NRI-NRT

హైబ్రీడ్ సూర్యగ్రహణం ఎపుడైనా చూసారా… వివరాలివే!

హైబ్రీడ్ సూర్యగ్రహణం ఎపుడైనా చూసారా… వివరాలివే!

హైబ్రీడ్ ఆహారం గురించి విన్నాం గానీ, ఈ హైబ్రీడ్ సూర్యగ్రహణం(Hybrid solar eclipse) గోల ఏంట్రా బాబు అనే అనుమానం వస్తోంది కదూ.నిజమే, మీరు ఇక్కడ విన్నది అక్షరాలా నిజం.విషయంలోకి వెళితే, ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20వ తేదీన సంభవిస్తుంది.సూర్యగ్రహణం అంటే ఏమిటో ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఒకసారి గుర్తు చేసుకుందాం.

సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వచ్చి సూర్యుడిని అడ్డుకోవడాన్ని సూర్యగ్రహణం అని పిలుస్తారు.ఈ సూర్యగ్రహణం వైశాఖ అమావాస్య ( Vaishak Amavasya )రోజున సంభవిస్తుంది.భారత్‌లో మాత్రం ఈ గ్రహణం కనిపించదు.2023లో మొత్తం 4 గ్రహణాలు ఏర్పడుతాయని సమాచారం.

ఇందులో 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు కావడం గమనార్హం.అయితే ఈ ఏప్రిల్ 20వ తేదీన అంటే రేపు వైశాఖ అమావాస్య రోజున ఏర్పడే సూర్యగ్రహణం హైబ్రిడ్ సూర్యగ్రహణం అని అంటారు.ఈ సూర్యగ్రహణం ఉదయం 7గంటల 4 నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాలకు ముగుస్తుంది.అయితే భారతీయ జ్యోతిష్య క్యాలెండర్ ప్రకారం ఈ సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదని భోగట్టా.

ఆస్ట్రేలియా, తూర్పు దక్షిణాసియా, పసిఫిక్ మహాసముద్రం, అంటార్కిటికా, హిందూ మహాసముద్రంలో కనిపిస్తుంది.చివరిగా ఇండోనేషియాలోని పపువా ప్రావిన్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించనుంది.

ఏప్రిల్ 20వ తేదీన సంభవించే ఈ సూర్యగ్రహణం తర్వాత సరిగ్గా 15 రోజులకు చంద్రగ్రహణం ఏర్పడుతుందని తెలుస్తోంది.ఇక 2వ సూర్యగ్రహణం విషయానికొస్తే ఈ ఏడాది అక్టోబర్ 14న సంభవిస్తుంది.ఇది కూడా భారత్‌లో కనిపించదు.గ్రహణం యొక్క ఇరుకైన మార్గంను బట్టి దీన్ని హైబ్రిడ్ గ్రహణం అని పిలుస్తున్నారు.ఇందుకే దీన్ని అరుదైన గ్రహణంగా పరిగణిస్తున్నారు.

ఇక సంపూర్ణ సూర్యగ్రహణం పశ్చిమ ఆస్ట్రేలియా( Australia )లోని నార్త్ వెస్ట్‌ కేప్‌లో దర్శనమిస్తుంది.భారత దేశంలో ఈ సూర్య గ్రహణం కనిపించదు కాబట్టి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుభకార్యాలపై ఎలాంటి ప్రభావం ఉండదని జ్యోతిష్యశాస్త్రవేత్తలు చెబుతున్నారు.