Movies

OG: క్యూట్ లేడీతో పవన్ రొమాన్స్.. అప్పటి వరకూ ఇద్దరూ కలిసి అక్కడేనట

OG: క్యూట్ లేడీతో పవన్ రొమాన్స్.. అప్పటి వరకూ ఇద్దరూ కలిసి అక్కడేనట

కొంత కాలంగా టాలీవుడ్‌లో ఏ హీరో చేయని విధంగా సినిమాల మీద సినిమాలు చేస్తూ రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతోన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇందులో భాగంగానే ఇప్పుడు ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘వినోదయ సీతమ్’ రీమక్‌లను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు.

ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రభాస్‌ను ‘సాహో’తో ఉత్తరాది ప్రేక్షకులకు చేరువ చేసిన యంగ్ డైరెక్టర్ సుజిత్‌తో ‘OG’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) అనే సినిమాను కూడా చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలున్నాయి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కిస్తోన్న ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీనే ‘OG’. ఈ సినిమా ముంబై బేస్‌డ్ ఓ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ స్టోరీతో తెరకెక్కబోతుందని చిత్ర యూనిట్ ముందే వెల్లడించింది. అంతేకాదు, వరుసగా అప్‌డేట్లు ఇస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తూనే ఉంది.
ఇక, ఈ మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తోన్న చిత్ర యూనిట్.. ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ను ముంబైలో ప్రారంభించింది. ఇందులో పవన్ కూడా పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి మరో అదిరే అప్‌డేట్‌ వచ్చేసింది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కిస్తోన్న ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీనే ‘OG’. ఈ సినిమా ముంబై బేస్‌డ్ ఓ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ స్టోరీతో తెరకెక్కబోతుందని చిత్ర యూనిట్ ముందే వెల్లడించింది. అంతేకాదు, వరుసగా అప్‌డేట్లు ఇస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తూనే ఉంది. ఇక, ఈ మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తోన్న చిత్ర యూనిట్.. ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ను ముంబైలో ప్రారంభించింది. ఇందులో పవన్ కూడా పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి మరో అదిరే అప్‌డేట్‌ వచ్చేసింది.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ‘OG’ మూవీలో హీరోయిన్‌గా ప్రియాంక అరుల్ మోహన్‌ను తీసుకుంటున్నారని నాలుగు రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. అందుకు తగ్గట్లుగానే తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. అందులో ప్రియాంక ఈ సినిమాలో చేస్తున్నట్లు తెలిపారు. ‘ఓజీ చిత్రంలో మీరు భాగం అయినందుకు మేమంతా సంతోషిస్తున్నాము’ అంటూ ట్వీట్ చేశారు. ఇక, ఈ నెలాఖరు వరకూ పవన్ – ప్రియాంక మధ్య ముంబైలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని కూడా యూనిట్ సభ్యులు తెలిపారు.

ఇదిలా ఉండగా, పవన్ కల్యాణ్ హీరోగా సుజిత్ రూపొందించే ఈ చిత్రాన్ని RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అలాగే, ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ పని చేస్తున్నారు. ఎస్ థమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు.