Business

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం రోజు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అయితే కొన్ని రూపాయి షేర్లు ఈ ఒడుదొడుకుల్లోనూ అప్పర్‌సర్క్యూట్ కొట్టాయి. ఒక స్టాక్ ఏకంగా 20 శాతం వరకు పెరిగింది. ఆ స్టాక్స్ లిస్ట్ చూద్దాం

క్రితం సెషన్‌లో అమెరికా స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు నెలకొన్నాయి. దీంతో ఆసియా మార్కెట్లలోనూ మిశ్రమ పవనాలు కనిపిస్తున్నాయి. ఇక ఐటీ, మెటల్ రంగం షేర్లు పడిపోయిన నేపథ్యంలో దేశీయ మార్కెట్ సూచీలు కూడా నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. BSE రియాల్టీ, BSE ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ సెక్టార్లలో కొనుగోళ్లు కనిపిస్తుండటంతో లాభాలు నమోదు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త రాసే సమయానికి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 200 పాయింట్లకుపైగా నష్టపోయి 61 వేల 140 మార్కు వద్ద కదలాడుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 70 పాయింట్లకుపైగా పడిపోయి 18 వేల 70 మార్కు వద్ద ట్రేడవుతోంది.

ఇవాళ సెషన్‌లో మొత్తంగా చూస్తే 2180 షేర్లు పుంజుకున్నాయి. మరో 1314 షేర్లు పడిపోయాయి. భన్సాలీ ఇంజినీరింగ్ పాలిమర్స్ లిమిటెడ్ BSE స్మాల్ క్యాప్ గెయినర్‌గా నిలిచింది. 13 శాతానికిపైగా పెరిగింది. గ్రావిటా ఇండియా లిమిటెడ్, సెంటమ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ షేర్లపైనా ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక నిఫ్టీలో ఏషియన్ పెయింట్స్, హెచ్‌యూఎల్, సిప్లా, కోల్ ఇండియా, ఐటీసీ లాభాల్లో ఉండగా.. లార్సెన్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, యాక్సిస్ ్యాంక్, ఓఎన్‌జీసీ పడిపోయాయి.

మార్కెట్లు నష్టపోతున్నప్పటికీ కొన్ని పెన్నీ స్టాక్స్ అదరగొడుతున్నాయి. చాలా వరకు అప్పర్‌సర్క్యూట్ కొట్టగా.. ఒక స్టాక్ మాత్రం 20 శాతం పెరగడం గమనార్హం. వీటిని వాచ్‌లిస్ట్‌లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.