Movies

వరల్డ్ డ్యాన్స్ డే.. చెర్రీ ఫ్యాన్స్ సర్ ప్రైజ్ గిఫ్ట్..

వరల్డ్ డ్యాన్స్ డే.. చెర్రీ ఫ్యాన్స్ సర్ ప్రైజ్ గిఫ్ట్..

ఆర్ఆర్ఆర్ సినిమాలో చెర్రీ నటనకు భారతీయులే కాదు.. హాలీవుడ్ మేకర్స్ సైతం ఫిదా అయ్యారు. చిరుకు తగ్గ తనయుడు చరణ్ అంటూ ఇప్పటికే సినీ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో తాజాగా చెర్రీ ఫ్యాన్స్ ఓ స్పెషల్ వీడియోను క్రియేట్ చేశారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్యాన్స్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. అప్పటివరకు రోటిన్ స్టెప్పులతో సాగిపోతున్న చిత్రపరిశ్రమకు బ్రేక్ డ్యాన్స్ పరిచయం చేశారు. ఇక చిరు తర్వాత అనేక మంది స్టార్స్ డ్యాన్స్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో డ్యాన్స్ అంటే ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ పేర్లు ముందుంటాయి. అద్భుతమైన నటనతోపాటు.. డాన్సింగ్ లోనూ సత్తా చాటుతుంటారు ఈ హీరోస్. అటు నటనలోనూ.. ఇటు డాన్సింగ్ లోనూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ సినిమాలో చెర్రీ నటనకు భారతీయులే కాదు.. హాలీవుడ్ మేకర్స్ సైతం ఫిదా అయ్యారు. చిరుకు తగ్గ తనయుడు చరణ్ అంటూ ఇప్పటికే సినీ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో తాజాగా చెర్రీ ఫ్యాన్స్ ఓ స్పెషల్ వీడియోను క్రియేట్ చేశారు.

ఏప్రిల్ 29న వరల్డ్ డ్యాన్స్ డే సందర్భంగా… ఇప్పటివరకు చెర్రీ నటించిన సినిమాలన్నింటిని నుంచి ఆయన డాన్స్ వీడియోస్ అన్ని కలిపి ఓ స్పెషల్ వీడియో రెడీ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఈ వీడియోను నెట్టింట షేర్ చేస్తూ తమ వరల్డ్ డ్యాన్స్ డే ను జరుపుకోవడానికి వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ వీడియో చూస్తే రామ్ చరణ్ ప్రతిభకు.. సినిమా.. డాన్స్ పట్ల అతనికి ఉన్న అంకితభావానికి నిదర్శం అంటున్నారు నెటిజన్స్.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రామ్ చరణ్ పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి గేమ్ ఛేంజర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ, అంజలి కథానాయికలుగా నటిస్తుండగా.. ఈచిత్రంలో చెర్రీ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.