Editorials

శనికి ”శనీశ్వరుడు” అనే పేరు ఎలా వచ్చింది..!!

శనికి ”శనీశ్వరుడు” అనే పేరు ఎలా వచ్చింది..!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

🌿కృతయుగంలో కైలాసానికి పరమేశ్వరుడి దర్శనార్థం వచ్చిన నారదుడు నవగ్రహాల్లో ఒకటైన శనిగ్రహ బలాన్ని గురించి చెప్పుకొచ్చాడు.

🌸 నారదుడు అలా శనిదేవుడిని ప్రశంసించడం పరమేశ్వరుని ఏమాత్రం నచ్చలేదు. అంతేకాకుండా శనిదేవుడు శక్తివంతుడైతే తన ప్రభావాన్ని తనపై చూపించి..

🌿తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాల్సిందిగా చెప్తాడు.
ఈ విషయం తెలుసుకున్న శనిగ్రహం.. శివుడిని పట్టేందుకు వెళ్తాడు. శివపరమాత్మను ఒక్క క్షణమైనా పట్టి పీడిస్తానని నారదునితో తిరుగు వర్తమానం పంపుతాడు శనిదేవుడు. 
 
🌸శనిదేవుడు ఇచ్చిన హెచ్చరికతో శివుడిని నారదుడు జాగ్రత్తగా ఉండమంటాడు. దీంతో శని పని పట్టాలని శివుడు కైలాసం నుంచి మాయమై దండకారణ్యం బాట పట్టాడు.

🌿శని సహా ఎవరి దృష్టి కనిపించని చోటు కోసం అన్వేషించి.. అడవిలోని తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం వద్ద మందపల్లి గ్రామం ఒక పెద్ద రావిచెట్టు తొర్రలో ఈశ్వరుడు దాక్కుని తపస్సు చేసినట్లు పురాణాలు చెప్తున్నాయి. 

🌸మరుసటి రోజు ఈశ్వరుడు కళ్లు తెరిచి చూసేసరికి శని ఎదురుగా నిలబడి ఈశ్వరుడిని నమస్కరిస్తా డు. అప్పుడు ఈశ్వరుడు నీ శపథం ఏమైంది.. అని ప్రశ్నిస్తాడు.

🌿ముక్కంటి, పరమశివుడు, చరాచర జీవరాశులకు ఆరాధ్య దైవం కైలాసం నుంచి పారిపోయి, దండకారణ్యంలో పరుగులు పెట్టి దిక్కులేని వాడిలా చెట్టు తొర్రలో దాచుకోవడం శని పట్టినట్లు కాదా ఈశ్వరా? అని ప్రశ్నించాడు.

🌸 దీంతో తనను పట్టిపీడించడంలో సత్తా చాటినందుకు.. తనను మెప్పించిన శనికి ఆనాటినుండి ఈశ్వర అనే శబ్దం సార్థకం కాగలదని మానవులు తనను శనీశ్వరా అని పూజిస్తే..

🌿 శని తరపున పరమశివుడు ఆశీస్సులు ఇస్తానని వరం ఇచ్చాడు. అలా శనిగ్రహం శనీశ్వరుడు అయ్యాడని పురాణాలు చెప్తున్నాయి. 
 
🌸అందుకే శని అని పిలవకుండా శనీశ్వరా అని పిలవడం ద్వారా గ్రహదోషాల నుంచి విముక్తి పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

🌿 ఇంకా శనివారం పూట శనీశ్వరునికి ప్రీతికరమైన నువ్వుల నూనె, నల్లటి నువ్వులు, నీలపు శంఖు పుష్పాలు, నల్లని వస్త్రంతో అర్చిస్తే.. వారికి మృత్యుభయం, అనారోగ్యం కలుగదు.

🌸 ఈతిబాధలుండవు. సుఖశాంతులు, సకలసౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇంకా శనివారం, శనిత్రయోదశి నాడు శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు,

🌿 నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా.. ఏలినాటిశని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది…స్వస్తీ…🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿