Business

12 రోజులు బ్యాంకులు బంద్.. సెలవుల జాబితా ఇదే.. పనులుంటే త్వరగా చూస్కొండి

12 రోజులు బ్యాంకులు బంద్.. సెలవుల జాబితా ఇదే.. పనులుంటే త్వరగా చూస్కొండి

బ్యాంకులో మీకు ఏమైనా పని ఉందా? వచ్చే నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులు పని చేస్తాయో తెలుసుకోండి. లేదంటే మీరు వెళ్లే సరికి బ్యాంకు ముసి ఉంటే చేయాల్సిన పని ఆగిపోయే ప్రమాదం ఉంది. బ్యాంకు పనివేళ్లోనే వెళితే అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతాం. మరి వచ్చే మార్చి 2023 నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయి? ఏ రోజుల్లో బ్యాంకులు బంద్ ఉండనున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మార్చిలో 12 రోజులు బ్యాంకులు బంద్
వివిధ రాష్ట్రాల్లో మారనున్న సెలవులు
రెండో, నాలుగో శనివారం, ఆదివారాల్లో మూత

ఫిబ్రవరి నెల ముగిసేందుకు ఇంకా వారం రోజుల సమయమే ఉంది. ఈ వారంలో రెండు రోజులు బ్యాంకులు మూసే ఉంటాయి. ఫిబ్రవరి 25 నాలుగో శనివారం, ఫిబ్రవరి 26 ఆదివారం. మరోవైపు.. వచ్చే నెల మార్చిలో బ్యాంకులు ఏకంగా 12 రోజులు మూతపడనున్నాయి. దీంతో బ్యాంక్ సర్వీసలు, ఏటీఎం సర్వీసలపై ప్రభావం పడె అవకాశం ఉంది. వచ్చే మార్చి నెలలో ఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి? వంటి కచ్చితంగా తెలుసుకోవాల్సిన వివరాలు మనకు తెలిసి ఉన్నప్పుడే.. ఎలాంటి అవాంతరాలు లేకుండా మన పనులు మనం చూసుకోవచ్చు.

వచ్చే మార్చి 2023 నెలలో మొత్తం 12 బ్యాంక్ సెలవులు ఉన్నాయి. అందులో రెండో, నాలుగో శనివారాలు, నాలుగు ఆదివారాలు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాలెండర్ ప్రకారం, ప్రభుత్వ , ప్రైవేటు బ్యాంకులు ఆయా సెలవు దిన్నాల్లో మూతపడనున్నాయి. మరోవైపు.. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ సెలవులను బట్టి బ్యాంకులు మూసి ఉంటాయి. ఈ ప్రాంతీయ సెలవులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను నిర్ణయిస్తాయి. ఈ వివరాలు ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో ఉండవు.

బ్యాంక్ సెలవులు లిస్ట్ ఇదే..
మార్చి 3: మార్చి నెల ప్రారంభంలోనే తొలి శుక్రవారం రోజున చప్చార్ కుట్ సెలవు దినం సందర్భంగా మణిపూర్‌లో బ్యాంకులు మూతపడనున్నాయి.
మార్చి 5: ఆది వారం రోజున వీకండ్ బ్యాంక్ హాలిడే ఉంటుంది. ఈ రోజున దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
మార్చి 7: మంగళవారం రోజున హోలీ (రెండో రోజు) వేడుకలు ఉన్నాయి. దీనిని హోలికా, దహన్, ధులాండి, దోల్ జాత్రా పేర్లతో వివిధ రాష్ట్రాలో జరుపుతారు. చాలా రాష్ట్రాల్లో హోలీ రోజున బ్యాంకులకు సెలవులు ఉంటాయి.
మార్చి 8: ధులేటి, దొల్యాత్రా, హోలీ, యాసాంగ్ రెండో రోజున పలు రాష్ట్రాల్లో బ్యాంకు సెలవు దినంగా ప్రకటించారు.
మార్చి 9: గురువారం రోజున బిహార్‌లో హోలీ వేడుకలు నిర్వహిస్తారు. ఆ రోజున బిహార్ రాష్ట్రంలో బ్యాంకులు బంద్ ఉంటాయి.
మార్చి 11: ఈ నెలలో మార్చి 11 రెండో శనివారం కావడంతో దేశ వ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
మార్చి 12: దేశ వ్యాప్తంగా ఆదివారం రోజున బ్యాంకులు బంద్ ఉంటాయి.
మార్చి 19: ఆది వారం రోజున వీకెండ్ హాలీడే ఉంటుంది. ఇది దేశవ్యాప్తంగా కొనసాగుతుంది.
మార్చి 22: ఉగాది, బిహార్ దివాస్, తెలుగు కొత్త సంవత్సరం వంటి పండగలు ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్ ఉంటాయి.
మార్చి 25: ఈనెలలో ఇది నాలుగో శనివారం కావడంతో బ్యాంకులు మూసి ఉంటాయి.
మార్చి 26: వీకెండ్ హాలీడే
మార్చి 30: గురువారం రోజున శ్రీరామ నవమి ఉన్న కారణంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి.
పైన పేర్కొన్న ఆర్‌బీఐ అధికారిక లిస్ట్‌తో పాటు ప్రాంతీయంగా రాష్ట్రాల్లో పండగలు, ఇతర సెలవు దినాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. మార్చి 22న బిహార్ డే సందర్భంగా ఒక్క బిహార్ రాష్ట్రంలోనే బ్యాంకులు మూసి ఉంటాయి. మార్చిలో 3వ తేదీ నుంచి 5,7,8,9,11,12,19,25,26,30 తేదీల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. బ్యాంకులు జాతీయ సెలవులు, ప్రాంతీయ సెలవులు సహా రెండో, మూడో శనివారాలు, ఆదివారాల్లో మూసి ఉంటాయనే విషయాన్ని గ్రహించాలి.