Movies

రీస్టోర్డ్‌ ఇండియన్‌ క్లాసిక్‌ విభాగంలో శంకరాభరణం

రీస్టోర్డ్‌ ఇండియన్‌ క్లాసిక్‌ విభాగంలో శంకరాభరణం

కళాతపస్వి కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో రూపొందిన ఆల్‌టైమ్‌ క్లాసిక్‌ చిత్రం ‘శంకరాభరణం’ గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. రీస్టోర్డ్‌ ఇండియన్‌ క్లాసిక్‌ విభాగంలో ఈ సినిమా ఎంపికైంది. భారతదేశ సినీ చరిత్రలో క్లాసిక్స్‌గా నిలిచిన సినిమాలను నేషనల్‌ ఫిల్మ్‌ ఆర్కైవ్‌ ఆఫ్‌ ఇండియా డిజిటలైజ్‌ చేసి భద్రపరుస్తుంటుంది.ఈ ఏడాది ఇందుకోసం ‘శంకరాభరణం’ చిత్రాన్ని ఎంపిక చేశారు. శాస్త్రీయ సంగీత ఔన్నత్యాన్ని చాటిచెప్పే కథాంశంతో తెరకెక్కించిన ఈ చిత్రం ఎనభై దశకంలో సంగీత ప్రేమికుల్ని విశేషంగా ఆకట్టుకుంది. తెలుగు సినిమా క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ చిత్రంలోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి. జేవీ సోమయాజులు, మంజుభార్గవి, చంద్రమోహన్‌, తులసి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని పూర్ణోదయ ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించారు.