Movies

సల్మాన్, వెంకీమామతో రామ్ చరణ్ అదిరే స్టెప్పులు.. ఇచ్చి పడేశారుగా..

సల్మాన్, వెంకీమామతో రామ్ చరణ్ అదిరే స్టెప్పులు.. ఇచ్చి పడేశారుగా..

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్స్, పాటలు, పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే టాలీవుడ్ స్టార్ వెంకటేష్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్. ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్స్, పాటలు, పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే టాలీవుడ్ స్టార్ వెంకటేష్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో పూజాహెగ్డే అన్నగా వెంకటేష్ కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమానుంచి బతుకమ్మ సాంగ్ ను రిలీజ్ చేశారు. అలాగే తాజాగా ఏంటమ్మా అనే సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పాటలో అతిథి పాత్రలో మరో టాలీవుడ్ స్టార్ కనిపించనున్నారు. ఆ స్టార్ ఎవరో కాదు. గ్లోబల్ స్టార్ రామ్ రామ్ చరణ్.

తాజాగా ఏంటమ్మా అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈపాటలో సల్మాన్, వెంకటేష్ స్టెప్పులేశారు. అలాగే సాంగ్ చివరిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చి క్యాచీ స్టెప్స్ తో అదరగొట్టారు. పాయల్ దేవ్ కంపోజ్ చేశాడు. విశాల్ దద్లానీ, పాయల్ దేవ్ పాడారు.

అంతేకాదు షబ్బీర్ అహ్మద్ లిరిక్స్ అందించిన ఈ సాంగ్‌ను టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కంపోజ్ చేయడం విశేషం. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమాలో జగపతి బాబు, విజేందర్ సింగ్, అభిమన్యు సింగ్, రాఘవ్ జుయల్, సిద్ధార్థ్ నిగమ్, జాస్సీ గిల్, షెహనాజ్ గిల్, పాలక్ తివారీ, వినాలి భట్నాగర్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా రంజాన్ కానుకగా ఏప్రిల్ 21న రిలీజ్ కానుంది.