Devotional

తిరుమల మెట్లు ఎక్కి వచ్చే భక్తులకు శుభవార్త.. ఏప్రిల్ నుంచి దివ్య దర్శన టోకెన్లు!

తిరుమల మెట్లు ఎక్కి వచ్చే భక్తులకు శుభవార్త.. ఏప్రిల్ నుంచి దివ్య దర్శన టోకెన్లు!

తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. అలిపిరి నడక దారిలో వచ్చే వారికి దివ్య దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి రోజూ 10 వేల టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

సోమవారం తిరుమలలో వేసవి ఏర్పాట్లపై సుబ్బారెడ్డి సమీక్షించారు. నడక దారిలోనే ఈ మేరకు టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. వేసవిలో బ్రేక్ సిఫారసు లేఖలను తగ్గిస్తామని చెప్పారు. భక్తులకు ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

దాదాపు మూడేళ్లుగా నడిచి వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లను టీటీడీ నిలిపివేసింది. కరోనాకు ముందు నుంచీ జారీ చేయడం లేదు. ఈ టికెట్లను పునరుద్ధరించాలంటూ చాలా రోజులుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. నడిచి వచ్చే వారికి, వాహనాల్లో వచ్చే వారికి ఒకే క్యూలైన్ కేటాయించడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మెట్లు ఎక్కి వచ్చే వారికి టోకెన్లు జారీచేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.