Devotional

కోదండరామస్వామిఆల‌యంలో బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌.

కోదండరామస్వామిఆల‌యంలో బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌.

తిరుపతి, 2023 మార్చి 18: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆల‌యంలో బ్ర‌హ్మోత్స‌వాల‌కు మార్చి 19న అంకురార్పణ నిర్వ‌హించ‌నున్నారు. మార్చి 20 నుండి 28వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఆదివారం సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.15 గంట‌ల వ‌ర‌కు సేనాధిప‌తి ఉత్స‌వ‌ము, మేదిని పూజ, మృత్సంగ్ర‌హ‌ణం, శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది.

మార్చి 20న ధ్వజారోహణం

మార్చి 20వ తేదీ సోమవారం ఉదయం 8.45 నుంచి 9.32 గంటల మ‌ధ్య‌ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.

ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు.

ఉదయం, సాయంత్రం

20-03-2023 ధ్వజారోహణం పెద్దశేష వాహనం

21-03-2023 చిన్నశేష వాహనం హంస వాహనం

22-03-2023 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం.

23-03-2023 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

24-03-2023 పల్లకీ ఉత్సవం గరుడ వాహనం

25-03-2023 హనుమంత వాహనం గజ వాహనం

26-03-2023 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

27-03-2023 రథోత్సవం అశ్వవాహనం

28-03-2023 చక్రస్నానం ధ్వజావరోహణం

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది