DailyDose

గూగుల్‌.. అమెజాన్ బాట‌లోనే ఆపిల్‌.. కొలువుల నియామ‌కాలు లేవ్‌!

గూగుల్‌.. అమెజాన్ బాట‌లోనే ఆపిల్‌.. కొలువుల నియామ‌కాలు లేవ్‌!

ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం ముప్పు నేప‌థ్యంలో టెక్ దిగ్గ‌జం గూగుల్‌, ఈ-కామ‌ర్స్ జెయింట్ అమెజాన్‌.. కొత్త‌గా క్యాంప‌స్ నియామ‌కాలు నిలిపేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. ఆ బాట‌లోనే ప్ర‌పంచంలోనే అత్యంత విలువైన కంపెనీ.. టెక్ జెయింట్ ఆపిల్ ప్ర‌యాణిస్తున్న‌ది. క్యాంప‌స్ రిక్రూట్‌మెంట్లు, కొత్త నియామ‌కాలు నిలిపేస్తున్న‌ట్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (సీఈవో) టిమ్ కుక్ ఓ వార్తాసంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పారు.ప్ర‌పంచ అగ్ర‌శ్రేణి కంపెనీలు ఉద్యోగుల‌కు చెల్లించే వేత‌నాలు మొద‌లు, క‌ల్పించే వ‌స‌తుల్లోనూ కోత విధిస్తున్నాయి. ట్విట్ట‌ర్ నూత‌న య‌జ‌మాని ఎల‌న్‌మ‌స్క్ .. సంస్థ‌ను టేకోవ‌ర్ చేసిన వారంలోపే స‌గం మందికి ఉద్వాస‌న ప‌లికారు. ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 11 వేల మందిని ఇంటికి పంపేసింది. అమెజాన్ దాదాపు 10 వేల మందికి ఉద్వాస‌న ప‌లుక‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.గూగుల్‌, నెట్‌ఫిక్స్ సంస్థ‌లు కూడా నియామ‌కాలు త‌గ్గించేయ‌డంతో ఉద్యోగాల్లో కోత విధించాయి.. ట్విట్ట‌ర్ త‌ర‌హాలో ఉద్యోగుల తొల‌గింపులు ఉండ‌వు గానీ.. కొత్త నియామ‌కాలు నిలిపేస్తున్న‌ట్లు టిమ్ కుక్ చెప్పారు