Politics

బీఆర్ఎస్‌కు మహారాష్ట్ర పోలీసుల షాక్..ఆ సభకు నో పర్మిషన్!

బీఆర్ఎస్‌కు మహారాష్ట్ర పోలీసుల షాక్..ఆ సభకు నో పర్మిషన్!

ఈ నెల 24వ తేదీన మహారాష్ట్రలో జరగనున్న బీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు అక్కడి పోలీసులు అనుమతి నిరాకరించారు.

భద్రతా కారణాల దృష్ట్యా అంఖాస్‌ మైదానంలో సభకు అనుమతి ఇవ్వలేమని ఔరంగాబాద్‌ పోలీసులు స్పష్టం చేశారు.

ఈ సమావేశానికి మరో ప్రదేశాన్ని ఎంచుకోవాలని సూచించారు.

ఔరంగాబాద్ పోలీసులపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు అదే రోజున వేరే ప్రదేశంలో బహిరంగ సభను నిర్వహించడానికి గులాబీ దళం సిద్ధమైంది.