Business

19 రాష్ట్రాలకు విపత్తు సహాయ నిధి విడుదలకు ఆమోదం

19 రాష్ట్రాలకు విపత్తు సహాయ నిధి విడుదలకు ఆమోదం

రాష్ట్ర విపత్తు స్పందన నిధి (స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స ఫండ్‌-ఎ్‌సడీఆర్‌ఎఫ్‌) కింద 19 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం రూ.6,194.40 కోట్లు విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత షా సంతకం చేశారు. ఇందులో రూ.1,209.60 కోట్లను 2022-23 సంవత్సరపు కేంద్రం వాటా కింద నాలుగు రాష్ట్రాలు… తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్‌, మేఘాలయ, ఉత్తర ప్రదేశలకు మంజూరు చేసింది. మిగిలిన 4,984.80 కోట్లను 2023-24 నిధుల కింద 15 రాష్ట్రాలకు ఇచ్చింది. ఇందులో ఏపీ పేరు ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం నిధుల కింద ఇప్పటికే 9 రాష్ట్రాలకు రూ.3,649.40 కోట్లను అందజేసింది.