Kids

రాబోయే మెగా వారసుడు ఆరోగ్యం కోసం ఉపాసన సంచలన నిర్ణయం….

రాబోయే మెగా వారసుడు ఆరోగ్యం కోసం ఉపాసన సంచలన నిర్ణయం….

మనిషి జీవనం అత్యంత ఆధునికం అవుతుంది. అన్ని రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం ఎల్లలు దాటిపోతుంది. హెల్త్ సైన్సెస్ ఇప్పటికే అనేక అద్భుత శిఖరాలకు చేరాయి. అయినా మానవులను పలు కొత్త రోగాలు వేధిస్తున్నాయి. భవిష్యత్తులో వచ్చే అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు తొలగించేందుకు కొన్ని కొత్త మార్గాలు అన్వేషించారు. వాటిలో స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ ఒకటి. హ్యూమన్ బాడీ నుండి సెల్స్ తీసి వాటిని భద్రపరచి అత్యవసర పరిస్థితులలో చికిత్సగా వాడుకోవడం ఒక పద్దతి. మరొక ఆధునిక విధానం కూడా అందుబాటులోకి వచ్చింది.

బిడ్డ పుట్టినప్పుడు మాయ, బొడ్డులో మిగిలి ఉన్న రక్తాన్ని సేకరించి భద్రపరుస్తారు. దీన్ని కార్డు బ్లడ్ ప్రిజర్వేషన్ అంటారు. ఈ పద్దతిని తన బిడ్డ కోసం ఉపాసన అనుసరించనున్నారట. స్టెమ్ సైట్ ఇండియా అనే సంస్థ ఈ సర్వీస్ అందిస్తుంది. తన బిడ్డ కార్డు బ్లడ్ ని ప్రిజర్వ్ చేయనున్నట్లు ఉపాసన చెప్పుకొచ్చారు. అంటే భవిష్యత్తులో మెగా వారసుడికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తెలెత్తినా, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఉపాసన ఈ పనికి పూనుకున్నారు.