Fashion

శృంగారంలో “అతి” పనికిరాదు

శృంగారంలో “అతి” పనికిరాదు

ఏ విషయంలోనైనా దంపతులిద్దరూ బ్యాలన్స్‌డ్‌గా ఉంటేనే అనుబంధం దృఢంగా ముందుకు సాగుతుంది. అదే ఒక విషయంలో ఒకరు అతిగా ప్రవర్తించినా, మరొకరికి ఆసక్తి తగ్గినా భేదాభిప్రాయాలు వస్తుంటాయి. లైంగికాసక్తి విషయంలోనూ ఇది వర్తిస్తుందంటున్నారు నిపుణులు. దంపతుల్లో శృంగారం పరంగా ఒకరు విపరీతమైన ఆసక్తి చూపడం, అది భాగస్వామికి నచ్చక పోవడం వల్ల పొరపచ్ఛాలు దొర్లే అవకాశాలు ఎక్కువ! నిజానికి ఇలా విపరీతమైన లైంగికాసక్తి కలిగి ఉండడం వల్ల దీని ప్రభావం అటు ఆరోగ్యం, ఇటు కెరీర్‌, అనుబంధాలతో పాటు జీవితంలో ఇతర అంశాల పైనా పడుతుందట! అందుకే ఇలాంటి సమస్య ఉన్న వాళ్లు వైద్యుల సలహా తీసుకోవడంతో పాటు భాగస్వామి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా మెలగడం మంచిదంటున్నారు నిపుణులు.

శృంగార జీవితం పైన ఎన్నో అంశాల ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఇందుకు శారీరకంగా, మానసికంగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. అయితే వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగా ఎదురయ్యే సమస్యలు ఒత్తిడి, ఆందోళనలు, నిద్రలేమి.. వంటి వాటికి దారి తీస్తాయి. ఫలితంగా శృంగార జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ క్రమంలో భాగస్వామి ఆసక్తిని కూడా పరిగణనలోకి తీసుకొని అందుకనుగుణంగా ముందుకెళ్తే అనుబంధం దృఢమవుతుంది. లేదంటే ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఎక్కువంటున్నారు నిపుణులు. ఫలితంగా దాంపత్య బంధంలో అన్యోన్యత క్రమంగా లోపించే ప్రమాదం ఉందంటున్నారు.