Politics

జెడి లక్ష్మీనారాయణ దారెటు? జేడీ బీజేపీలో చేరతారా…జేడి వైపు చూస్తున్న జాతీయ పార్టీలు

జెడి లక్ష్మీనారాయణ దారెటు? జేడీ బీజేపీలో చేరతారా…జేడి వైపు చూస్తున్న జాతీయ పార్టీలు

జనసేన పార్టీ కు దూరంగా ఉన్న సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణ రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ వైపుకు‌ మొగ్గు చూపుతారోనని తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా ఉంది.
లక్ష్మీనారాయణ రాజకీయం అయోమయంగా సాగుతోంది. ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని అని అంటారు.
తన విధానాలకి నచ్చిన పార్టీ దొరికితే పోటీ అని మరో సందర్భంలో చెబుతూ వచ్చారు. ఆయన ఈ మధ్యన బీఆర్ఎస్ కి అనుకూలంగా మాట్లాడడంతో ఆయన అందులో చేరుతారు అని అంతా అనుకున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో పోరాడుతామని బీఆర్ఎస్ చెప్పడంతో వెల్ కం అంటూ జేడీ రాజకీయ స్వాగతం పలికేశారు.

బిడ్ ని సైతం దాఖలు చేయకుండా బీఆర్ఎస్ సైలెంట్ అయిపోవడంతో జేడీ తానుగా బిడ్ ని దాఖలు చేశారు.
ఆయన ఇపుడు ఏ పార్టీ వైపు అన్నదాని మీద రకరకాలుగా వినిపిస్తోంది. విశాఖలో తాజాగా విడిది చేసిన మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు జేడీ ఇద్దరూ ఒక ఫైన్ మార్నింగ్ బీచ్ వద్ద వాకింగ్ చేస్తూ తారసపడి భేటీ అయ్యారు.

ఆ మీదట ఇద్దరూ కొంతసేపు ముచ్చటించుకున్నారని ప్రచారం సాగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సహా అనేక అంశాలు ఇద్దరి మధ్యన ప్రస్తావనకు వచ్చాయని చెబుతున్నారు. ఈ సందర్భంగా జేడీని బీజేపీలో చేరమని పెద్దాయన సలహా ఇచ్చారని ప్రచారం సాగుతోంది.

మీలాంటి మేధావులు ఎంతొ మంది బీజేపీలో చేరి కీలకమైన పదవులలో ఉన్నారని, ప్రజా సేవ చేస్తున్నారని, కేంద్రంలో నీతివంతమైన పాలన అందిస్తున్న బీజేపీలో మీరు చేరితే మీ భావాలకు మీ ప్రయత్నాలకు బాగుంటుంది అని ఆయన సూచించారని ప్రచారం అయితే సాగుతోంది.

జేడీ దీని మీద ఏం చెప్పారో కానీ ఇప్పటికే జేడీ రాజకీయంగా కొని తడబాట్లు పొరపాట్లూ చేశారని అంటున్నారు. ఆయన బీజేపీలో ఇపుడు చేరితే ఆయన గెలుపు కూడా సందేహంలో పడుతుందని అంటున్నారు. బీజేపీ ఆద్వర్యాన ఉన్న కేంద్రం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేస్తోంది. దాని మీద న్యాయపరంగా ఇతరత్రా జేడీ ఉద్యమిస్తున్నారు.

ఇపుడు బిడ్ ని కూడా ఆయన వేసి ప్లాంట్ విషయంలో తన వైఖరి స్పష్టం చేశారు. అలాంటిది రాజకీయాల కోసం తానే విమర్శించిన బీజేపీలో చేరితే మాత్రం జేడీకి అది ఇబ్బందిగా మారుతుంది అని అంటున్నారు. జేడీ జనసేన నుంచి రావడం కూడా తప్పే అన్న మాట ఆ పార్టీ వారిలో ఉంది.
ఇవన్నీ చూసుకుంటే ఎంతో చదివి ఉన్నత పదవులు అధిరోహించిన జేడీకి రాజకీయాలు అంత సులువు కాదు అని బోధపడుతోంది అంటున్నారు.