NRI-NRT

TCSS సింగపూర్ లో ఘనంగా ఉగాది వేడుకలు..

TCSS సింగపూర్ లో ఘనంగా ఉగాది వేడుకలు..

తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ ఆధ్వర్యంలో ఘనంగా
శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు మరియు పంచాంగ శ్రవణం

తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి సెంగ్ కాంగ్ లోని శ్రీ అరుళ్ముగు వేలు మురుగన్ జ్ఞానమునీశ్వర్ ఆలయంలో లో మార్చ్ 22 న ఎంతో ఘనంగా జరిగాయి. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం లో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వ దినా న సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. వేడుకల్లో బాగంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం తో పాటు సింగపూర్ లో తొలిసారి స్థానిక కాలమాన ప్రకారం ప్రత్యేకంగా వ్రాయించిన గంటల పంచాంగాన్ని సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ గంటల పంచాంగాన్ని ప్రముఖ జోతిష పండితులు మరియు పంచాంగ కర్తలు శ్రీ కప్పగన్తు సుబ్బరామ సోమయాజులు మరియు శ్రీ మార్తి శివరామ యజ్ఞనారాయణ శర్మ గార్లు సిద్ధం చేయడం జరిగింది. ఈ వేడుకల్లో సుమారు 200-250 మంది ప్రవాసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులతో పాటు కర్ణాటక మరియు ఇతర రాష్ట్రాల వారు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సాంప్రదాయ ఉగాది పచ్చడి, భక్షాలు, మరియు పులి హోర మొదలగు ప్రసాదం పంపిణి చేయడం జరిగింది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు వివిధ భక్తి మరియు స్వచ్చంద సేవా కార్యక్రమాలను చేస్తూ అందరికి ఆదర్శంగా నిలవడం అభినందనీయం అని వేడుకల్లో పాల్గొన్న భక్తులు కొనియాడారు.

ఈ వేడుకల్లో శిల్ప లక్కనికి, జయశ్రీ గుఱ్ఱం మరయు జోహిత ప్రియ దావులూరి గార్ల సాంస్కృతిక నృత్యాలు భక్తులను అలరించాయి.

ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా శశిధర్ రెడ్డి, నంగునూరి వెంకట రమణ, కాసర్ల శ్రీనివాస్, గోనె నరేందర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల మరియు సతీష్ పెసరు వ్యవరించారు.

ఉగాది వేడుకలు విజయవంతంగా జరుగుటకు మరియు ప్రసాదానికి సహాయం అందించిన దాత లకు, స్పాన్సర్స్ కు మరియు సంబరాల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి TCSS అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి మరియు కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, మరియు కార్యవర్గ సభ్యులు రోజా రమణి, రాధికా రెడ్డి నల్లా, నడికట్ల భాస్కర్, అనుపురం శ్రీనివాస్, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి కృష్ణ విజాపూర్, సదానందం అందె, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు మరియు సంతోష్ వర్మ మాదారపు తదితరులు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యం గా ఈ వేడుకలకు ఘనంగా జరగడానికి చేయూతనందించిన మై హోమ్ కంస్ట్రక్షన్ వారికి, వేంకటేశ్ గుప్త గజవాడ, చమిరాజ్ రామాంజనేయులు (టింకర్ టాట్స్) మరియు రాజిడి రాకేష్ రెడ్డి గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.