WorldWonders

138 విడాకుల న్యాయవాదికి వింత పరిస్థితి…..

138 విడాకుల న్యాయవాదికి వింత పరిస్థితి…..

ఆయన ఓ సీనియర్‌ న్యాయవాది. తన 16 సంవత్సరాల వృత్తిలో విడాకుల కోసం వచ్చిన జంటలకు నచ్చజెప్పి కలిసిజీవించేలా చూశారు. కానీ, విచిత్రంగా ఆయన విడాకులు భార్య నుంచి విడాకులు తీసుకోవాల్సిన దుస్థితి ఎదురైంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా కుటుంబం చిన్నాభిన్నమైంది. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్‌ హైకోర్టులో ఓ వ్యక్తి 16 సంవత్సరాలుగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. తన వృత్తిలో 138 జంటలు విడాకులు తీసుకోకుండా అడ్డుకున్నారు.

సదరు న్యాయవాది భార్య విడాకుల కోసం కేసు ఫైల్‌ చేసింది. అయితే, భర్త నుంచి విడాకులు తీసుకునేందుకు కారణాలు చెప్పింది. విడాకుల కోసం వచ్చే జంటలను విడిపోకుండా ఆపడమేకాకుండా ఎలాంటి ఫీజులు తీసుకోవడం లేదని తెలిపింది. ఎలాంటి ఫీజులు తీసుకోకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా న్యాయవాది దంపతులిద్దరికీ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు విడిగా ఉంటుండగా.. కోర్టులో కేసు పెట్టింది. వీరిద్దరికి ఓ కూతురు ఉన్నది. తల్లిదండ్రుల గొడవలో ‘లా’ చదవుతున్న సైతం ఇబ్బందులకు గురైంది. విడాకులు ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఆమె తన తల్లితో నివసించింది. విడాకులు మంజూరైన తర్వాత కూతురు మాత్రం తనకు తన తండ్రే రోల్‌ మోడల్‌ అనీ, ఆయనతోనే కలిసి ఉంటానని చెప్పింది. కోర్టు సైతం ఆమె నిర్ణయాన్ని అంగీకరించి.. తండ్రితో ఉండేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, న్యాయవాది నుంచి ఆమె ఎలాంటి భరణం తీసుకోలేదని తెలుస్తుంది.

తనను ఆశ్రయించిన జంటల నుంచి ఎందుకు ఫీజు తీసుకోలేదని ప్రశ్నించగా విచిత్రమైన కారణం తెలిపారు. వాస్తవానికి న్యాయవాది కజిన్‌ విడాకులు తీసుకున్నాడని తెలిపాడు. అప్పటి నుంచి ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో ఏ జంట విడాకుల కోసం వచ్చినా అందుకు అనుమతించకూడదని నిర్ణయించుకున్నానని, అప్పటి నుంచి విడాకులకు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టారు. దాదాపు 138 జంటలను ఒప్పించి విడాకులు తీసుకోకుండా అడ్డుకోగలిగానని.. తానే భార్యను మాత్రం ఒప్పించలేకపోయానని ఆ న్యాయవాది తెలిపారు. విడాకులు తీసుకోకుండా చూసేవాడని, వారి నుంచి ఫీజులు కూడా తీసుకోకపోయేవాడనని, దాంతో ఆదాయం బాగా తగ్గిపోయిందని పేర్కొన్నారు. తన భార్య ఇతర న్యాయవాదులను చూసి తనను పేదవాడినని అనుకునేదని, ఈ క్రమంలో గొడవలు మొదలయ్యాయని వివరించారు.