Movies

హిమాలయాలకు పయనమైన రజనీ కాంత్

హిమాలయాలకు పయనమైన రజనీ కాంత్

తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ లేటెస్ట్ మూవీ జైలర్. నిన్నటి దాకా ఈ సినిమా ప్రమోషన్స్​లో బిజీగా ఉన్న రజనీకాంత్ .. తాజాగా హిమాలయాలకు పయనమయ్యారు. జైలర్ రిలీజ్ కంటే ముందే రజనీ హిమాలయాలకు వెళ్లడంతో ప్రేక్షకులు కాస్త డిసప్పాయింట్ అయ్యారు. ఎంత సంపాదించినా… మనశ్శాంతి ఉండడం ముఖ్యం అని నమ్మే రజనీకాంత్.. తనకు సమయం కుదిరినప్పుడల్లా హిమాలయాలకు వెళ్లడం, అక్కడ ధ్యానం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు.ముఖ్యంగా ఏదైనా సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఎక్కువశాతం ఈ హడావుడికి దూరంగా అక్కడికి వెళ్లి ఉండాలనుకుంటారు. ఎలాంటి పరిస్థితిలోనూ ప్రతీ ఏడాది హిమాలయాలకు వెళ్లే రజినీకాంత్.. కొవిడ్ మహమ్మారి వల్ల గత నాలుగేళ్ల నుంచి వెళ్లడం లేదు. అందుకే జైలర్ రిలీజ్ ఉన్నా సరే నాలుగేళ్ల తర్వాత తలైవా హిమాలయాలకు వెళ్లిపోయారు. ఇక డైరెక్టర్​ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన జైలర్.. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 10న చాలా స్క్రీన్స్‌లో విడుదల కానుంది.