– రాష్ట్రాన్ని అధోగతి పాలుజేసినందుకా?
– స్కీముల పేరిట స్కాములు చేసినందుకా?
– కాళేశ్వరం పేరిట లక్ష కోట్లు దోచుకుతిన్నందుకా?
– పాలమూరును కట్టకుండా దక్షిణ తెలంగాణను ఏడాది చేసినందుకా?
– 16వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని..4.80లక్షల కోట్ల అప్పులపాలు చేసినందుకా?
– రుణమాఫీ, నిరుద్యోగ భృతి అంటూ మోసం చేసినందుకా?
– వడ్డీ లేని రుణాలు, కార్పొరేషన్ లోన్లు ఇస్తామని దగా చేసినందుకా?
– దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి అంటూ నిండా ముంచినందుకా?
– డబుల్ బెడ్ రూం ఇండ్లు, పోడు పట్టాలు ఇస్తామని కుచ్చుటోపీ పెట్టినందుకా?
– డిస్కంల దివాళా తీసి, ఆర్టీసీని ఆగంజేసి, ప్రభుత్వ భూములను కొల్లగొట్టినందుకా?
– ఉద్యమకారులను పక్కన పెట్టి, ఉద్యమ ద్రోహులను అక్కున చేర్చుకున్నందుకా?
– జై తెలంగాణ అన్నోడు.. నై తెలంగాణ అంటున్నందుకా?
– తెలంగాణ తల్లికి ద్రోహం చేసి, తెలంగాణ తల్లి విగ్రహం అంటేనే చీదరించుకుంటున్నందుకా?
– కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే తెలంగాణ తల్లి తల్లడిల్లదు చిన్న దొర.
– మీ తాలిబన్ల పాలనను చూసి, ఎనిమిదేండ్లుగా తెలంగాణ తల్లి తల్లడిల్లుతోంది.
-. దొరల పాలన విముక్తి కోసం ఆశగా ఎదురుచూస్తోంది.
– మీ నియంత పాలనను మీ ఫామ్ హౌజ్ కే పరిమితం చేయడానికి తెలంగాణ ప్రజానికం సిద్ధంగా ఉన్నరు.