DailyDose

లాభాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 17,575

లాభాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 17,575

ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్(Sensex) 216 పాయింట్ల లాభంతో 59,822 దగ్గర ట్రేడవుతోంది.నిఫ్టీ (Nifty) 64 పాయింట్లు లాభపడి 17,575 దగ్గర కొనసాగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 216 పాయింట్ల లాభంతో 59,822 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 64
పాయింట్లు లాభపడి 17,575 దగ్గర కొనసాగుతోంది.డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.66 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో మారుతీ,టైటన్, హెచీఎఫ్సీ, ఎల్అండ్, ఐటీసీ షేర్లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ,
బజాజ్ ఫినసర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా,హెచ్సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లలో నాలుగు రోజుల వరుస నష్టాలకు గురువారం బ్రేక్ పడింది. అక్కడి టెక్ స్టాక్స్ రాణించడంతో సూచీలు పుంజుకున్నాయి. ఆసియా-పసిఫిక్ సూచీలు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.మార్చిలో రష్యా చమురు ఉత్పత్తి గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అంచనాలు వెలువడ్డాయి. దీంతో బ్రెంట్ పీపా ధర రెండు శాతం పెరిగి 82.21 డాలర్లకు చేరింది.జపాన్లో వినియోగదారుల ద్రవ్యోల్బణం 41 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. విదేశీ మదుపర్లు గురువారం భారత ఈక్విటీల్లో రూ.1,417.24 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ మదుపర్లు రూ.1,586.06 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఓఎన్ఎసీ: భారత అగ్రగామి చమురు- గ్యాస్ ఉత్పత్తి సంస్థ ఓఎన్జీసీ మరో 2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.16400 కోట్ల) పెట్టుబడులు పెట్టనుంది. అరేబియా సముద్రం (ముంబయి ఆఫ్షోర్)లో తనకున్న గ్యాస్ క్షేత్రాల్లో రికార్డు స్థాయిలో 103 బావులు తవ్వడం ద్వారా 100 మిలియన్ టన్నుల మేర ఉత్పత్తిని పెంచుకునేందుకు ఈ నిధులు వినియోగించనుందని కంపెనీ అధికారి ఒకరు పేర్కొన్నారు.
యాక్సిస్ బ్యాంక్: సిటీ బ్యాంక్ ఎన్ఏ నుంచి భారత కన్జ్యూమర్ బిజినెస్, సిటీకార్ప్ ఫైనాన్స్ నుంచి ఎన్బీఎఫ్సీ కన్జ్యూమర్ బిజినెస్ ను సొంతం చేసుకునే ప్రక్రియ 2023
మార్చి 1 నాటికి పూర్తవుతుందని యాక్సిస్ బ్యాంక్ విశ్వాసం వ్యక్తం చేసింది.
రైల్ వికాస్ నిగమ్: భోపాల్ రీజియన్లో రూ. 196.77 కోట్లు విలువ చేసే ప్రాజెక్టుకు సంబంధించి రైల్ వికాస్ లెటర్ ఆఫ్ అవార్డును సొంతం చేసుకుంది.
మహీంద్రా లైఫ్ స్పేస్ డెవలపర్స్: కంపెనీ ఎండీ, సీఈఓ పదవికి అర్వింద్ సుబ్రమణియన్ రాజీనామా చేశారు. మే 23న ఆయన స్థానంలో అమిత్ కుమార్ సిన్హా బాధ్యతలు స్వీకరించనున్నారు.