NRI-NRT

TANA. కాశీలో అన్నదానానికి మంచి స్పందన

TANA. కాశీలో అన్నదానానికి మంచి స్పందన

గంగా నది పుష్కరాల సందర్భంగా వారణాసిలో దాదాపు 100 ప్రదేశాల్లో వివిధ తెలుగు సంఘాలు ఆశ్రమాలు ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహిస్తున్నారు. శివాల ఘాట్లో “తానా” ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదానానికి మంచి స్పందన లభిస్తోంది. దాదాపు పది రకాలతో మంచి భోజనాన్ని అందిస్తూ ఉండటంతో రోజుకు 1000 మందికి పైగా యాత్రికులు “తానా” అన్నదానాన్ని స్వీకరిస్తున్నారు.


సోమవారం పదవరోజు నిర్వహించిన అన్నదానానికి భక్తులు విరివిగా తరలివచ్చారు. ప్రతిరోజు సాయంత్రం పూట అందజేస్తున్న అల్పాహారానికి యాత్రికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.