Politics

తమ్ముడు శివనాథ్ పై ఎంపీ కేశినేని నాని సెటైర్లు.

తమ్ముడు శివనాథ్ పై ఎంపీ కేశినేని నాని సెటైర్లు.

వంద చీరలు… పది ట్రైసైకిల్లు పంచి దానకర్ణుడిలాగా కలరింగ్

ఎంపి కేశినేని నాని వ్యాఖ్యలు .!

ఎన్టీఆర్‌ జిల్లా: వచ్చే ఎన్నికల్లో పోటీపై విజయవాడ ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి తనకు పార్టీలతో పనిలేదని.. ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా ప్రజలు గెలిపిస్తారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తాను ఎక్కడా చెప్పలేదని అన్నారు. చంద్రబాబు టికట్‌ ఇవ్వకుంటే ఏమవుతుంది అంటూ ప్రశ్నించారు.

ఈమేరకు ఎంపీ కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ.. మోడీని నిండు సభలో వ్యతిరేకించా.. అయినా బెజవాడలో పనులు ఆగాయా..? దటీజ్ కేశినేని నాని. నన్ను.. నా పర్సనాల్టీని డీగ్రేడ్ చేయాలని చూడొద్దు. నన్ను డీ-గ్రేడ్ చేయాలని చూస్తే.. అంతగా నా పర్సనాల్టీ పెరుగుతుంది. 2013కు ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు ఎక్కువ ఉండేవి. చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకంతో నేను టీడీపీలో చేరాను. నేను 2013లో టీడీపీలో చేరాకే వైసీపీలోకి వలసలు ఆగాయి. టాటా ట్రస్టుతో కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాను అని చెప్పారు.

కేశినేని చిన్నిపై సెటైర్లు
తన సోదరుడు కేశినేని చిన్నిపై ఎంపీ నాని సెటైర్లు వేశారు. వంద చీరలు.. పద