Fashion

వ‌ర‌ద నీటిలో కొట్టుకుపోయిన గ్యాస్‌ సిలిండ‌ర్లు

వ‌ర‌ద నీటిలో కొట్టుకుపోయిన గ్యాస్‌ సిలిండ‌ర్లు

గుజరాత్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వానకు చాలా ప్రాంతాలు నీట మునిగాయి.  రోడ్లన్నీ జలమయం అయ్యాయి.  వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే వందలాది వాహనాలు వరదల్లో కొట్టుకపోయాగా లేటెస్ట్ గా   నవ్‌సారిలో భారీ వరదలకు ఓ గ్యాస్ ఏజెన్సీకి చెందిన  100కి పైగా సిలిండర్లు కొట్టుకుపోయాయి. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇప్పటికే వరదలతో అల్లాడుతున్న గుజరాత్‌లో రానున్న 24 గంటల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం వెల్లడించింది. దక్షిణ గుజరాత్‌లోని అనేక ఇతర జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో వరదల కారణంగా కొట్టుకుపోయిన ,దెబ్బతిన్న వాహనాలను తొలగించేందుకు అధికారులు క్రేన్ లను ఉపయోగిస్తున్నారు. నివాస ప్రాంతాల్లో పేరుకుపోయిన నీటిని తొలగించేందుకు అధికారులు డీవాటరింగ్ పంపులను కూడా వాడుతున్నారు.