Movies

అమీర్ ఖాన్ కుమార్తె నిశ్చితార్థం.. ఫోటోలు వైర‌ల్

అమీర్ ఖాన్ కుమార్తె నిశ్చితార్థం.. ఫోటోలు వైర‌ల్

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ నిశ్చితార్థ వేడుక‌లు ముంబైలో ఘ‌నంగా జ‌రిగాయి. ఐరా ఖాన్ నిశ్చితార్థ వేడుక‌ల‌కు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. త‌న బాయ్ ఫ్రెండ్ నుపూర్ శిఖ‌రేతో ఐరాకు ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. నిశ్చితార్థ వేడుక‌ల్లో ఐరా ఖాన్ ఎరుపు రంగు గౌనులో మెరిసిపోయింది. నుపూర్ బ్లాక్ సూట్ ధ‌రించి, గుడ్ లుకింగ్‌లో క‌నిపించాడు. ఇక ఈ వేడుక‌ల్లో అమీర్ ఖాన్, రీనా ద‌త్తా, కిర‌ణ్ రావు, అమీర్ ఖాన్ మేన‌ల్లుడు ఇమ్రాన్ ఖాన్‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు.