Business

ఏపీలో మరో వందే భారత్ రైలు….జులై 7న ప్రారంభం

ఏపీలో మరో వందే భారత్ రైలు….జులై 7న ప్రారంభం

ఏపీ వాసులకు శుభవార్త అందించింది కేంద్ర సర్కార్‌. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. విజయవాడ-చెన్నై మధ్య నడవనున్న ఈ రైలు రాకపోకలు ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా 5 వందే భారత్ రైళ్లను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. అందులో విజయవాడ-చెన్నై రైలు కూడా ఒకటి. ఈ రైలు విజయవాడ నుంచి గూడూరు, రేణిగుంట, కాట్సాడి మీదగా చెన్నై వెళ్లి…అదే మార్గంలో తిరిగి రానున్నట్లు సమాచారం.ఇది ఇలా ఉండగా, రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోవడం బాధాకరమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. అమరావతి రైతులకు మద్దతు తెలిపేందుకు త్వరలోనే ప్రియాంక గాంధీ అక్కడ పర్యటిస్తారని వెల్లడించారు. ఖమ్మం పర్యటన ముగించుకొని నిన్న రాత్రి ఢిల్లీ వెళుతూ గన్నవరం ఎయిర్ పోర్టు ఏపీ నేతలతో మాట్లాడిన రాహుల్ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు.