Devotional

TNI ఆధ్యాత్మికం.. శాస్త్రవేత్తలకి అర్థం కాని శివాలయాలు

TNI ఆధ్యాత్మికం.. శాస్త్రవేత్తలకి అర్థం కాని శివాలయాలు

కేదారేశ్వర జ్యోతిర్లింగము
మహాద్రిపార్శ్వే చ తటే రమంతం
సంపూజ్యమానం సతతం మునీంద్రైః
సురాసురైర్యక్తమహోరగాద్యైః
కేదారమీశం శివమేకమీడే

చాగంటి వారి – శివమహాపురాణము నుండి కేదారేశ్వరలింగం –
ఇది హిమాలయ పర్వతములలో వెలసిన లింగము. నరనారాయణులిద్దరూ కూడా సాక్షాత్తుగా ఈ భూమండలం మీద బదరీ క్షేత్రమునందు తపస్సు చేసినప్పుడు ద్యోతకమైన శివలింగము. కేదారమునందు ఉన్న శివలింగమును దర్శనం చేసినా, చేయడానికి వెడుతున్నప్పుడు మరణించినా మోక్షమే!

కేదారేశ్వరంలో నరనారాయణులు ఒక పార్ధివ లింగమును ఉంచి ఆరాధన చేస్తూ ఉండేవారు. పార్ధివ లింగము అంటే మట్టితో చేసిన శివలింగం. మట్టితో చేసిన ఆ శివలింగమును వారు సాక్షాత్తు ఈశ్వరుడు అని నమ్మారు. అమరకోశంలో ఈశ్వరశబ్దము కేవలం శివుడికే వర్తిస్తుంది. వారు ఆ లింగమును జగత్ప్రభువు, జగన్నియామకుడు అని నమ్మారు. నమ్మి, నరనారాయణులు ఆ శివలింగమునకు అర్చన చేస్తున్నారు.

అప్పుడు ఆ శివలింగము లోంచి పరమశివుడు ఆవిర్భవించి, “మీరు చేసిన పూజకు నేను ఎంతో పొంగిపోయాను. ఇంత చల్లటి ప్రాంతంలో, ఇంత తపస్సుతో పార్థివ లింగమునకు ఇంత అర్చన చేశారు. మీకేమి కావాలో కోరుకోండి” అని అడిగాడు. అప్పుడు వారు –

“స్వామీ! ఇక్కడే ఈ బదరీ క్షేత్రమునకు ఆవలివైపు హిమాలయ పర్వత శృంగముల మీద నీవు స్వయంభువు లింగమూర్తివై వెలసి లోకమును కాపాడు” అని అడిగారు. వారి కోరిక ప్రకారం స్వామి అక్కడ వెలిశారు.

కేదారనాథ్ యాత్ర చాలా కష్టమైన యాత్ర. అయినప్పటికీ, వెళ్ళి తీరవలసిన యాత్ర. కేదార శివలింగ దర్శనం చేసినవాడికి మోక్షము కరతలామలకము అని శివమహాపురాణము, పెద్దలు నిర్ణయం చేశారు. కేదారం వెళ్ళి వచ్చినవాడికి అంతటా శివుణ్ణి చూడటం అభ్యాసంలోకి రావాలి. అంత పరమపావనమైన క్షేత్రం కేదారక్షేత్రం.
శంకర భగవత్పాదులు ఇక్కడే తమ సత్యదండమును వదిలిపెట్టేశారు, అని భక్తుల నమ్మకం. అక్కడ ఆ సత్యదండం పెద్ద ఫోటో ఒకటి ఉంటుంది.

కేదారక్షేత్రం వెళ్ళినవారు తెలియక ఒక పొరపాటు చేస్తూఉంటారు. కేదార లింగమును తిన్నగా కంటితో చూడకూడదు. వలయమును పట్డుకొని వెళ్ళాలి. వలయము అంటే చేతికి వేసుకునే కంకణము వంటి గుండ్రని వస్తవును తీసుకువెళ్ళాలి. అంతరాలయంలో ప్రవేశించగానే కంటిముందు ఆ వలయం పెట్డుకుని అందులోంచి చూడాలి.

కేదారము, దర్శనముచేత మోక్షమీయగలిగిన క్షేత్రము కనుక సమస్తబ్రహ్మాండము నిండినవాడు ఈయనే అని తెలుసుకోవడానికి, కంటికి అడ్డంగా ఒక వలయాకారమును పెట్డుకొని అందులోంచి కేదారలింగమును చూడాలి. అలా చూసిన వలయకంకణమును అక్కడ వదిలిపెట్డి వచ్చెయ్యాలి. మనచేతికి ఉన్న ఏ బంగారు కంకణమునో ఉపయోగించినట్లైతే దానిని అక్కడ వదిలిపెట్టేయడానికి మనస్సు ఒప్పదు కాబట్డి ముందే ఒక రాగి కంకణమును పట్డుకుని వెడితే, రాగి చాలా ప్రశస్తము కనుక , ఆ కంకణంలోంచి కేదారలింగ దర్శనం చేసి దానిని అక్కడ వదిలి రావచ్చు.

__________________________

శాస్త్ర వేత్తలకే అర్థంకాని శివాలయాలు 💐

💐మహానంది శివలింగ అడుగునుండి వచ్చే నీటితో కొన్నివేల ఎకరాలు పంటభూమి పండుతున్నది. బయట ఉండే కొనేరులో గుండుసూది వేసినా కనపడుతుందిఎంత చలికాలంలో కూడా కొనేరులో నీరు గోరు వెచ్చగా ఉంటుంది.ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం (కందుకూరు కనిగిరి మధ్య ) కె. అగ్రహారంలోని కాశివిశ్వేశ్వర దేవాలయం లోని శివలింగం క్రిందనుండి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు 14 గ్రామాలకు తాగునీరుగా వాడుతున్నారు.ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీ బుగ్గా రామేశ్వరాలయంఅలయంలో శివలింగంనుండి నీరు ఊరుతూ ఉంటుంది.కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరము దేవాలయంలో నంది ఉత్తరాయణంలో ఉత్తరముఖంగాను దక్షిణాయణంలో దక్షిణ వైపు తిరుగుతారు.ఇది వండర్అలంపూర్ బాల బ్రహేశ్వర లింగానికి ఎన్ని నీళ్ల ట్యాకులతోనైనా అభిషేకం చెయ్యండి, కానీ ఆనీరు ఎటుపోతుందో ఎవ్వరికీ తెలియదు.వరంగల్ జిల్లా వెయ్యిస్తంభాల గుడి, ఇక్కడ సంగీత స్తంభాలు గలవు. ఇక్కడ నందిని మీటితే కంచు శబ్దం వస్తుంది.
ద్రాక్షారామం ఈ శివలింగం పై ఉదయం సాయత్రం సూర్య కిరణాలు పడతాయి.భీమవరంలో సోమేశ్వరుడు, ఇక్కడ శివలింగం అమావాస్యకు నల్లగా పౌర్ణమికి తెల్లగా రంగులు మారతారుకోటప్పకొండ ఎటుచూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి, ఇక్కడికి కాకులు అసలు రావుగుంటూరు జిల్లా చేజర్ల ఇక్కడ స్వామిపేరు కపోతేశ్వర స్వామి. లింగానికి దక్షిణ భాగంలో ఉన్న రంద్రంలో నీళ్లుపోస్తే శవంకుళ్లిన వాసన వస్తుంది.ఉత్తరభాగంలో నీరుపోస్తే అవి ఎక్కడికి పోతాయో ఎవ్వరికీ తెలీదు.బైరవకొన ఇక్కడ కాకులు రావు. అలాగే ఇక్కడ ఉన్న కొనేరులో ఎంత నీరు వరదలా వచ్చినా గుడిలోకి నీరురాదు.

💐యాగంటి ఇక్కడ రోజురోజుకు నంది పెరుగుతూ ఉంటాడుశ్రీశైలం భ్రమరాంబిక దేవాలయము వెనుక ఒకప్పుడు “జుం”తుమ్మెద శబ్దం వినపడేదటకర్నూలు జిల్లా సంగమేశ్వరం లో వేపచెట్టు మొద్దు ఇక్కడ శివలింగంగా మారింది. 6నెలలు ఈ దేవలయం నీటిలో మునిగి ఉంటుంది. 6 నెలలు బయటకు కనిపిస్తుంది.శ్రీకాళహస్తి లో వాయురూపములో శివలింగం ఉంటుంది.అమర్ నాద్ శ్రావణ మాసంలో ఇక్కడ స్వయంగా మంచు శివలింగం ఏర్పడుతుంది.కర్ణాటకలోని శివగంగ ఇక్కడ శివలింగంపై నెయ్యి వుంచితే వెన్న అవుతుంది. ఇక్కడ ఒక్క మకర సంక్రాంతి రోజు మాత్రమే గంగాజలం ఉద్బవిస్తుంది. మిగిలిన రోజులలో ఒక్క చుక్క కూడా కనిపించదు.మహారాష్ట్రలో కోపినేశ్వర్ అనే దేవాలయంలో ప్రతి సంవత్సరము శివలింగము పైకి పెరుగుతుంది. నంది విగ్రహము శివలింగం వైపు జరుగుతూ ఉంటుంది.
కంచి ఇక్కడ మామిడి చెట్టు వయస్సు 4000 సంవత్సరాలు.తమిళ నాడు తిరు నాగేశ్వరము ఇక్కడ పాలతో అభిషేకం చేస్తే నీలంగా మారుతాయి.చైనాలో కిన్నెర కైలాసము ఇక్కడ ఉన్న శివలింగము ఉదయం తెల్లగా,మధ్యాహ్నం పసుపుగా, సాయంత్రం తెలుపుగా, రాత్రి నీలంగా మారుతాడు.