Politics

అనకాపల్లి జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబుకు నిరసన సెగ..

అనకాపల్లి జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబుకు నిరసన సెగ..

అనకాపల్లి జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబుకు మరోసారి నిరసన తగిలింది. ఎమ్మెల్యే కన్నబాబు చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని దొప్పెర్ల గ్రామస్థులు అడ్డుకున్నారు.ప్రభుత్వ పథకాల అమలు విషయంలో ఎమ్మెల్యే వివక్ష చూపిస్తున్నారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కన్నబాబు వద్దు-జగనన్న ముద్దు అంటూ నినాదాలు చేశారు. కన్నబాబు అరాచకాలు సీఎం జగన్ వరకు చేరాలని.. కన్నబాబు అరాచకాలు నశించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఎమ్మెల్యే కన్నబాబు రాజుతో దొప్పెర్ల గ్రామస్తులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. దీంతో పోలీసులు, దొప్పెర్ల గ్రామస్తులకు మధ్య తోపులాట జరిగింది. కన్నబాబు దిష్టిబొమ్మ దహనం చేసేందుకు గ్రామస్తులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.