DailyDose

TNI నేటి తాజా వార్తలు

TNI  నేటి తాజా  వార్తలు

*ఏలూరులో వైసీపీ కార్పొరేటర్లు బరితెగించారు. స్థానికులపై దాడులు చేస్తూ వైసీపీ కార్పొరేటర్లు తమ అహంకారాన్ని చూపిస్తున్నారు. తాజాగా పసుపులేటి శేషు అనే వ్యక్తిపై 8వ డివిజన్ కార్పొరేటర్ వంకదార ప్రవీణ్ దాడి చేశారు. కార్పొరేటర్ వంకదార ప్రవీణ్, కొంతమంది వ్యక్తులతో కలిసి తనపై దాడి చేసారని బాధితుడు ఆరోపించారు. ప్రస్తుతం బాధితుడు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఓ భార్యాభర్తల గొడవలో షూరిటీ సంతకం కోసం సచివాలయానికి వెళ్లిన సమయంలో దాడి చేశారని బాధితుడు శేషు ఆరోపించాడు.

*తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్‌ తమిళిసై (governor tamilisai) లేఖ రాశారు. యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటుపై లేఖలో ప్రస్తావించారు. బిల్లుపై విద్యాశాఖమంత్రి రాజ్‌భవన్‌కు వచ్చి చర్చించాలని సూచించారు. యూజీసీకి కూడా గవర్నర్‌ తమిళిసై లేఖ రాసారు. కామన్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా రిక్రూట్‌మెంట్ల చెల్లుబాటుపై అభిప్రాయం ఆమె కోరారు. ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం పట్టించుకోవట్లేదని గవర్నర్‌ తమిళిసై లేఖలో పేర్కొంది.

*వరంగల్ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు ధర్నాకు దిగారు. పలు జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఉపాధ్యాయుల బదిలీల్లో డీఈవో వాసంతి అక్రమాలకు పాల్పడ్డారని ఆంధ్రజ్యోతి పత్రికలో కథనం ప్రచురితం అయ్యింది. డీఈవో వాసంతి ఫిర్యాదు మేరకు వార్త రాసిన విలేఖరి రాజన్న అక్రిడిటేషన్ కార్డును రద్దు చేయాలని కలెక్టర్ గోపీ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ గోపీ నిర్ణయానికి వ్యతిరేకంగా జర్నలిస్టులు నిరసనకు దిగారు.

**విజయవాడ వెస్ట్ నగరంలో మరో దారుణం.. ఓల్డ్ రాజరాజేశ్వరి పేట కు చెందిన 9 ఏళ్ల బాలికపై అత్యాచార ఘటన..అత్యాచారనికి పాల్పడ్డ 48 ఏళ్ల ఆఫీజ్ అనే వ్యక్తి..చిన్నారి ఇంటి పక్కనే ఒంటరిగా నివసిస్తున్న ఆఫీజ్..9 ఏళ్ల బాలిక కు మాయ మాటలు చెప్పి నోట్లో దుస్తులు పెట్టి అత్యాచారానికి పాల్పడ్డ ఆఫీజ్..హఫీజ్ ను పట్టుకొని దేహశుద్ధి చేసి కొత్తపేట పోలీసులకు అప్పగించిన స్థానికులు..ఆదివారం రాత్రి దిశా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన దిశా పోలీసులు.

* మీడియా పై బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. రోజు అబద్దాలు అడేవారు, అవినీతి పరులు చేసే వ్యాఖ్యలపై తమను ఎందుకు ప్రశ్నిస్తారంటూ మండిపడ్డారు. ‘రాజధానిపై మాట మార్చి.. మూడు రాజధానులు అంటున్న అబద్ధాలోడికి మేము సమాధానం చెప్పాలా? జగన్‌ ని ప్రశ్నించండి. మూడు రాజధానులు అంటున్న వాడిని అడగకుండా..ఒక రాజధాని అంటున్న మమ్మల్ని ప్రశ్నలు అడుగుతారెందుకు?’ అంటూ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.అవినీతిపరులు ప్రచారాలు చేస్తే… తాము సమాధానం చెప్పాలా? అని ప్రశ్నించారు. తామేమైనా ఖాళీగా ఉన్నామా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా వద్దని చంద్రబాబు ప్యాకేజి తీసుకున్నారన్నారు. స్టీల్ ప్లాంట్‌ ని అదాని కి అమ్మేసిన వారిని మీరు ప్రశ్నించాలన్నారు. విశాఖలో రైల్వే జోన్‌ తో సహా జరుగుతున్న పలు కార్యక్రమాలకు అందరిని ఆహ్వానిస్తామన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ని కూడా ఆహ్వానిస్తారా అంటే సమాధానం చెప్పలేదు.

*నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు పై రాళ్ల దాడి యత్నం ఘటనపై గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌కు తెలుగుదేశం బృందం ఫిర్యాదు చేశారు. రాళ్ల దాడి ఘటనపై నామాత్రపు బెయిలబుల్ కేసు నమోదు చేయటాన్ని తప్పు పడుతూ గవర్నర్‌ను టీడీపీ నేతలు ఆశ్రయించారు. ఘటనకు సంబంధించి అనుమానితుల ఫోటోలు కూడా టీడీపీ అధిష్టానం విడుదల చేసింది.గవర్నర్‌తో భేటీ అనంతరం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ… పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే చంద్రబాబుపై దాడి యత్నం జరిగిందన్నారు. 324 చట్టం కింద కేసు పెట్టి పోలీసులు హాస్యాస్పదంగా వ్యవహరించారని మండిపడ్డారు. విశాఖలో మంత్రి కారుకు దెబ్బ తగిలితే హత్యాయత్నం కేసు పెట్టారన్నారు. ఇక్కడ దాడి జరిగి రక్తం కారినా బెయిల్ బుల్ సెక్షన్ పెట్టడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై గవర్నర్ కూడా విచారం వ్యక్తం చేశారన్నారు.

*చెరువులు, ముంపు ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చీ.. జగనన్న కాలనీలు కట్టిస్తున్నామని వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెబుతోందని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘‘ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాలకు రూ.32 వేల కోట్లు కేటాయించారట..! వాస్తవం ఏమిటో మచ్చుకి ఓసారి లబ్ధిదారులను అడిగితే తెలుస్తుంది జగన్ గారూ..!!’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

*మార్గదర్శి కేసు 16 ఏళ్ళు పూర్తయిందని, మార్గదర్శిని తనిఖీ చేయకుండా ఏపీలో ఉన్న ఛిట్ పండ్ కంపెనీలన్నీ తనిఖీ చేస్తే ప్రయోజనం ఉండదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఛిట్ పండ్ కంపెనీ నిర్వహించేవారు ఏ వ్యాపారం చేయకూడదనే నిబంధన ఉందన్నారు. చట్టం తని పని తాను చేస్తుందనేది పచ్చి అబద్దమన్నారు. రామోజీరావుకు ఛిట్ పండ్ కంపెనీకు సంబంధం ఉందా? లేదా? అనేది ప్రభుత్వం నిర్థారించాలన్నారు. తన వద్ద ఉన్న ఆధారాలన్నీ జగన్ ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. చట్టాలకు రామోజీరావు అతీతుడు కాదన్న విషయం జనం తెలుసుకోవాలన్నారు.చట్టాలను ఎలా మలుపు తిప్పచ్చో మార్గదర్శి కేసే ఉదాహణ అని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. దీనిపై త్వరలో పుస్తకం రాస్తానన్నారు. మార్గదర్శి కేసు తేలేసరికి రామోజీరావు, తాను బ్రతికి ఉంటామో లేదో అని అన్నారు. ఏపీ విభజన చాలెంజ్ చేస్తూ వేసిన ఫిటిషన్‌తో పాటు అమరావతి రాజదాని పిటీషన్‌ల‌పై సుప్రీంకోర్టులో ఈనెల 14న విచారణ జరుగుతుందన్నారు. సుప్రీంకోర్టు విచారణకు హాజరవుతానని ఉండవల్లి అన్నారు. ఏపీ రాజధాని అమరావతిగా ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఒప్పుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలకు కోర్టులో స్టేలు వస్తున్నాయని, ప్రభుత్వం మాత్రం తన నిర్ణయాలను న్యాయపరంగా నిరూపించలేకపోతోందన్నారు. పవన్ కళ్యాణ్‌ను తాను విమర్శించనని ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు.

*ఎన్నిక ఏదైనా ప్రజలంతా కేసీఆర్ (KCR) వెంటే అని ఎమ్మెల్సీ కవిత (Kavita) అన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో ఎమ్మెల్సీ కవిత (TRS MLC) ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ… అవాకులు చవాకులు చేసిన బీజేపీ నేతల (BJP Leader)కు మునుగోడు ప్రజలు సరైన సమాధానం ఇచ్చారన్నారు. మునుగోడులో ప్రజలు ఇచ్చిన తీర్పు ఇందుకు నిదర్శనమని అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ (TRS Party)ని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. నల్గొండలో హ్యాట్రిక్ సాధించామని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా ప్రజలంతా టీఆర్ఎస్ వైపే అని కవిత స్పష్టం చేశారు.

*తెలంగాణ కాంగ్రె్‌సలో ప్రజాకర్షక నాయకుడు ఎవరంటే ఠక్కున వచ్చే సమాధానం.. రేవంత్‌రెడ్డి. ఈ ప్రజాకర్షణే ఆయనకు టీపీసీసీ అధ్యక్ష పదవి తెచ్చిపెట్టింది. పార్టీకి పునరుజ్జీవం అందించే బాధ్యతను అధిష్ఠానం అప్పగించింది. దీనికితగ్గట్లే.. వరుస ఓటములతో డీలా పడిన శ్రేణులను రేవంత్‌ తన వాగ్ధాటితో ఉత్తేజం చేశారు. రాష్ట్ర స్థాయి అంశాలపై అధికార టీఆర్‌ఎస్‌, సీఎం కేసీఆర్‌ మీద ఎదరుదాడికి దిగుతూ, జిల్లాల్లో పర్యటనలు చేస్తూ, పార్టీ పుంజుకునేలా చేశారు. బలమైన నాయకుడు వచ్చాడని క్యాడర్‌ భావిస్తూ.. పూర్తిగా రేవంత్‌ వెంట నడుస్తున్న తరుణంలో.. సీనియర్ల సహాయ నిరాకరణ కాంగ్రెస్‌ను దెబ్బతీస్తోంది. రేవంత్‌ అన్ని అస్త్రాలను ఉపయోగిస్తూ.. కేడర్‌ను కదిలిస్తూ శక్తిమేర పోరాడుతున్నా.. అంతర్గత కలహాలు పార్టీని వెనక్కు గుంజుతున్నాయి

*అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అంశంపై కీలక తీర్పును సీజేఐ యు.యు.లలిత్ (CJI Lalith) నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం వెలువరించింది. అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని.. సవాల్ చేస్తూ పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల (EWS Reservations)ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దినేష్ మహేశ్వరి (Justice Dinesh Maheswari), జస్టిస్ బేలా త్రివేది (Justice Bela Trivedi) సమర్థించారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్నిసవాల్ చేసిన.. పిటిషన్లను జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేలా త్రివేది డిస్మిస్ చేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కలిపిస్తూ చేసిన 103వ రాజ్యాంగ సవరణ చట్టబద్ధమైందని.. రాజ్యాంగ మూలసూత్రాలను ఉల్లంఘించలేదన్న జస్టిస్ దినేష్ మహేశ్వరి పేర్కొన్నారు. దినేష్ మహేశ్వరి వ్యాఖ్యలను జస్టిస్ బేలా త్రివేది సమర్ధించారు. రిజర్వేషన్లు కొంద‌రి ప్రయోజనాల కోసం కాక సామాజిక, ఆర్థిక.. అసమానతలు అంతం చేయడానికి అనుమతించబడ్డాయని జ‌స్టిస్ జె.బి.పార్ధీవాలా పేర్కొన్నారు. 70 ఏళ్ల క్రితం ప్రారంభ‌మైన రిజర్వేష‌న్లు దీర్ఘకాల అభివృద్ధి.. విద్యా రంగంలో అంతరాన్ని తగ్గించడంలో సహాయపడ్డాయన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజ‌ర్వేష‌న్లతో పాత కులవ్యవస్థ తిరిగి వ‌చ్చింద‌ని, ఎస్సీ, ఎస్టీల‌తో.. స‌మానంగా వారికి అవ‌కాశాలు ఇస్తాయ‌నే వాద‌న అంగీక‌రించబోమని జ‌స్టిస్ బేలా త్రివేది పేర్కొన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత రిజ‌ర్వేష‌న్లపై పునఃప‌రిశీలించాల్సి ఉందన్నారు.

*బలమైన ఓటు బ్యాంకుతో కంచుకోటగా ఉన్న మునుగోడులో కాంగ్రెస్‌ ఎందుకు తడబడింది? 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి సాధించిన ఓట్లను కూడా.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆమె ఎందుకు సాధించలేకపోయారు? డిపాజిట్‌ కూడా గల్లంతయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ ప్రశ్నలకు పార్టీ వర్గాలు ప్రధానంగా మూడు కారణాలను విశ్లేషిస్తున్నాయి.

*ఆపరేషన్‌ ‘రోప్‌’ (రిమూవల్‌ ఆప్‌ అబ్‌స్ట్రక్షన్‌ అండ్‌ పార్కింగ్‌ ఎన్‌క్రోచ్‌మెంట్స్‌) ప్రారంభమై నెల రోజులు దాటింది. ట్రాఫిక్‌ అడ్డంకులు, అవరోధాలను అధిగమించడానికి ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌ స్థాయు నుంచి హోంగార్డు వరకు రోడ్ల పైకి వచ్చి వాహనదారులకు అవగాహన కల్పించారు. పలు కూడళ్లలో వాహనదారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా గమనించారు. ప్రధానంగా రెడ్‌ సిగ్నల్‌ ఉన్నప్పుడు వాహనదారులు స్టాప్‌ లైన్‌ క్రాస్‌ చేయకుండా, ఫ్రీ లెఫ్ట్‌ ఉన్న దారిలో వాహనాలను అడ్డు రాకుండా చేసేందుకు చర్యలు తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కొరడా ఝులిపించి చలానాలు వేశారు. అయితే ఫ్రీ లెఫ్ట్‌ల విషయంలో అధికారులు తీసుకున్న చర్యలు పూర్తిగా సఫలం కావడం లేదు. చౌరస్తాల వద్ద సిబ్బంది ఉన్నా, ఫ్రీలెఫ్ట్‌ బ్లాకింగ్‌లను అరికట్టడంలో నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.

* టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడిపై అనుమానాలున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. నిందితులకు బెయిల్ వచ్చేలా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం దారుణమన్నారు. నిందితులకు సహకరించేలా జగన్‌ ప్రభుత్వ వైఖరి ఉందని దేవినేని మండిపడ్డారు. ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని ఆయన మండిపడ్డారు. జగన్‌ పాలనా వైఫల్యంతో ఏపీని అధోగతిపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

*ఓబులదేవర చెరువు మండలానికి చెందిన ఓ రేషన్ డీలర్ భారీ మోసానికి పాల్పడుతున్నాడు. వినియోగదారులకుఅందించే బియ్యం తూకాల్లో మోసం చేస్తున్నాడు. ఒక్కో రేషన్ కార్డు మీద కిలో బియ్యం కోత విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఇదేంటని అడిగితే ఒక్కో రేషన్ కార్డు మీద కిలో బియ్యం కోత రాష్ట్ర వ్యాప్తంగా ఉందని చెబుతున్నాడు. రేషన్ డీలర్ జబీవుల్లాపై ఇంతకుముందు కూడా పలు ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. అయినా రెవెన్యూ, పౌరసంబంధాల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు విమర్ళలు వస్తున్నాయి. కొందరికి మాత్రం సరుకులు అందించి స్టాక్ అయిపోయిందని చెబుతుంటాడని వినియోగదారులు అంటున్నారు. వైసీపీ నాయకుడు కావడంతో అధికారులు కూడా చర్యలు తీసుకోవడంలేదని తెలుస్తోంది.

*ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి సొంత జిల్లాలో సర్పంచ్‌లు షాక్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సర్పంచ్‌లు ర్యాలీ చేశారు. కడప ఏడు రోడ్ల కూడలి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకుర్యాలీ నిర్వహించారు. ఇప్పటికైనా స్పందించి సర్పంచ్‌ల ఖాతాలో నిధులు వేయాలని సూచించారు. అలా చేయని పక్షంలో నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రెండేళ్ల నుంచి నిధులు లేక గ్రామ పంచాయతీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సర్పంచ్‌లు, పంచాయతీలకు డబ్బులు ఇవ్వడంలేదని ఆరోపించారు. పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఈ ప్రభుత్వం కుట్ర చేస్తోందని, ఇప్పటికైన సీఎం జగన్ స్పందించి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు

*ప్రభుత్వానికి ఇప్పటం గ్రామం పై ఆగ్రహం, విశాఖపై వ్యామోహం పెరిగిందని ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటంలో జనసేన సభకు స్థలం ఇచ్చారనే పేదల ఇళ్లు కూల్చివేశారని మండిపడ్డారు. ఏపీలో రోడ్లను కూడా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. విశాఖలో కుమార్తె భూములు కొంటే తనకేంటని ఎంపీ విజయసాయిరెడ్డి అంటున్నారని, స్థలాలు కొని రేట్లు పెంచాలనే విశాఖపై ప్రేమ నటిస్తున్నారని విమర్శించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, త్వరలోనే బుద్ధి చెబుతారని రఘురామకృష్ణరాజు హెచ్చరించారు.

*కోల్‌కతాలోని ఇండియన్‌ అసోసియేషన్‌ ఫర్‌ ద కల్టివేషన్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఏసీఎస్‌) – పీహెచ్‌డీ ఫుల్‌ టైం రెగ్యులర్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇది 2023 స్ర్పింగ్‌ సెమిస్టర్‌. అకడమిక్‌ ప్రతిభ, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.

*మైనింగ్ లీజు (Mining case) కేసు వ్యవహారంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren)కు ఊరట లభించింది. ఈ కేసులో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సోరెన్ దాఖలు చేసిన అప్పీళ్లను అత్యున్నత న్యాయస్థానం సోమవారం అంగీకరించింది. సోరెన్ గతంలో గనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక గని లీజును మంజూరు చేయించుకున్నారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. దీనిపై దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యం విచారణకు యోగ్యమంటూ గత జూన్ 3న జార్ఖాండ్ హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిని సుప్రీంకోర్టులో సోరెన్, జార్ఖాండ్ ప్రభుత్వం సవాలు చేయగా, జస్టిస్ యు.యు.లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం గత ఆగస్టులో విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు వెలువరించేంత వరకూ పెడింగ్ పిటిషన్లపై చర్యలు చేపట్టరాదని కూడా స్పష్టం చేసింది. ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సోమవారంనాడు పక్కనపెడుతున్నట్టు అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

*తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసుకు రెండు రోజుల క్రితమే రిప్లై ఇచ్చానని తెలిపారు. తారిక్ ఆన్వర్ ఆందుబాటులో లేరని చెప్పారు. ప్రస్తుతానికి తన నియోజకవర్గ పనుల కోసం తిరుగుతున్నానని చెప్పారు. షోకాజ్ నోటీసు ఇచ్చినప్పుడు పాదయాత్రలో ఎలా పాల్గొంటానని ఆయన ప్రశ్నించారు. క్లీన్ చీట్ వచ్చాకే జోడో యాత్రలో పాల్గొంటానని వెంకట్రెడ్డి స్పష్టం చేశారుకోమటిరెడ్డి వెంకట్రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. టీఆర్ఎస్‌ అభ్యర్ధికి కేవలం పదివేల మెజార్టీయే వచ్చింది.

*ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు లో చుక్కెదురైంది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కేసులో మాజీ మంత్రి నారాయణ ముందస్తు బెయిల్ రద్దుకు ఉన్నతన్యాయస్థానం నిరాకరించింది. విచారణకు సహకరించకపోతే దర్యాప్తు సంస్థలు న్యాయ స్థానాలను ఆశ్రయించాలని సూచించింది. ప్రతీ చిన్న దానికి సుప్రీంకోర్టుకు రావడం ఏపీ తెలంగాణ ( ) ప్రభుత్వాలకు అలవాటుగా మారిందని న్యాయమూర్తులు బీఆర్‌ గవాయ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం చురకలంటించింది.కాగా… అమ‌రావ‌తి మాస్ట‌ర్ ప్లాన్‌, ఇన్న‌ర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ మార్పు కేసులో నారాయ‌ణ‌కు హైకోర్టు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స‌వాల్ చేసింది. ఆర్థిక నేరాల‌తో కూడిన కేసు అని, నిందితులు సీఐడీ విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌డం లేదని రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పు న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు. అయితే ‘‘మీ రాజ‌కీయ ప్రతీకారంలో త‌మ‌ను భాగ‌స్వాములు చేయొద్దు’’ అని ధ‌ర్మాస‌నం పేర్కొంది. నిందితులు విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌క‌పోతే సీఐడీ బెయిల్ ర‌ద్దు పిటిష‌న్ వేసుకోవాల‌ని సుప్రీం కోర్టు సూచిస్తూ… ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.

*తెలంగాణలో బీజేపీ అడుగు పెట్టనివ్వకుండా చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి, ప్రధాని మోదీకి, ఆ పార్టీ అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డికి ప్రజలు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారని చెప్పారు.ఓడిపోయాననే అక్కసుతోనే రాజగోపాల్‌ రెడ్డి కమ్యూనిస్టులపై విమర్శలు చేస్తున్నారన్నారు. కాగా, బీజేపీ ఎత్తుగడను మునుగోడు ప్రజలు ప్రజలు తిప్పికొట్టారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఫాసిస్టు విధానాలతో తెలంగాణలో పాగా వేయాలనుకున్న బీజేపీకి మునుగోడు ప్రజలు చెక్‌ పెట్టారని సీపీఐ(ఎం-ఎల్‌) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు.

*పూణే-బెంగళూరుఎయిర్ ఏషియా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. పూణే విమానాశ్రయంలో ఆదివారం రాత్రి ఎయిర్ ఏషియా విమానం ఏ 320 విమానం టేకాఫ్ అయ్యే చివరి క్షణంలో సాంకేతిక లోపంతో విమానాశ్రయం బేకు తిరిగి వచ్చింది.(Aborts Take Off )ఏ320 విమానంలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనేది తెలియలేదు. ‘‘పూణే నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన ఎయిర్ ఏషియా ఇండియా ఫ్లైట్ ఐ5-1427 సాంకేతిక కారణాల వల్ల టేకాఫ్ రద్దు చేసి బేకి తిరిగి వచ్చింది’’ అని ఎయిర్ ఏషియా ఇండియా ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.పూణె నుంచి బయలుదేరిన బెంగళూరు విమానం సాంకేతిక లోపం కారణంగా బేకు తిరిగి వచ్చినట్లు ఎయిర్ ఏషియా ఇండియా ఒక ప్రకటనలో ధృవీకరించింది.అంతకుముందు ఎయిర్ ఏషియా విమానం తిరిగివచ్చిన ఘటనపై ఒక విమాన ప్రయాణికుడు ట్వీట్ చేశారు. ‘‘కొన్ని కారణాల వల్ల ఎయిర్ ఏషియా పూణే-బెంగళూరు ఎయిర్‌బస్ ఏ-320 విమానం పూణే విమానాశ్రయంలో అకస్మాత్తుగా టేకాఫ్ ను నిలిపివేశారు.’’ అని ఓ విమాన ప్రయాణికుడు ట్వీట్ చేశారు. ఈ సాంకేతిక లోపంపై ఎయిర్ ఏషియా అధికార ప్రతినిధి ఇతర వివరాలను పంచుకోలేదు.

*తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించ తలపెట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌ ప్రాణం తీసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఆదివారం మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి, మందమర్రి మీదుగా సాయంత్రం బెల్లంపల్లి పట్టణానికి చేరుకుంది. కాంటా చౌరస్తా వద్ద రోడ్డు షోలో ఆమె మాట్లాడారు.

* తల్లిదండ్రుల్లేని 551 మంది అనాథ అమ్మాయిలకు ఆదివారం రాత్రి గుజరాత్ రాష్ట్రంలోని భావ్‌నగర్ లో సామూహిక వివాహ వేడుక జరిగింది. భావ్‌నగర్ జవహర్ మైదానంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సామూహిక వివాహ వేడుక(mass wedding event) కన్నుల పండువగా సాగింది.

*కాకినాడ జిల్లా గొల్లప్రోలు మం డలం కొడవలి గ్రామం లో ఆదివారం పిఠాపురం ఎమ్మెల్యే పెండె ం దొరబాబుకు నిరసన సెగ తగిలింది. గడప గడపకు మన ప్రభు త్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన దొరబాబును టీడీపీ నేత లు, గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలో ప్రధాన రహదారి సహా పలు రోడ్లు గోతులమయంగా మారాయని, టీడీపీ హయాంలో వచ్చిన నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. గ్రామానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఇళ్లస్థలాలిస్తే తమకు ఉపయోగం ఏమిటని నిలదీశారు. దనంకొండను ఏళ్ల తరబడి 270 మంది రైతులు సాగు చేసుకుంటున్నారని, గ్రావెల్‌ తవ్వకాలు నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. వారికి సమాధానం ఇవ్వకుండానే ఎమ్మెల్యే వెళ్లిపోయారు.

*మునుగోడు ఉప ఎన్నికలో వచ్చిన ఫలితం కంటే ఎంత నిబద్ధతతో పనిచేశామన్నది ముఖ్యమని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. ఫలితాలపై ఆయన ట్విటర్‌లో స్పందించారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. మునుగోడులో ప్రలోభాలకు లొంగకుండా నిఖార్సుగా, నిబద్ధతతో పనిచేసిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతున్నట్లు ట్వీట్‌ చేశారు.

*మునుగోడు ఉప ఎన్నికలో గెలుపోటములకు అందరూ బాధ్యులేనని.. గెలిచినా, ఓడినా ఏ ఒక్కరిదో బాధ్యత కాదని కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాలబావి ఎఫ్‌సీఐ గోదాము వద్ద ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఓట్ల లెక్కింపునకు ముందే కేంద్రానికి వచ్చిన స్రవంతి.. రెండు నుంచి మూడు రౌండ్లలో కాంగ్రెస్‌ పార్టీకి ఆశాజనకంగా ఓట్లు రాకపోవడంతో నిరాశ చెందారు. వస్తున్న ఫలితాలను బట్టి కాంగ్రె్‌సకు ఏ మండలంలో కూడా భారీగా ఓట్లు వచ్చే అవకాశాలు లేవని భావించిన ఆమె.. కౌంటింగ్‌ హాల్‌ నుంచి ముందుగానే వెళ్లిపోయారు. నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపునకు ముందే స్రవంతి కౌంటింగ్‌ కేంద్రం నుంచి నిష్క్రమించారు.

* మునుగోడు ఉప ఎన్నికలో తనకు 45 నుంచి 60% ఓట్లు వస్తాయని భావించానని, కానీ 1000 కూడా రాలేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై తనకు నమ్మకం లేదని, టీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయని ఆరోపించారు. చండూరులోని డాన్‌బోస్కో పాఠశాల నుంచి 224 ఈవీఎంలు అదనంగా నల్లగొండకు చేరుకున్నాయని తాము చెప్పినా ఎన్నికల అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. తాను గెలుస్తానని పోలింగ్‌ అనంతరం కొందరు అధికారులే స్వయంగా చెప్పారని ఆయన తెలిపారు.

*పూణే-బెంగళూరుఎయిర్ ఏషియా విమానంలో ) సాంకేతిక లోపం ఏర్పడింది. పూణే విమానాశ్రయంలో ఆదివారం రాత్రి ఎయిర్ ఏషియా విమానం ఏ 320 విమానం టేకాఫ్ అయ్యే చివరి క్షణంలో సాంకేతిక లోపంతో విమానాశ్రయం బేకు తిరిగి వచ్చింది. ఏ320 విమానంలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనేది తెలియలేదు. ‘‘పూణే నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన ఎయిర్ ఏషియా ఇండియా ఫ్లైట్ ఐ5-1427 సాంకేతిక కారణాల వల్ల టేకాఫ్ రద్దు చేసి బేకి తిరిగి వచ్చింది’’ అని ఎయిర్ ఏషియా ఇండియా ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.పూణె నుంచి బయలుదేరిన బెంగళూరు విమానం సాంకేతిక లోపం కారణంగా బేకు తిరిగి వచ్చినట్లు ఎయిర్ ఏషియా ఇండియా ఒక ప్రకటనలో ధృవీకరించింది.అంతకుముందు ఎయిర్ ఏషియా విమానం తిరిగివచ్చిన ఘటనపై ఒక విమాన ప్రయాణికుడు ట్వీట్ చేశారు. ‘‘కొన్ని కారణాల వల్ల ఎయిర్ ఏషియా పూణే-బెంగళూరు ఎయిర్‌బస్ ఏ-320 విమానం పూణే విమానాశ్రయంలో అకస్మాత్తుగా టేకాఫ్ ను నిలిపివేశారు.’’ అని ఓ విమాన ప్రయాణికుడు ట్వీట్ చేశారు. ఈ సాంకేతిక లోపంపై ఎయిర్ ఏషియా అధికార ప్రతినిధి ఇతర వివరాలను పంచుకోలేదు.

*కడప మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానంద రెడ్డి కుమార్తె, అపోలో ఆస్పత్రి ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌ స్పెషలిస్టు డాక్టర్‌ సునీత నర్రెడ్డి ప్రతిష్ఠాత్మకమైన జస్టిస్‌ కృష్ణయ్యర్‌ పురస్కారం అందుకున్నారు. ఆదివారం క్యాపిటల్‌ ఫౌండేషన్‌ సొసైటీ, జస్టిస్‌ కృష్ణయ్యర్‌ ఫ్రీలీగల్‌ ఎయిడ్‌ సెల్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యుయు లలిత్‌.. డాక్టర్‌ సునీతకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ జీవన సాఫల్య పురస్కారం స్వీకరించగా, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్‌ రవీంద్రన్‌, జస్టిస్‌ శివరాజ్‌ పాటిల్‌, ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ రాజేశ్‌ వైద్య, మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిదయతుల్లా కుమారుడు ప్రముఖ న్యాయవాది అర్షద్‌ హిదయతుల్లాతోపాటు పలు రంగాల్లో కృషి చేసిన ప్రముఖులకు జస్టిస్‌ కృష్ణయ్యర్‌ 108వ జయంతి సందర్భంగా పురస్కారాలు అందజేశారు.

*కుప్పం మీదుగా చెన్నై వెళ్తున్న రబుల్ డేకర్ రైలులో మండల పరిధిలోని బంగారునాతం రైల్వేగేట్ వద్ద రైలు బోగీలో నుండి పొగలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ రైలుని ఆపేశాడు. దీంతో ప్రయాణీకులు ఒక్కసారిగా రైలుదిగి పరుగులు తీశారు. చివరకు ఎలాంటి ప్రమాదం జరుగలేదని తెలియడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. అక్కడి నుండి చిన్నగా సమీపంలోని మల్లానుర్ రైల్వేస్టేషన్ కి రైలుని తీసుకెళ్లి సమస్యను పరిష్కరించారు. దీంతో బెంగళూర్ నుండి కుప్పం మీదుగా చెన్నై వెళ్ళు బృందావన్ సూపర్ ఫాస్ట్ రైలుని 30 నిమిషాలు కుప్పం లో ఆపేశారు

*మెదక్‌ – సిద్ధిపేట నేషనల్‌ హైవేకు సంబంధించిన భూసేకరణ వేగవంతం చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. నేషనల్ హైవే వెళ్లే గ్రామాల వద్ద నాలుగు లైన్ల రోడ్లు, స్ట్రీట్‌ లైట్స్‌, సైడ్‌ డ్రైన్లు, రేలింగ్‌, ఫుట్‌పాత్‌ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలో ఆర్‌అండ్‌బీ అధికారులతో మంత్రి మెదక్‌ – సిద్ధిపేట హైవేకు సంబంధించి రీచ్‌-1, రీచ్‌-2 పనులపై సమీక్షించారు. రీచ్ -1 నేషనల్ హైవే సిద్ధిపేట జిల్లాలోని పోతారెడ్డిపేట్ నుంచి రంగధాంపల్లి బ్రిడ్జి వరకు, రీచ్ -2 నేషనల్ హైవే మెదక్ జిల్లాలో మెదక్ టౌన్ నుంచి నిజాంపేట వరకు నిర్మాణం సాగనున్నట్లు మంత్రి తెలిపారు.

*ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే తెలంగాణ అభివృద్ధి చెందుతోందని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో సైతం ఇలాంటి పథకాలు లేవన్నారు. నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండలం వల్లవాపూర్‌ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్పీకర్‌ శంకుస్థాపన చేశారు.

*అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మహేశ్వరం మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. మన ఊరు – మన బడి, బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. నందుపల్లి గ్రామంలో సీసీ రోడ్డును, పడమటి తండా గ్రామంలో బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని సీఎం కేసీఆర్‌ రోడ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేశారన్నారు. వర్షాలు తగ్గినందున పాడైన రోడ్లను బాగు చేయాలని ఆదేశించారన్నారు.