ScienceAndTech

ఏడు చదివాడు. గుండ్రటి ఈ-బైక్ రూపొందించాడు.

ఏడు చదివాడు. గుండ్రటి ఈ-బైక్ రూపొందించాడు.

ఏడో తరగతి వరకు చదివిన నాథూభాయ్‌ పటేల్‌ (64)కు ద్విచక్ర వాహనాల మెకానిక్‌గా 40 ఏళ్ల అనుభవం ఉంది. గుజరాత్‌లోని సూరత్‌ జిల్లా అథవాకు చెందిన ఈయనకు మొదటినుంచీ ఏదో ఒకటి కొత్తగా చేయాలనే ఆసక్తి ఎక్కువ. ఈ తపనతోనే నాలుగు నెలలు కష్టపడి గుండ్రటి ఆకారంలో ఈ-బైక్‌ రూపొందించాడు. దీని తయారీకి మొత్తం రూ.85 వేలు ఖర్చయింది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 30 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చని నాథూభాయ్‌ తెలిపాడు. కొన్నేళ్ల క్రితం ఓ ఇంగ్లిష్‌ సినిమాలో ఇలాంటి బైక్‌ చూశానని.. ఆ స్పూర్తితోనే ఈ రింగ్‌ బైక్‌ను రూపొందించినట్లు వెల్లడించాడు. ఈ బైకుపై ఆయన తిరుగుతుంటే.. ‘నాథూ కాకా! ఒక్క సెల్ఫీ’ అంటూ స్థానికులు ఫొటోలు దిగుతున్నారు. ఈ విషయం తెలిసి చాలా కంపెనీలు రింగ్‌ బైక్‌ల తయారీకి ఆఫర్‌ ఇస్తున్నాయని, 64 ఏళ్ల వయసులో మళ్లీ అంత సమయం కేటాయించలేనని ఆయన చెబుతున్నాడు.