NRI-NRT

మంగళవారం నాడు గుర్‌గావ్‌లో St.Martinus స్నాతకోత్సవం

మంగళవారం నాడు గుర్‌గావ్‌లో St.Martinus స్నాతకోత్సవం

St.Martinus (SMU) విశ్వవిద్యాలయ స్నాతకోత్సవాన్ని మంగళవారం నాడు గుర్‌గావ్‌లోని హోటల్ 91లో నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ కులపతి డా.మురళీ గింజుపల్లి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. హర్యాన ప్రభుత్వ ఆరోగ్య శాఖ డైరక్టర్ జనరల్ డా.సోనియ త్రిఖ ఖల్లూర్, కూరాశవు పార్లమెంట్ మాజీ సభ్యులు డా.ఐవ్స్ షూప్, మరెంగో ఆసుపత్రి ట్రామా విభాగాధిపతి డా. హెమంత్ శర్మ, SMU CEO సజ్జా శ్రీనివాస్‌లు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. సాయంత్రం 5గంటల నుండి ప్రారంభమయ్యే ఈ స్నాతకోత్సవంలో పట్టాలను ప్రదానం చేస్తారు. పూర్తి కార్యక్రమ వివరాలు దిగువ పరిశీలించవచ్చు.