Movies

వేట మొదలు పెట్టిన ఎన్టీఆర్.. వీడియోతో ఫ్యాన్స్కు బిగ్ సర్ ప్రైజ్

వేట మొదలు పెట్టిన ఎన్టీఆర్.. వీడియోతో ఫ్యాన్స్కు బిగ్ సర్  ప్రైజ్

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎంతో మంది స్టార్లు ఉన్నారు. కానీ, అందులో అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్లుగా పేరు సంపాదించుకున్న వాళ్లు మాత్రం చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పొచ్చు. అందులో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో సందడి చేస్తోన్న తారక్.. ఇటీవలి కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్నాడు. దీనికితోడు RRRతో అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకున్నాడు. ఈ ఉత్సాహంలోనే ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివతో పాన్ ఇండియా సినిమాను చేస్తున్నాడు

ఫుల్ ఫామ్‌తో సత్తా చాటుతోన్న ఎన్టీఆర్.. ఇప్పుడు తన 30వ సినిమాను కొరటాల శివతో చేస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ పాన్ ఇండియా ప్రాజెక్టును ఎప్పుడో అనౌన్స్ చేసినా.. అనివార్య కారణాల వల్ల ఇది చాలా ఆలస్యం అయింది. దీంతో ఈ ప్రాజెక్టు ఆగిపోతుందని అంతా అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మధ్యనే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశారు. ఆ వెంటనే ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా హాలీవుడ్ టెక్నీషియన్ల పర్యవేక్షణలో పూర్తి చేసుకున్నారు.

ఎన్టీఆర్ హీరోగా వినూత్నమైన సబ్జెక్టుతో రాబోతున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ కోసం హైదరాబాద్ శివారు ప్రాంతమైన శంషాబాద్ ఏరియాలో ఓ భారీ సెట్‌ను నిర్మించారు. ఈ నేపథ్యంలోనే శనివారం నుంచే తారక్ ఈ మూవీ షూట్‌లో పాల్గొంటున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఇందులో యంగ్ టైగర్ తనదైన స్టైల్‌లో నడుచుకుంటూ వచ్చి సెట్స్‌లో అడుగు పెట్టాడు. దీనికి ఫస్ట్ గ్లింప్స్‌లో ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్‌ను యాడ్ చేశారు. అంతేకాదు, ‘వస్తున్నా’ అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్‌తో ముగించారు. దీంతో ఈ వీడియో యమ వైరల్ అవుతోంది.

ఐదు భాషల్లో తెరకెక్కుతోన్న ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఎప్పుడో తెలిపారు.