా మానవాళికి కాలాతీత జ్ఞానాన్ని ప్రసాదించిన శ్రీకృష్ణ భగవానుని జన్మదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్న తెలుగు ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుడు అందరికీ ఆనంద, సౌభాగ్యాలను, అద్భుత విజయాలను అనుగ్రహించాలని శుక్రవారం ట్విటర్‌లో ఆకాంక్షించారు.

*సీఐడీ చీఫ్‌ని శాశ్వతంగా ఉంచుతారా: పిల్లి
‘‘వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో వాస్తవమా? కాదా? అని తేల్చాల్సిన సీఐడీ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆ వీడియోపై ఆరోపణలను నివృత్తి చేయడానికి ఏం చర్యలు తీసుకున్నారు? కమ్మకులానికి చెందిన వారిని మాధవ్‌ దూషించినప్పుడు సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ ఎందుకు బయటకు రాలేదు? జగన్‌రెడ్డి ఏమైనా.. సీఐడీ చీఫ్‌గా సునీల్‌కుమార్‌ని శాశ్వతంగా ఉంచుతారనుకుంటున్నారా?’’ అని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

*రేప్‌ కేసుల్లో దోషులను చచ్చేదాకా జైల్లోనే ఉంచాలి: కేటీఆర్‌
అత్యాచార కేసులో దోషిగా తేలిన వ్యక్తికి సమాజంలో ఉండే అర్హత లేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రేప్‌ కేసుల్లో దోషులను చనిపోయేవరకు జైలులోనే ఉంచాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న జువనైల్‌ జస్టిస్‌ చట్టం, భారత శిక్షాస్మృతి, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో లోపాలున్నాయని ఆయన పేర్కొన్నారు. రేప్‌ కేసుల్లో నిందితులకు బెయిల్‌ ఇవ్వకుండా పకడ్బందీ చట్టాన్ని రూపొందించాలన్నారు. జూబ్లీహిల్స్‌ రేప్‌ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై సోషల్‌మీడియాలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. నిందితులను అరెస్ట్‌ చేసి, జైలుకు పంపామని తెలిపారు. హైకోర్టు 45 రోజుల తర్వాత బెయిలు మంజూరు చేసిందన్నారు. చట్ట ప్రకారం నిందితులకు శిక్షపడే వరకూ తమ ప్రభుత్వం పోరాడుతుందన్నారు.

*ఆ రెండు పత్రాలూ బయటపెట్టాలి: రఘురామ
ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ యజమాని జిమ్‌ స్టాఫర్డ్‌కు ఏపీ సీఐడీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌ రాసిన లేఖను, దానికి ప్రత్యుత్తరంగా వారు ఇచ్చిన వాస్తవ నివేదికను బయటపెట్టాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్‌ చేశారు. ఆ రెండు పత్రాలకు మధ్య ఉన్న తేడా తెలిసిపోతే ఖేల్‌ఖ తం… దుకాణం బంద్‌ అని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఢిల్లీలో మాట్లాడారు. గోరంట్ల మాధవ్‌ డర్టీ వీడియోపై టీడీపీ నాయకులు విడుదల చేసింది తప్పుడు నివేదికని ఎలా నిర్ధారిస్తారన్నారు. జిమ్‌ స్టాఫర్డ్‌ కార్యాలయ సిబ్బంది ఒరిజినల్‌ రిపోర్టులో ఒకటి, రెండు పదాలను మార్చి నివేదిక ఇచ్చి ఉండొచ్చు కదా అని అనుమానం వ్యక్తం చేశారు.మీడియా ప్రతినిధులకు సునీల్‌ కుమార్‌… ఒరిజినల్‌ నివేదిక ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. కాగా, ఎక్స్చేంజీలో విద్యుత్తు కొనుగోళ్లకు 24 గంటల వ్యవధిలో డబ్బులు చెల్లించాలని, అలాంటప్పుడు మూడేళ్ల 3 నెలల క్రితం పదవి నుంచి దిగిపోయిన చంద్రబాబుకు, ప్రస్తుత విద్యుత్తు కొనుగో లు బకాయిలకు సంబంధం ఏమిటో చెప్పాలని రఘురామ డిమాండ్‌ చేశా రు. రాష్ట్ర విభజన అనంతరం రెండున్నరేళ్ల పాటు ప్రజలు విద్యుత్‌ కష్టాలను ఎదుర్కొన్న మాట వాస్తవమేనని, కానీ గత ప్రభుత్వ చివరి రెండున్నర ఏళ్లలో ఆ ఇబ్బందులు తొలగిపోయాయన్నారు.

*కాళేశ్వరం వండర్‌ కాదు, బ్లండర్‌: కె.లక్ష్మణ్‌
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరిట రూ.90వేల కోట్ల ప్రజాధనం దోచుకున్నారని, కాళేశ్వరం వండర్‌ కాదు, బ్లండర్‌ అని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ సెల్‌ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మం డలం గూడూరులో విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్‌ ఇంజనీర్‌ అవతారమెత్తి, కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్‌ చేసి, ఈ ప్రాజెక్టు వండర్‌ అంటూ వారికివారే కితాబిచ్చుకున్నారని తెలిపారు. కాళేశ్వరం పంపుహౌ్‌సతోపాటు మోటార్లు కూడా నీట మునిగిపోవడంతో, ఈ ప్రాజెక్టు వండర్‌ కాదని, బ్లండర్‌ అని స్పష్టమైందన్నా రు. కాళేశ్వ రం ప్రాజెక్టు కాస్త ఖాళీ ఈశ్వరం… కాజేశ్వరం ప్రాజెక్టుగా మారిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణ వ్యయాన్ని రూ.30వేల కోట్ల నుంచి రూ.1.20లక్షల కోట్లకు పెంచుకుని, రూ.90వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అవినీతిని ప్రశ్నిస్తే మంత్రులు కొత్త భాష్యం చెబుతున్నారని విమర్శించారు.