Politics

సాల్ట్ ప్రాజెక్టు అంతిమ లబ్ధిదారులు ఎవరు?

సాల్ట్ ప్రాజెక్టు  అంతిమ లబ్ధిదారులు ఎవరు?

బైజూస్ కంపెనీతో ఎవరెవరికి టై అప్ ఉంది??

ఆ కంపెనీకి ఎంత అమౌంట్ ఇచ్చారనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి

తనని లాకప్ లో హింసించినంతగా ఉగ్రవాది కసబ్ ను కూడా హింసించి ఉండరు

లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ ఉన్నది ఎందుకు?

రైతులను ఉసిగొలిపి కేసులు వేయించిందే తమ పార్టీ వారు

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

సపోర్టింగ్ ఆంధ్ర లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ( సాల్ట్) ప్రాజెక్టులో అంతిమంగా లబ్ధిదారులు ఎవరు?, బైజూస్ కంపెనీతో ఎవరెవరికి టై అప్ ఉంది. ట్యాబ్ ల తో పాటు ఇతర యంత్ర పరికరాలను సరఫరా చేసేది ఎవరు?, 50 లక్షల మంది సభ్యులకు సర్వం తానేనని బైజూస్ కంపెనీ చెబుతోంది. బైజూస్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మొత్తం ఎంత? అనే విషయాలపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. బైజూస్ కంపెనీకి తాము ఆమడ దూరంలో ఉన్నాం . ఎంపీ రఘురామ కృష్ణంరాజు చేస్తున్న ఆరోపణలన్నీ ఉత్తి, ఉత్తవేనని అంటారా?, బైజూస్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ఒక పెద్ద కుంభకోణం కాదా?. మూడేళ్లపాటు ఈ పథకం అమలులో ఉంటుందని చెప్పారు. 9 నెలలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మారుతుంది. అటువంటప్పుడు, బైజూస్ సంస్థ తో ఒప్పందాన్ని ఎలా కుదుర్చుకున్నారు. సాల్ట్ పథకం పూర్తి వివరాలను వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు . బుధవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… సభ్యుల కోసం ఆకలితో ఉన్న బైజూస్, డబ్బుల కోసం ఆకలితో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కలిసి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దేశంలోని 29 రాష్ట్రాలలో, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా బైజూస్ తో ఒప్పందాన్ని కుదుర్చుకోలేదు. ఎంతో చదువుకున్న ముఖ్యమంత్రి ఉండగా, ఏమి చదువుకున్నారో కూడా సర్టిఫికెట్ చూపించని ముఖ్యమంత్రికి ఇంత ఇంట్రెస్టా ఏమిటి? అంటూ అపహాస్యం చేశారు. వరల్డ్ బ్యాంకు ప్రాజెక్టును బైజూస్ కు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. బైజూస్ కు కోటి మంది సభ్యులు కావలసి ఉండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే 50 లక్షల మంది సభ్యులను ఇచ్చింది. దీనితో ఆ కంపెనీ వ్యాల్యుయేషన్ పెరిగిందన్నారు. బైజూస్ లో జ్యూస్ ను జగన్మోహన్ రెడ్డి లాగేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాల్ట్ పథకం ప్రారంభించి, ఉప్పును బాగానే తినేసింది. విద్యా వ్యవస్థ మోడ్రన్ టెక్నాలజీ వైపు పరుగులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు వద్ద రెండువేల కోట్ల రూపాయల అప్పులను లాగేసింది. ఆ డబ్బుతో, రకరకాల టెండర్లను పిలిచి, 20 20-21 నుంచి ఇప్పటివరకు ఆడిట్ కాని కంపెనీ కి, రేపు మాపో మూతపడే కంపెనీకి టెండర్లను కట్టబెట్టారు. బైజూస్ పేరంటల్ కంపెనీ అయినా థింక్ అండ్ లెర్న్ కంపెనీకి వక్రమార్గాల ద్వారా, వివిధ మార్గాలలో టెండర్లను కట్టబెట్టారు. బైజూస్ కంపెనీకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య సునీత్ సర్కార్ అనే ఒక ఆంగ్ల ఛానల్ రిపోర్టర్ అయిన వ్యక్తి లైజానర్ గా నియమితులయ్యారు. ఈ ప్రాజెక్టులో బైజూస్ కంపెనీనే అంతిమ లబ్ధిదారుడు. బైజూస్ కంపెనీ గైడు లను డిజిటలైజ్ చేసి ట్యాబ్ లో అప్ లోడు చేసి, మాస్టర్ల చేత చెప్పిస్తుంది. బైజూస్ కంపెనీ గైడ్లను ట్యాబ్ లో అప్లోడ్ చేస్తే విద్యార్థులకు అర్థమయ్యే దాని కంటే, టీచర్లు చెబితేనే ఎక్కువగా అర్థం అవుతుందన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. వరల్డ్ బ్యాంకు ఇస్తున్న అప్పును కొట్టివేయడానికి, బైజూస్ సంస్థను తెరపైకి తీసుకువచ్చారన్నారు. పేరెంట్ టీచర్ గ్రూప్ కమ్యూనికేషన్ అండ్ కోఆర్డినేషన్ అనే వ్యవస్థను తీసుకువచ్చారు. దానికి కూడా బైజూస్ సంస్థనే ఇన్ఫాస్ట్రక్చర్ రూపొందిస్తుందట. విద్యార్థి ఎలా చదువుతున్నారో తల్లిదండ్రులకు తెలియజేయడానికి కూడా ఇన్ఫాస్ట్రక్చర్ అవసరం ఏమిటి?. రేపో మాపో దివాలా తీసే బైజూస్ కంపెనీ మాస్టర్లకు కూడా పాఠాలు చెబుతుందట. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిబిఎస్ఈ సిలబస్ కు వెళ్తానని చెబుతారు. సీబీఎస్ఈ , బైజూస్ సంస్థను దగ్గరకు రానిస్తారా?, సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెడితే వేలకోట్ల రూపాయలు వెచ్చించి ఇచ్చిన ట్యాబులు, ఇతర సామాగ్రి వృధా అవుతాయి. విదేశీ విద్య కోసం కోటి 12 లక్షలు ఇస్తున్నాన చెబుతున్న జగన్మోహన్ రెడ్డి, వారికి కూడా బై జూస్ ద్వారానే పాఠాలను చెప్పిస్తారా ? అంటూ ప్రశ్నించారు. పరీక్ష నిర్వహణ కోసం కూడా ప్రత్యేక సాఫ్ట్వేర్ తయారు చేస్తానని పేర్కొనడం హాస్యాస్పదం. థింక్ అండ్ లెర్న్ సంస్థ తో పాటు, ఇతర సంస్థల పేరిట బైజూస్ కు
ఎన్నో కాంట్రాక్టులను ఇచ్చారు. బైజుస్ సంస్థ మాత్రం తాము ఉచితంగానే సేవలు అందిస్తున్నామని చెబుతుందని రఘురామ కృష్ణంరాజు తెలియజేశారు. ఇప్పుడు బై జూస్ సంస్థ తనకు 50 లక్షల మంది క్లైంట్లు ఉన్నారని చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు ఖర్చయ్యాయి. ఈ స్కీం పర్యవేక్షణ బాధ్యతలను 2014 బ్యాచ్ కు చెందిన వెట్రి సెల్వి అనే జూనియర్ అధికారికి అప్పగించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలకమైన బాధ్యతలన్నీ 2014 బ్యాచ్ కు చెందిన జూనియర్ అధికారుల కే అప్పగిస్తున్నారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు గత నాలుగేళ్లలో లక్ష కోట్లకు పై చిలుకు నగదు లావాదేవీలు జరిగాయి. మద్యం కార్పొరేషన్ బాధ్యతలను వాసుదేవ రెడ్డి అనే జూనియర్ అధికారికి అప్పగించారు. ఇతరులతో ఏ ఫిర్యాదులేని మార్గదర్శి సంస్థ బ్యాలెన్స్ షీట్ కావాలని అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం, గత మూడేళ్లుగా ఆడిట్ జరుగని బైజూస్ సంస్థతో మాత్రం ఒప్పందాన్ని కుదుర్చుకోవడం విడ్డూరంగా ఉంది. బైజూస్ సంస్థ పై ఈడీ దాడులు జరిగాయి. ఆ సంస్థ కు ఇప్పటికే వేల కోట్ల రూపాయల ఆర్డర్లు రాష్ట్ర ప్రభుత్వం
ఇచ్చింది. ఈ లావాదేవీల వెనుక ఏదైనా మతలబు ఉన్నదా? అనే అంశంపై తాను కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాను. ఫిబ్రవరి 23వ తేదీ వెల్లడించిన వివరాల ప్రకారం కొన్ని
ఎడ్యుటెక్ కంపెనీలలో భారతి రెడ్డి డైరెక్టర్ గా ఉన్నట్టు తెల్సింది. బైజూస్ కంపెనీ బాగోతాలు విద్యాశాఖామాత్రికి తెలిసి ఉండకపోవచ్చునని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

ఈ రెండు రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి ప్లాట్ల పంపకాలు చేపడతారేమో?

అమరావతిలో రానున్న రెండు రోజుల వ్యవధిలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేదలకు ప్లాట్ల పంపకాలను చేపడతారేమోనని రఘురామకృష్ణం రాజు అనుమానం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతంలో పేదలకు ప్లాట్లను పంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ, అమరావతి రైతులు వేసిన పిటీషన్ పై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును శుక్రవారం నాటికి వాయిదా వేసింది. అమరావతి రైతులు కోరినట్లుగా మధ్యంతర స్టే ఇవ్వకుండానే, తీర్పును మరోసారి రిజర్వు చేసింది. తీర్పును వాయిదా వేసేటట్టయితే మధ్యంతర స్టే ఇవ్వాలని అమరావతి రైతులు కోరారు. తీర్పును రిజర్వు చేయకుండా ఏదో ఒక ఆర్డర్ ఇవ్వాలని వారు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారని రఘురామ కృష్ణంరాజు తెలియజేశారు. ప్రతిపక్ష నేత హోదాలో భోగాపురం విమానాశ్రయం గురించి గతంలో జగన్మోహన్ రెడ్డి ఏమి మాట్లాడారో ఈ సందర్భంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులకు వీడియోను ప్రదర్శించారు. ఇప్పుడు అదే విమానాశ్రయానికి శంకుస్థాపన చేయడం విస్మయాన్ని కలిగిస్తోంది. గతంలో ఈ విమానాశ్రయానికి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఒకవైపు విశ్వసనీయత అంటూనే తాను మాట్లాడిన మాటలకు జగన్మోహన్ రెడ్డి కట్టుబడి లేరంటూ అపహాస్యం చేశారు. అలాగే గతంలో ఆదాని, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురించి చిలువలు వలవలుగా సాక్షి దినపత్రికలో రాసి, ఇప్పుడు అదే ఆదానిని హైదరాబాదుకు వెళ్లి స్వాగతం పలికి ఆయన్ని విశాఖపట్నం తీసుకు వెళ్లడం విడ్డూరంగా ఉంది. విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ కు శంకుస్థాపన చేస్తారట. అదానికి రెండు పోర్టులను, ఒక కొండను వ్రాసి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి, రాత్రికి రాత్రి ప్రత్యేక జీవోను విడుదల చేసి 10 కోట్ల విలువైన స్థలాన్ని కోటి రూపాయలకే కట్టబెట్టారు. ఐలా నిబంధనల ప్రకారం ఆ స్థలాన్ని ఆదాని సంస్థ అభివృద్ధి చేసి, తామే టాక్స్లను వసూలు చేసుకుంటుందట అని ఎద్దేవా చేశారు.

ప్రివిలేజ్ కమిటీ ఉన్నది ఎందుకు?

లోక్ సభ లో ప్రీ విలేజ్ కమిటీ ఉన్నది ఎందుకు?, తనని సిఐడి పోలీసులు లాకప్ లో చిత్రహింసలకు గురిచేశారని ఫిర్యాదు చేసినప్పటికీ, ఒక్కసారి కూడా సునీల్ కుమార్ అండ్ బ్యాచ్ ను ప్రివిలేజ్ కమిటీ సభ్యులు పిలిచి విచారించలేదు. తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై దాడి జరిగిందంటే మాత్రం వెంటనే పిలిచి విచారించారు. ప్రివిలేజ్ కమిటీ ఉన్నది ఒక్క బండి సంజయ్ కోసమేనా?, తాను ఎంపీ ని కాదా??, తనపై దాడి చేశారంటే ఎందుకు స్పందించలేదని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో సుదీర్ఘ సమయం తీసుకున్న తర్వాత, తాను దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టును ఆశ్రయించాలని సూచించారు. హైకోర్టులోను మూడు, నాలుగు వాయిదాల అనంతరం విచారణకు వచ్చి కొంతమేరకు వాదనలు జరిగిన తర్వాత కేసు వాయిదా పడింది. హైకోర్టు సిబిఐ, ఎన్ఐఏకు ఈ కేసును అప్పగిస్తే తాను ఆధారాలతో సహా తనపై జరిగిన దాడిని నిరూపిస్తాను. భారత స్వాతంత్ర చరిత్రలో ఒక ఎంపీపై ఇంత దారుణంగా దాడి చేసి ఉండరు. తాజ్ హోటల్ పై దాడి చేసి, అమాయకుల ప్రాణాలను బలిగొన్న కసబ్ కంటే తనని ఎక్కువ చిత్రహింసలకు గురి చేశారు. సునీల్ కుమార్ వీడియో చిత్రీకరిస్తుండగా కొంతమంది అధికారులు తనపై దాడి చేశారు. ఆ వీడియోను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిలకించారు. ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డికి మానవత్వం అన్నది లేదు. తనపై లాకప్ లో దాడి జరిగిందని ఫిర్యాదు చేసి మే 14 వ తేదీ నాటికి రెండేళ్లు పూర్తి అవుతుంది. రెండేళ్ల తర్వాత టెలికం వ్యవస్థలో చాలా ఇన్ఫర్మేషన్ ఉండదట. అయినా న్యాయస్థానంలో మా ఆవేదన వినిపిస్తాం . జగన్మోహన్ రెడ్డి తన రోదనలను వినిపిస్తారేమో. న్యాయస్థానాలపై తనకు పూర్తి విశ్వాసం ఉంది. విచారణ అంటూ జరిగి తనని హింసించిన క్రూరులు నికృష్టులు , వీడియో చిత్రీకరించిన అధికారులను సస్పెండ్ చేస్తే, భవిష్యత్తులో ఇటువంటి దాడులు చేయడానికి పోలీసు అధికారులు వెనకంజ వేస్తారు. ఇప్పుడు కాకపోయినా, మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదిలి పెట్టేది లేదు. విచారణకు సునీల్ కుమార్ సిద్ధంగా ఉండాలి అంటూ రఘురామకృష్ణం రాజు సవాల్ చేశారు.