DailyDose

TNI నేటి తాజా వార్తలు

TNI  నేటి తాజా  వార్తలు

* చండ్రుగొండ ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి (ఎఫ్‌ఆర్వో) చలమల శ్రీనివాసరావు హత్య బాధాకరమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోడు భూములకు పట్టాలు ఇవ్వడంలో జాప్యం వల్లే ఘాతుకం జరిగిందని తెలిపారు. పరిష్కారం జాప్యమైతే ఎలాంటి పరిణామాలు.. ఉంటాయన్నదానికి ఇదొక ఉదాహరణ అని పేర్కొన్నారు. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ప్రకారం మంత్రుల కమిటీ పనిచేయడం లేదని భట్టి విక్రమార్క తప్పుబట్టారు. గొత్తికోయల దాడిలో శ్రీనివాసరావు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌ (Remand)కు పంపారు. హత్యకు ఉపయోగించిన రెండు వేటకొడవళ్లను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ హత్యకు కారణాలేమైనా ఉన్నాయా? మావోయిస్టుల కోణం ఉందా? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఎఫ్‌ఆర్వో స్థాయి వ్యక్తి బైక్‌పై ఎందుకు వెళ్లారు? అనే కోణంపైనా విచారణ జరుపుతున్నారు.

* తమిళనాడులో జరిగిన ఎయిర్ గన్ పోటీల్లో పతకాలు సాధించిన తెలంగాణ జట్టు కోఆర్డినేటర్ లక్ష్మీ చైతన్యకు హైదరాబాద్ వనస్థలిపురంలోని గాయత్రి భవన్‌లో సత్కారం జరిగింది. చెన్నైలో ఈ నెల 12, 13 తేదీల్లో జరిగిన ఈ పోటీల్లో తెలంగాణ ఎయిర్ గన్ జట్టు కోఆర్డినేటర్ లక్ష్మీ చైతన్య ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో 4 స్వర్ణ, 3 కాంస్య పతకాలను తెలంగాణ జట్టు కైవసం చేసుకుంది. గాయత్రి భవన్ సభ్యులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి, గాయత్రి భవన్ సభ్యులు మహంకాళి రాజేశ్వరి, బంగారు పతకం సాధించిన ఎం. నాగ అక్షయ తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం ఆఖరి రోజైన బుధవారం గాయత్రి భవన్‌లో లక్ష బిల్వార్చన, కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి.

* తాను రిషికొండను సందర్శించకుండా ఆంక్షలు పెడుతున్నారని సీపీఐ నారాయణ (CPI Narayana) ఆరోపించారు. రిషికొండ (Rishikonda) సందర్శనకు కోర్టు (Court) నుంచి అనుమతి తెచ్చుకున్నానని చెప్పారు. అనుమతి ఇవ్వాలన్న కోర్టు ఆదేశాలను ప్రభుత్వం (AP Govt) ధిక్కరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అందుబాటులో లేని సమయంలో సమాచారం ఇచ్చారని మండిపడ్డారు. రేపు రిషికొండను సందర్శిస్తా, అక్కడి దోపిడీని ప్రజలకు వివరిస్తానని స్పష్టం చేశారు. అనుమతిస్తారో.. అడ్డుకుంటారో చూస్తానని సీపీఐ నారాయణ సవాల్ విసిరారు.

* బీజేపీ నేత బీఎల్ సంతోష్ (BL Santosh) జీవితం తెరిచిన పుస్తకమని ఆ పార్టీ నేత లక్ష్మణ్ (Laxman) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. దేశం కోసం సర్వం త్యాగం చేసిన వ్యక్తి బీఎల్ సంతోష్ (BJP Leader) అని తెలిపారు. కక్ష సాధింపులో భాగంగానే బీఎల్ సంతోష్‌ (MLAs Purchase case)పై అక్రమ కేసు నమోదు చేశారని ఆరోపించారు. అవినీతి చేయకుంటే.. టీఆర్ఎస్ నేతలకు ఉలుకెందుకని ప్రశ్నించారు. తమకున్న హక్కుల మేరకు దర్యాప్తు సంస్థలు తన పని చేసుకుపోతున్నాయన్నారు. ఐటీ, ఈడీ రైడ్స్ రాష్ట్రంలో కొత్త కాదని తెలిపారు. తప్పుచేయకుంటే టీఆర్ఎస్ నేతలు నిరూపించుకోవచ్చన్నారు. బీఎల్ సంతోష్‌పై కేసు వ్యవహారాన్ని న్యాయస్థానంలో ఎదుర్కొంటామని తెలిపారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఎక్కువ మాట్లాడనని లక్ష్మణ్ (BJP) పేర్కొన్నారు.

* పేదల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని బంజారాహిల్స్‌ శ్రీరామ్‌నగర్‌లో రూ.2కోట్ల వ్యయంతో నిర్మించనున్న మల్టీపర్పస్‌ కమ్యూటీ హాల్‌, బస్తీ దవాఖాన భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే దానం నాగేందర్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మితో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాలనీ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని నూతనంగా నిర్మించున్న భవనంలో ఫంక్షన్‌ హాలు, బస్తీ దవాఖానాతో పాటు అంగన్‌వాడీ కేంద్రం ఉండేలా చూడాలని, ప్లేగ్రౌండ్‌ను అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. గత 40-50 సంవత్సరాల నుంచి కాలనీ ప్రజలు అభివృద్ధి పనులు చేపట్టాలని కోరినా.. ఎవరూ పట్టించుకోలేదన్నారు.

* శ్రీలంక మాజీ అధ్య‌క్షుడు గొట‌బ‌య రాజ‌ప‌క్స‌కు ఆ దేశ సుప్రీంకోర్టు స‌మ‌న్లు జారీ చేసింది. శ్రీలంక పొడుజ‌న పెర‌మున పార్టీకి చెందిన దుమిండ సిల్వ‌కు క్ష‌మాభిక్ష పెట్టిన కేసులో రాజ‌ప‌క్స‌కు స‌మ‌న్లు జారీ చేయ‌డం ఇది రెండ‌వ సారి. 2011లో జ‌రిగిన ఓ మ‌ర్డ‌ర్ కేసులో సిల్వా నిందితుడు. అత‌నికి 2017లో మ‌ర‌ణ‌శిక్ష‌ను ఖ‌రారు చేశారు. మాజీ ఎంపీ ప్రేమ‌చంద్ర స‌న్నిహితుడిని సిల్వా హ‌త్య చేశాడు. అయితే జూన్ 2021లో అత‌నికి రాజ‌ప‌క్స క్ష‌మాభిక్ష పెట్టారు. ఈ ఏడాది మేలో సుప్రీంకోర్టు ఆ క్ష‌మాభిక్ష‌ను ర‌ద్దు చేసింది. సిల్వాను మ‌ళ్లీ అరెస్టు చేయాల‌ని ఆదేశించింది

* టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరు నెలల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్తారని బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం మాట్లాడుతూ ఈడీ ఐటీ (IT) సోదాలు.. టీఆర్ఎస్ (TRS), బీజేపీ (BJP) ఆడుతున్న డ్రామాలన్నారు. ఎఫ్ఆర్వో అధికారి హత్యకి సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం బీఎస్పీ కొట్లాడుతుందని, 52 శాతం ఉన్న బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఇస్తే ఎలా? అని ప్రశ్నించారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో ఆర్థికంగా వెనకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవకాశం ఇవ్వాలని, కేంద్రం బీసీ జనగణన చేయాలని డిమాండ్ చేశారు

* ఉత్తరాంధ్రకు చెందిన 26 కులాలను బీసీ జాబితాలో తిరిగి పునరుద్ధరించాలని గవర్నర్ తమిళిసైను కోరామని.. అందుకు గవర్నర్ సానుకూలంగా స్పందించారని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు. గురువారం గవర్నర్‌తో భేటీ అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ… సెటిలర్స్‌ను కడుపులో పెట్టుకుని చూసుకుంటామన్న కేసీఆర్… కడుపు కొట్టారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు చెందిన 26 కులాలను బీసీ జాబితాలో చేర్చకుంటే కేసీఆర్ సర్కార్‌ పై ఉద్యమం తప్పుదని హెచ్చరించారు. కేసీఆర్ చేయకుంటే బీజేపీ అధికారంలోకి వచ్చాక బీసీ జాబితాలో చేర్చుతామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ఏకపక్షంగా ఒక్క కలం పోటుతో 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించిందని విమర్శించారు. స్కాలర్ షిప్‌లు లేక బీసీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు

* శాశ్వత భూ హక్కు పథకం ఓ పబ్లిసిటీ స్టంట్ అని ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… జగనన్న భూ హక్కు ఏమిటి?… జగన్ తాత, తండ్రి ఆస్తులు పంచుతున్నారా? అని ప్రశ్నించారు. సీఎంకు పబ్లిసిటీ పిచ్చి పట్టుకుందని అన్నారు. పాస్‌బుక్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు అన్నిటిపైనా తన ఫోటో పెట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. సీఎం జిల్లాల పర్యటనలకు భయపడుతున్నారని అన్నారు. మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాట ఆడుతున్నారన్నారు. తెల్లవారితే భూములు ఎలా కబ్జా చేయాలన్న ఆలోచన తప్పా మరొకటి లేదని అన్నారు. మూడేళ్ళలో ఉత్తరాంధ్ర కు ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. జగనన్న కాలనీల్లో భారీ అవినీతి దాగి ఉందని ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు.

* కోర్టులో ఫైళ్లను చోరీ చేసే ఘనులకు సీఎం జగన్ మంత్రి పదవి ఇచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. నెల్లూరు కోర్టులో చోరీ అయిన ఫైళ్ల కేసు విచారణను హైకోర్టు సీబీఐకి అప్పగించింది. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. మంత్రి కాకాణి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ఆదేశాలతోనైనా సిగ్గుంటే మంత్రి కాకాణి( తో జగన్ రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేయకుంటే డిస్మిస్ అయినా చేయాలని కోరారు. మరొకరైతే వెంటనే డిస్మిస్ చేసేవారని.. జగన్ మీదే సీబీఐ కేసులున్నాయి కాబట్టే డిస్మిస్ చేయరని విమర్శించారు. దొంగలు.. దోపిడీదారుల బ్యాచ్ తయారై తనపై దాడికి దిగుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

* ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన సందర్భంగా గురువారం మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. ఆమె వెంట ఎంఎల్‌ఏ శంకర్ నాయక్,జడ్పీ చైర్మన్ బిందు, ఎస్పీ శరత్ చంద్ర పవర్ , మున్సిపల్ చైర్మన్ డాక్టర్‌ రామ్మోహన్ రెడ్డి, టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి నుకల నరేష్ రెడ్డి తదితరులు పట్టణంలో నూతన మెడికల్ కళాశాల, జిల్లా కలెక్టర్ నూతన కార్యాలయం, బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు.

* క్షేత్రస్థాయిలో బలోపేతంపై టీటీడీపీ ఫోకస్ పెట్టిందని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. నేడు ఎన్టీఆర్ భవన్‌లో కాసాని అధ్యక్షతన సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గంలో 35 వేలకు పైగా సభ్యత్వాలు నమోదు చేయాలని నిర్ణయించామన్నారు. పార్టీలో కష్టపడేవారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరటం ఖాయమన్నారు. హైదరాబాద్‌లో ఎక్కడ చూసిన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధే కనబడుతోందన్నారు. ఇంటింటికీ తెలుగు దేశం పేరుతో కార్యక్రమాలు చేపట్టబోతున్నామని కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు.

*టీమ్ వ‌ర్క్‌తో ముందుకెళితే ఎంత‌టి అద్భుతాన్నైనా ఆవిష్క‌రించ‌వ‌చ్చ‌ని అంద‌రూ చెబుతుంటారు. ఇదే కాన్సెప్ట్‌ను హైలైట్ చేస్తూ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మ‌హింద్ర ఓ మోటివేష‌న‌ల్ వీడియోను షేర్ చేశారు. కార్పొరేట్ దిగ్గ‌జం షేర్ చేసిన ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌వుతోంది. ట్విట్ట‌ర్‌లో షేర్ చేసిన ఈ షార్ట్ క్లిప్‌లో రెండు ప‌క్షులు క‌నిపిస్తున్నాయి.

*ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఓ శనిలా పట్టి వ్యవస్థల్ని నాశనం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆక్వా సదస్సులో టీడీపీ అధినేత మాట్లాడుతూ… ప్రభుత్వ ధనదాహం, అహంకార ధోరణికి ఆక్వా రైతులు బలైపోతున్నారన్నారు. ఎదురు దాడితో రైతు సమస్యల పరిష్కారం కావని జగన్మోహన్ రెడ్డి గ్రహించాలని హితవుపలికారు. ‘‘సమస్యల పరిష్కారం చేతకాకుంటే రాజీనామా చేసి పో, నేనొచ్చి ఎలా పరిష్కరించాలో చూపిస్తా’’ అని అన్నారు. జోన్ విధానం తీసుకొచ్చి రైతుల పొట్టెందుకు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏటా ఆక్వారంగంలో 70 శాతం వృద్ధి సాధించామని తెలిపారు. నాటి విధానాలను కొనసాగించి ఉంటే ఆక్వా రైతులకు నేడు ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల ఖర్చులు రెట్టింపై రంగం మొత్తం కుదేలైపోయిందని విమర్శించారు. 80 శాతం రైతులకు యూనిట్ విద్యుత్ ధర రూ.3.80 పడుతోందన్నారు. రూ.4 పైచిలుకు ఉన్న యూనిట్ విద్యుత్ ధరను టీడీపీ ప్రభుత్వం రూ.2కి తగ్గించిందని టీడీపీ అధినేత గుర్తుచేశారు.

*ఈడీ దాడులపై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ ఎక్కడ దాడులు చేసినా వాళ్ల వద్ద ఉన్న కెమెరాలతో లైవ్ పెట్టాలన్నారు. అలా చేస్తే లోపల ఏమి జరుగుతోందో? అందరికీ తెలుస్తుందని… అక్రమాలన్నీ బయటపడతాయని నారాయణ పేర్కొన్నారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీల పైనా.. వ్యాపార సంస్థలపైన దాడులు చేస్తున్నారని ఆరోపించారు. లైవ్ పెట్టకపోతే ఈడీ దాడులను కేంద్ర కక్ష సాధింపు చర్య అని చెప్పాల్సి వస్తుందని నారాయణ పేర్కొన్నారు.
*విశాఖ: నగరంలోని వైసీపీ (YCP)లో విభేదాలు బయటపడ్డాయి. 60వ వార్డు వైసీపీ కార్పొరేటర్ పీవీ సురేష్, అతడి అనుచరుడిపై మల్కాపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పొట్టి మూర్తి అనే వ్యక్తి తన స్నేహితుడితో మాట్లాడుతుండగా.. తన ఏరియాలోకి ఎందుకు వచ్చావంటూ కార్పొరేటర్ పీవీ సురేష్ ఘర్షణకు దిగారు. దీంతో పొట్టి మూర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐపీసీ 323, 341, 506 రెడ్ విత్ 34 క్రింద కార్పొరేటర్‌ సురేష్‌పై కేసు నమోదు చేశారు.

* ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈసీ అరుణ్‌ గోయల్‌ నియామకానికి సంబంధించిన ఫైళ్లను.. సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్‌ సమర్పించారు. నియామకంలో కేంద్రం చూపిన వేగాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఒక్క రోజులోనే మొత్తం ప్రక్రియ ఎలా పూర్తి చేశారని సుప్రీంకోర్టు నిలదీసింది. మే 15 నుంచి కేంద్ర ఎన్నికల కమిషనర్‌ పోస్టు ఖాళీగా ఉంది. మే 15 నుంచి నవంబర్ 18 మధ్య ఏం జరిగిందో చెప్పాలంటూ.. అటార్నీ జనరల్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం నిలదీసింది. అరుణ్ గోయల్ నియామకంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. ‘‘సీఈసీ నియామకానికి నలుగురి పేర్లు సిఫార్సు చేస్తే.. అరుణ్‌ గోయల్‌ను మాత్రమే ఎలా నియమించారు? మిగతా వారిని ఏ ప్రాతిపదికన తిరస్కరించారు? జూనియర్‌ స్థాయి వ్యక్తిని సీఈసీగా ఎలా ఎంపిక చేశారు? గత సీఈసీ పదవీ విరమణ వరకూ కూడా ఆగకుండా.. అరుణ్‌ గోయల్‌ను ఎలా ఎంపిక చేశారు? గోయల్‌ ఎంపికలో ఎందుకంత ఉత్సాహం చూపారు? మొత్తం ప్రక్రియను అర్థం చేసుకోవడానికే ప్రశ్నిస్తున్నాం’’ అని సుప్రీం పేర్కొంది.

*మంత్రి మల్లారెడ్డిపై దుండిగల్‌ పీఎస్‌లో ఐటీ అధికారుల ఫిర్యాదు…తమ అధికారిని మల్లారెడ్డి నిర్బంధించారని ఫిర్యాదులో పేర్కొన్న ఐటీ అధికారులు…ఐటీ అధికారిపై బోయిన్‌పల్లి పీఎస్‌లో మంత్రి మల్లారెడ్డి ఫిర్యాదు… కొడుకుతో బలవంతంగా సంతకం చేయించుకున్నారు…మమల్ని చిత్రహింసలు పెట్టారు, ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు రాస్తున్నారు.

*ఇప్పటం కూల్చివేతల కేసులో పిటీషనర్లపై హైకోర్టు ఆగ్రహం ఇప్పటం కూల్చివేతల కేసులో కోర్టును పక్కదారి పట్టించారంటూ 14 మంది పిటిషనర్లకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున జరిమానా విధించిన హైకోర్టు కూల్చివేతలపై గతంలో స్టే ఇచ్చిన హైకోర్టుస్టే ఇవ్వలేదంటూ కోర్టును పక్కదారి పట్టించిన పిటిషనర్లు..

*కార్తీక మాసం ఆఖరి రోజు సందర్భంగా భక్తులు నదిలో దీపాలు వదులుతున్నారు. పోలమ్మ వెళ్లిరా అమ్మ అంటూ పోలిని స్వర్గానికి భక్తులు పంపుతున్నారు. నెలరోజులపాటు భక్తిశ్రద్ధలతో ఉపవాసాలతో కార్తీకమాస పూజలు, ఉదయాన్నే నది స్నానాలను ఆచరించి కార్తీక దీపాలను మహిళ భక్తులు వదులుతున్నారు.ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రంతో శైవ క్షేత్రాలు మారు మోగుతున్నాయి.

*వచ్చే ఏడాది ఏప్రిల్‌ లేదా మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజు వివరాలను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ దేవానందరెడ్డి బుధవారం వెల్లడించారు. ప్రస్తుతం టెన్త్‌ చదువుతున్న విద్యార్థులు రూ.125 చెల్లించాలని పేర్కొన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు రాసేవారు మూడు సబ్జెక్టుల వరకు రూ.110, మూడు సబ్జెక్టులు దాటితే రూ.125 చెల్లించాలని తెలిపారు. ఒకేషనల్‌ విద్యార్థులు రూ.60 అదనంగా చెల్లించాలని, మైగ్రేషన్‌ సర్టిఫికెట్‌కు రూ.80 చెల్లించాలని పేర్కొన్నారు

* ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ విద్యా సంస్థలో ఇంటర్మీడియట్‌ ప్రవేశాలు, ఉపకార వేతనాల కోసం డిసెంబరు 4న పరీక్ష నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్‌ విద్యాసంస్థల డీన్‌ ఎన్వీ రామారావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం హిమాయత్‌నగర్‌లో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ విద్యాసంస్థల్లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌ నారా భువనేశ్వరి సూచనల మేరకు మొదటి పది ర్యాంకులు సాధించిన వారికి నెలకు రూ.5 వేల చొప్పున, తర్వాతి 15 ర్యాంకులు సాధించిన వారికి నెలకు రూ.3 వేల చొప్పున ఇంటర్‌ రెండు సంవత్సరాలు ఉపకార వేతనం అందజేస్తామని వివరించారు. ఈ నెల 30లోగా పేర్లు నమోదు చేసుకోవాలని, 7660002627 అనే నెంబరులో సంప్రదించాలని ఆయన సూచించారు.

*ఎన్నికల కమిషనర్ల నియామకానికి కొలీజియంలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిల్‌ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం బుధవారం పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల కమిషన్‌ పూర్తిగా స్వతంత్రంగా పనిచేయాలంటే.. స్వతంత్రత, నీతి, నిజాయతీలు గల వ్యక్తి చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ (సీఈసీ)గా ఉండాల్సిన అవసరం ఉందని.. సీఈసీ రాజకీయ ప్రభావానికి లోనుకాకుండా ఉండాలని స్పష్టం చేసింది. వ్యక్తిత్వం ఉన్నవారిని కమిషనర్‌గా నియమించాలని స్పష్టం చేసింది.

* ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడి గా గిడుగు రుద్రరాజు నియమితులయ్యారు. ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న గిడుగును ఏపీసీసీ చీఫ్‌గా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మస్తాన్ వలీ, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, పి.రాజేష్ రెడ్డిలను నియమించింది. ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్గా పల్లంరాజు నియమితులయ్యారు. క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా హర్షకుమార్‌ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. మీడియా, సోషల్ మీడియా కమిటీ చైర్మన్గా తులసిరెడ్డి నియమితులయ్యారు.

*భారతదేశాన్ని వరుస భూకంపాలు వదలడం లేదు. మళ్లీ మేఘాలయలో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది.మేఘాలయలోని (Meghalayas) తురా నగరంలో గురువారం సంభవించిన భూకంపం(Earthquake) తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.4 గా నమోదైంది.గురువారం తెల్లవారుజామున మేఘాలయలోని తురా(Tura) సమీపంలో 3.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.

*ఒడిసాలో దొరికిన మావోయిస్టు డంప్‌లో ఈవీఎం ఉండడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఈవీఎం మావోయిస్టులకు ఎందుకు? దీన్ని ఎక్కడ నుంచి తెచ్చారు? అని ఒడిసా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒడిసా రాష్ట్రం మల్కనగిరి జిల్లా కటాఫ్‌ ఏరియా ఏవోబీలోని జోడాంబ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోకి వచ్చే ధ్కాడ్‌పొదర్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు చెందిన భారీ డంప్‌ దొరికినట్టు మల్కనగిరి పోలీసులు బుధవారం వెల్లడించారు. మావోయిస్టుల ఆంధ్రా-ఒడిసా స్పెషల్‌ జోన్‌ కమిటీకి చెందిన ఈ డంప్‌ సోమవారం సాయంత్రం లభ్యమైనట్టు వారు వెల్లడించారు. ఈ డంప్‌లో ఎన్నికల్లో వినియోగించిన అభ్యర్థుల పేర్లు, గుర్తులతో ఉన్న ఈవీఎం కూ

*త్వరలో ఎన్నికలు జరగబోయే ఉపాధ్యాయ, పట్టభద్రులు శాసనమండలి నియోజకవర్గాల ఓటర్ల ముసాయిదా జాబితాను ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గంలో 20,914 ఓట్లు… కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గంలో 22,256 ఓట్లు ఉన్నాయని తెలిపింది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఇప్పటివరకూ 43,170 ఓటర్లు నమోదయ్యాయి. అలాగే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో 3,64,288 ఓట్లు… కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో 2,91,089 ఓట్లు… శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో 2,43,903 ఓట్లు ఉన్నాయని తెలిపింది.

*రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలందరిపై ఐటీ, ఈడీ దాడులు జరగడం లేదని, ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించారో వారి మీదే జరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. గ్రానైట్‌ వ్యాపారం, మెడికల్‌ కాలేజీలు, ఫార్మా బిజినెస్‌ ఉన్నవారి ఇండ్లలోనే సోదాలు నిర్వహిస్తున్నారని చెప్పారు.

*నిర్మాణం తుది దశలో ఉన్న డబుల్‌ బెడ్రూం ఇళ్లకు మౌలిక సదుపాయాల కల్పనతోపాటు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, అర్హులకు డబుల్‌ బెడ్రూం ఇళ్లను అందించేందుకు చర్యలు తీసుకోవాలని గృహా నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఈ ఇళ్ల నిర్మాణం, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై మంత్రి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రూ.19,328.32 కోట్లతో 2,91,057 ఇళ్లను మంజూరు చేయగా, ఇప్పటివరకు 2,28,529 ఇళ్లకు టెండర్‌ ప్రక్రియ పూర్తిచేసి నిర్మాణం ప్రారంభించినట్టు తెలిపారు. వీటిలో 1,29,528 ఇళ్లు ఇప్పటికే పూర్తికాగా 58,350 ఇళ్లు తుది దశలో ఉన్నాయని, మరో 40,651 డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉందన్నారు. డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటివరకు రూ.11,614.95 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. నిర్మాణం పూర్తయిన, నిర్మాణం తుది దశలో ఉన్న ఇళ్లకు మౌలిక సదుపాయాలను త్వరితగతిన కల్పించాలని, అర్హులకు ఇళ్లు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

*కొన్ని భూకంపాలను పరిశీలించినపుడు భూకంప లేఖిని (Richter Scale)పై చూస్తే చాలా తక్కువ తీవ్రత కనిపిస్తుంది. కానీ ఆ భూకంపం వల్ల ప్రజలకు తగిలే దెబ్బ విపరీతంగా ఉంటుంది. ఇటువంటి అనుభవం తాజాగా ఇండోనేషియాలోని జావా దీవి ప్రజలకు ఎదురైంది. కేవలం 5.6 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల 260 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పాఠశాలలు, ఆసుపత్రి, ఇతర భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొలబద్దపై కనిపించినదానికి భిన్నంగా వాస్తవ నష్టం జరగడానికి కారణాలేమిటి?

*చెరుకు పంటకు మద్దతు ధరను పెంచాలన్న డిమాండ్‌తో బెంగళూరు(Bengalure) ఫ్రీడంపార్కులో నిరవధిక ధర్నా కొనసాగుతోంది. రాష్ట్ర చెరకు రైతుల సంఘం అధ్యక్షుడు కురుబూరు శాంతకుమార్‌ సారథ్యంలో రైతులు ధర్నా చేస్తున్నారు. ఒక వైపు గజగజ వణికించే చలి, మరోవైపు వర్షపు జల్లులు కురుస్తున్నా లెక్కచేయకుండా రైతులు తమ ఆందోళనను కొనసాగించారు. చెరకు టన్నుకు రూ.3,500 మద్దతు ధరతో కొనుగులో చేయాలని రైతులు కోరుతున్నారు. గజగజ వణికించే చలిలోనూ రైతులు ధర్నా చేస్తున్నా కనీస పరామర్శకు మంత్రులుగానీ, అధికారులు గానీ రాలేదని అధ్యక్షుడు శాంతకుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

*భారతదేశాన్ని వరుస భూకంపాలు వదలడం లేదు. మళ్లీ మేఘాలయలో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది.మేఘాలయలోని తురా నగరంలో గురువారం సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.4 గా నమోదైంది.గురువారం తెల్లవారుజామున మేఘాలయలోని తురా(Tura) సమీపంలో 3.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.

*కాకినాడ జిల్లా తుని పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత పోల్నాటి శేషగిరిరావుపై దాడిచేసిన నిందితుడు చంద్రశేఖర్‌ను అరెస్టు చేసినట్టు అడిషనల్‌ ఎస్పీ పి.శ్రీనివాస్‌ బుధవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం విశాఖపట్నం ఆరిలోవ పెద గదిలి ప్రాంతానికి చెందిన కప్పా అభిరామ్‌ అనే వ్యక్తి వివిధ ప్రాంతాల్లో పూజలు చేస్తూ ఉండేవాడు. అదే ప్రాంతానికి చెందిన అగ్రహారపు చంద్రశేఖర్‌ అతని వద్ద శిష్యుడిగా కొనసాగుతున్నాడు. తుని ప్రాంతంలోనూ పూజలు చేసే ఇతనికి… పోల్నాటి శేషగిరిరావు అనే వ్యక్తిపై దాడి చేయాలని, అందుకు డబ్బులు ఇస్తానని అభిరామ్‌ చెప్పాడు. అంగీకరించిన చంద్రశేఖర్‌ స్నేహితులతో కలిసి శేషగిరిరావు కదలికలను కొంతకాలంగా గమనిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ ఉదయం చంద్రశేఖర్‌ మోటారు సైకిల్‌పై శేషగిరిరావు ఇంటికి వచ్చి భిక్షం అడుగుతూ కత్తితో చేతిని నరికాడు.