Fashion

ఐఏఎస్, ఐపీఎస్‌లు ప్రైవేటు అవార్డులను స్వీకరించొద్దు

ఐఏఎస్, ఐపీఎస్‌లు ప్రైవేటు అవార్డులను  స్వీకరించొద్దు

దేశంలో అత్యున్నత స్తాయిగా భావించే సివిల్ సర్వీసు అధికారులకు పలు సూచనలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు ప్రైవేట్ అవార్డులను స్వీకరించే అంశంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గ దర్శకాలను జారీ చేసింది. ప్రైవేటు సంస్థలు ఇచ్చే ఏదైనా అవార్డులను IAS, IPS, IFS అధికారులు స్వీకరించొద్దని కేంద్రం స్పష్టం చేసింది. అసాధారణ పరిస్థితుల్లో పురస్కారాలను తీసుకునేందుకు సంబంధిత శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని తెలిపింది.అవార్డులో నగదు ఉండరాదనే షరతు విధించింది. అవార్డులు ఇచ్చే సంస్థకు క్లీన్‌చిట్ ఉండాలని పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.