DailyDose

శ్రీ శైల భ్రమరాంబిక వార్షిక కుంభోత్సవం *

శ్రీ శైల భ్రమరాంబిక  వార్షిక కుంభోత్సవం *

ప్రతి సంవత్సరం చైత్రమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారము లేదా శుక్రవారాలలో (ఏ రోజు ముందు వస్తే ఆరోజు) శ్రీశైల క్షేత్రంలో ఈ కుంభోత్సవం జరుగుతుంది. ఉత్సవం సందర్భంగా పలు రకాల పుష్పాలతో, నిమ్మకాయదండలతో, వేపమండలతో అలంకరించబడిన దేవాలయాన్ని దర్శించుకునేందుకు స్థానికులు ఎంతో ఉత్సాహాన్ని చూపుతారు. ఊరంతా కలిసి ఊరి పండుగగా జరుపుకునే ఈ ఉత్సవం సకల శుభాలను అనుగ్రహిస్తుందని శ్రీశైలవాసుల తరతరాల విశ్వాసం. చెంచులుగా పిలువబడే ఇక్కడి స్థానిక గిరిజనులు భ్రమరాంబాదేవిని తమ ఆడపడుచుగా, స్వామివారిని తమ అల్లునిగా భావిస్తారు. అందుకే చెంచులు కుంభోత్సవం తమ ఇంటి పండుగా భావించి, ఆనందోత్సవాలతో ఈ ఉత్సవంలో పాల్గొంటారు.

ప్రసిద్ధమైన ఈ ఉత్సవాలలో అమ్మవారికి జరిగే కుంభోత్సవం ఎన్నో విశేషాలతో ముడిపడి ఉంది.

స్వాతికబలి సమర్పణ కుంభోత్సవం

పెద్దసంఖ్యలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు అన్నపురాశులను శక్తిస్వరూపిణియైన భ్రమరాంబ దేవికి స్వాతికమైన పద్ధతిలో బలిని సమర్పించడమే ఈ ఉత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం. ఉత్సవంలో భాగంగానే ఈరోజు శ్రీశైల గ్రామ దేవత అంకాలమ్మకు, ఇంకా క్షేత్ర పరిధిలో అమ్మవారిని విగ్రహాల వద్ద ప్రత్యేక పూజాదికాలు జరిపించబడతాయి. అర్చకులు ముందుగా అమ్మవారికి యథావిధిగా ప్రాతఃకాలపూజలన్నీ నిర్వహించిన తరువాత నవవరణపూజ, త్రిశతి, ఖడ్గమాల, సహస్రనామ అష్టోత్తరపూజలు, జపపారాయణం గావిస్తారు. ఈ పూజలన్నీ అమ్మవారికి ఏకాంత సేవగా నిర్వహింపబడుతాయి. ఆలయ దక్షిణప్రాకార కుడ్యము పై గల మహిషాసురమర్దిని అమ్మవారికి పూజాదికాలు చేసి, 108 కొబ్బరికాయలను సమర్పిస్తారు దీనికే కోటమ్మపూజ అని పేరు. తరువాత అమ్మవారి ముఖమండపం ప్రవేశద్వారం దగ్గర రజకులు ప్రత్యేకమైన పసుపు కుంకుమలతో ఎంతో ఆకర్షణీయంగా ముగ్గును వేస్తారు. దీన్నే చాకలి ముగ్గు అని పిలుస్తారు. వేయడం పూర్తి కాగానే అర్చకులు శ్రీ చక్రానికి ప్రదక్షిణ మండపంలో అమ్మవారికి ఎదురుగా గుమ్మడికాయలు, కొబ్బరికాయలపై పసుపు కుంకుమలను చెల్లి మొదటి బలిని సమర్పిస్తారు. దాంతో భక్తులు నగారా, జేగంట, కొమ్ము, శంఖనాదాలను మ్రోగిస్తారు అమ్మ వారి నామస్మరణ చేస్తూ వసంతం నింపిన గుమ్మడికాయలను, నేలకేసి గట్టిగా కొడుతూ, నిమ్మకాయలను సగానికి కోస్తూ బలిని వేస్తారు.

ఏకాంతములో విశేషపూజలు:

కుంభోత్సవం రోజున ముందుగా అమ్మవారికి ప్రాత: కాలపూజలు యథావిధిగా జరిపించబడతాయి. తరువాత అర్చకస్వాములు నవావరణ పూజ, త్రిశతి, ఖడ్గమాల, సహస్రనామ, అష్టోత్తరపూజలు, జప పారాయణలను చేస్తారు. అయితే సంప్రదాయాన్ని అనుసరించి ఈ పూజలన్నీ |అమ్మవారికి ఏకాంతములో నిర్వహించబడతాయి. అంటే అర్చకులు తప్ప ఇతరులెవరూ ఈ పూజలను వీక్షించే అవకాశం ఉండదు. కుంభోత్సవం కారణంగా ఆ రోజు తెల్లవారుజామునుండే అమ్మవారి ఆలయ తలుపులు మూసివేయబడి ఉంటాయి. సాయంకాలం సూర్యాస్తమయం అయిన తరువాతనే అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు.

స్వామివారికి అన్నాభిషేకం

కుంభోత్సవం రోజున ఉదయం నుండి శ్రీమల్లికార్జునస్వామివారికి అభిషేకాలు, అర్చనలు, సర్వదర్శనం, నివేదనలు మొదలైనవన్నీ యథావిధిగా జరుపబడతాయి. అయితే ఆ రోజు సాయంకాలం స్వామివారి ‘ ప్రదోషకాల పూజలు పూర్తయిన తరువాత, ఎంతో విశేషంగా అన్నాభిషేకాన్ని జరిపి, స్వామివారి మూలమూర్తిని పూర్తిగా పెరుగన్నముతో కప్పివేస్తారు.

శాంతిప్రక్రియ :

కుంభహారతి సమర్పించే సమయములో అర్చకస్వాములు గర్భాలయం వెలుపలి నుండి అమ్మవారికి పసుపు, కుంకుమలను (ఒక్కొక్కటి 21 కేజీలుగా) దోసిళ్లతో సమర్పిస్తారు. ఈ పసుపు, కుంకుమలు అమ్మవారి ముందు పెద్దరాశిగా కనిపిస్తాయి. దీన్నే ‘శాంతి ప్రక్రియ’ అంటారు.

రజక రంగవల్లి :

కుంభోత్సవం రోజున అమ్మవారికి విశేషపూజలు జరిగిన తరువాత (సుమారుగా ఉదయం 10 గంటల సమయములో) అమ్మవారి అంతరాలయ ప్రవేశద్వారము వద్ద రజకుని చేత ప్రత్యేకంగా ముగ్గును వేయిస్తారు. దీనికే ‘రజక రంగవల్లి’ (రజక ముగ్గు) అని పేరు. పసుపు కుంకుమలతో అలంకరించబడి ప్రత్యేకంగా కనిపించే ఈ ముగ్గు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.

ముగ్గు వేయడం పూర్తయిన వెంటనే అర్చకస్వాములు అంతరాలయములోని శ్రీచక్రానికి పూజాదికాలు చేస్తారు. ఆ తరువాత ప్రదక్షిణమండపములో అమ్మవారికి ఎదురుగా ఉంచబడిన గుమ్మడికాయలు, కొబ్బరికాయలపై పసుపుకుంకుమలను చల్లి, తొలివిడత సాత్విక బలిని సమర్పిస్తారు.

నగారా, జేగంట, కొమ్ము, శంఖనాదాల నడుమ, భక్తులందరూ బిగ్గరగా అమ్మవారి నామస్మరణ చేస్తూ వసంతంనింపిన గుమ్మడికాయలను, కొబ్బరికాయలను నేలకేసి గట్టిగా కొడుతూ, నిమ్మకాయలను సగానికి కోస్తూ ఈ సాత్వికబలిని వేస్తారు. కాగా రజక ముగ్గు వేసే ముందు ఆలయదక్షిణప్రాకార కుడ్యముపై గల మహిషాసురమర్ధిని అమ్మవారికి పూజాదికాలను చేసి, 108 కొబ్బరికాయలను సమర్పిస్తారు. దీనికే కోటమ్మపూజ అని పేరు.

సాత్వికబలిగా అన్నరాశి :