Agriculture

రైతులకు శుభవార్త….పది లక్షల టన్నుల ఎరువులు సిద్ధం

రైతులకు శుభవార్త….పది లక్షల టన్నుల ఎరువులు సిద్ధం

రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజనుకు అవసర మైన ఎరువులు పుష్కలంగా ఉన్నాయని వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్. హరికిరణ్ చెప్పారు. ఈ సీజన్లో పంటలకు 15 లక్షల టన్నుల ఎరువులు అవసరమ వుతాయని అంచనా వేశామని, ఇప్పటికే 10 లక్షల టన్ను లను రైతుభరోసా కేంద్రాల్లో (ఆర్బీకేల్లో) అందుబాటులో ఉంచామని తెలిపారు. వచ్చే ఏడాది రబీ సీజన్ పంటలకు కనీస మద్దతు ధరలు నిర్ణ యించేందుకు జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం విశాఖ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఖరీఫ్ సీజన్ కోసం ఐదులక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా, ప్రస్తుతానికి నాలుగు లక్షల క్వింటా ళ్లను సిద్ధం చేశామని చెప్పారు.

వీటిలో కోస్తాంధ్రకు వరి, రాయలసీమకు వేరుశనగ విత్తనాలు ఎక్కువగా అవసరమవుతాయని తెలిపారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఉండే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో అందుకు తగిన చర్యలు ఇప్పటినుంచే తీసుకుంటున్నామని తెలిపారు. ఎల్నినో ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై అంతగా ఉండకపోవచ్చని వాతావరణశాఖ అంచనా వేసిందని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా ఆగస్టు 15 వరకు రాష్ట్రంలో వర్షాలు కురవకపోతే ప్రత్యామ్నాయ పంటలపై అన్ని జిల్లాల నుంచి సమాచారాన్ని రప్పించి సమగ్ర కంటింజెన్సీ ప్రణాళికను రూపొందించినట్టు చెప్పారు.