Business

రామోజీరావు, శైలజా కిరణ్‌లకు సీఐడీ నోటీసులు

రామోజీరావు, శైలజా కిరణ్‌లకు సీఐడీ నోటీసులు

మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రామోజీరావు, శైలజా కిరణ్‌లకు సీఐడీ నోటీసులిచ్చింది. ఈ కేసు విషయంలో గత కొన్ని రోజులుగా సీఐడీ దర్యాప్తు చేస్తోన్న సంగతి తెలిసిందే. మార్గదర్శి చిట్ ఫండ్స్‌లో భారీగా అవకతవకలు జరిగినట్లు సీఐడీ గుర్తించి ఆ దిశగా దర్యాప్తు చేస్తోంది.తాజాగా ఈ కేసు లో 41ఏ కింద రామోజీరావుకు నోటీసులు ఇచ్చింది. జులై 5వ తేదిన గుంటూరులోని సీఐడీ రిజనల్ కార్యాలయంలో రామోజీరావు, శైలజా కిరణ్‌లు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో ప్రధానంగా ఏ1(A1) నిందితుడిగా రామోజీరావును, ఏ2(A2)గా శైలజా కిరణ్ ల పేర్లు సీఐడీ(CID) నమోదు చేసింది. ఈ కేసు విషయంలో ఇప్పటికే ఈనెల మొదటి వారంలోనే ఏ2గా శైలజా కిరణ్‌ను ఆమె నివాసంలోనే సీఐడీ విచారించింది