Movies

రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు

రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు

బాలీవుడ్‌లో ప్రత్యేక గీతాలంటే నోరా ఫతేహీ పేరు గుర్తొస్తుంటుంది. ఈ కెనడియన్‌ సుందరి ఇటీవల కాలంలో అనేక సూపర్‌ హిట్‌ సాంగ్స్‌లో ఆడిపాడింది. ఇటీవల ‘సత్యమేవ జయతే’ చిత్రంలో కుసు కుసు, ‘థాంక్‌ గాడ్‌’లో మనికే పాటలు ఆమెకు పాపులారిటీ తీసుకొచ్చాయి. సినిమాల్లో నాయికగా నటిస్తూనే మరోవైపు స్పెషల్‌ సాంగ్స్‌ చేస్తుంటుందీ తార. ఎన్నో ప్రేమ కథల్లో నటించిన నోరా..తన లవ్‌ స్టోరి చెప్పుకొచ్చింది. ప్రేమలో తానెలా మోసపోయిందనేది తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ…‘ఇలా మనకు జరగదు అనుకునే సందర్భాలు జీవితంలో ఎదురుకావొచ్చు. అప్పుడు ఎలా స్పందించాలో కూడా మనకు తెలియదు. అతని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా. ఒకరోజు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. కొన్ని రోజులు మానసికంగా కుంగిపోయా.నా కెరీర్‌ మీద కూడా దృష్టి సారించలేకపోయాను. అయితే అతనితో బ్రేకప్‌ అయ్యాక తెలియని ఉత్సాహం కలిగింది. గతంలో కంటే మెరుగైన కెరీర్‌ నిర్మించుకున్నా. నాలాంటి పరిస్థితి ఎంతోమంది మహిళలకు ఎదురుకావొచ్చు. కానీ కుంగిపోకుండా జీవితాన్ని సాధించుకోవాలి’ అని చెప్పింది. ప్రస్తుతం నోరా ‘ఆన్‌ యాక్షన్‌ హీరో’ , ‘హండ్రెడ్‌ పర్సెంట్‌’ అనే చిత్రాల్లో నాయికగా నటిస్తున్నది.