Devotional

నేటి మీ రాశి ఫలితాలు

నేటి మీ రాశి ఫలితాలు

🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 *17.03.2023 ✍🏻*
🗓 *నేటి రాశి ఫలాలు 🗓*

🐐 మేషం
ఈరోజు (17-03-2023)

ఈ రోజు చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో నూతన లాభాలు అందుతాయి. సంఘంలో ప్రముఖులతో చర్చలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
ఈరోజు (17-03-2023)

ఈ రోజు వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలతో ముందుకు సాగుతారు. బంధువులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
ఈరోజు (17-03-2023)

ఈ రోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. వృత్తి వ్యాపారాల నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. మిత్రులతో ఆర్థిక విషయంలో విబేధాలు కలుగుతాయి. గృహనిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
ఈరోజు (17-03-2023)

ఈ రోజు భూక్రయ విక్రయలు లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. గృహమున కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారమున నష్టాలు భర్తీ అవుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
ఈరోజు (17-03-2023)

ఈ రోజు సోదరులతో గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. బందు మిత్రుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంతనానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్న కార్య సిద్ది కలుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
ఈరోజు (17-03-2023)

ఈ రోజు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించటం మంచిది. చిన్ననాటి మిత్రుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఆర్థిక వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
💃💃💃💃💃💃💃

⚖ తుల
ఈరోజు (17-03-2023)

ఈ రోజు వృత్తి వ్యాపారాలు స్థిరంగా రాణించవు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వృధా ఖర్చులు అధికమౌతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
ఈరోజు (17-03-2023)

ఈ రోజు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్థులకు హోదాలు పెరుగుతాయి. సన్నిహితుల సహాయంతో దీర్ఘ కాలిక వివాదాల నుండి బయట పడతారు. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
ఈరోజు (17-03-2023)

ఈ రోజు కీలక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగమున విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
ఈరోజు (17-03-2023)

ఈ రోజు ఉద్యోగాలలో స్థిరమైన ఆలోచనలు కలసివస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉంటుంది. వృత్తి వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. ఉద్యోగమున ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ఈరోజు (17-03-2023)

ఈ రోజు నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అతి కష్టంతో అల్ప ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
ఈరోజు (17-03-2023)

ఈ రోజు విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
🦈🦈🦈🦈🦈🦈🦈