Business

ఇంటర్నెట్ లేకుండా కూడా UPI చెల్లింపులు!

ఇంటర్నెట్ లేకుండా కూడా UPI చెల్లింపులు!

ఇప్పుడు కరెన్సీ నోట్లను వాడే వారు చాలా తక్కువ అయిపోయారు. ఎక్కడ చూసిన ప్రతి ఒక్కరూ ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం అంటూ యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. దీంతో డిజిటల్ పేమెంట్స్ వినియోగం భారీగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా డిజిటల్ ఇండియాలో భాగంగా యూపీఐ పేమెంట్స్ ను ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా భీమ్ యాప్ ను కూడా తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇక కరోనా తరువాత ఈ డిజిటల్ పేమెంట్స్ మరింత పెరిగాయి. చిన్న చిన్న షాపుల నుంచి బడా షాపుల వరకు ఎక్కడ చూసిన పేమెంట్స్ కోసం యూపీఐ క్యూఆర్ కోడ్స్ ను అందుబాటులో ఉంచుతున్నారు. చిన్న ఛాయ్ తాగినా కూడా ప్రతి ఒక్కరు ఫోన్ పేనో, గూగుల్ పేనో చేస్తున్నారు. అయితే యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు కొన్ని సార్లు నెట్ వర్క్ సమస్యలు వస్తూ ఉంటాయి. కొన్ని సార్లు నెట్ పనిచేయక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఇకపై ఈ పరిస్థితి రాకుండా చూసుకోవచ్చు. ఇంగ్లీష్, హిందీ సహా దేశంలోని 13 ప్రముఖ భాషల్లో ఇది అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఈ సేవ యూజర్లకు అందుబాటులో ఉంది.

దీని కోసం మీ బ్యాంక్ అకౌంట్ కు ఏ నెంబర్ అయితే ఉందో అంటే యూపీఐ పేమెంట్స్ చేసే మొబైల్ నంబర్ నుంచి *99# నంబర్‌కు డయల్ చేయాలి.తర్వాత 1 నొక్కాలి. ఆ తర్వాత మీకు కావాల్సిన భాషను ఎంచుకోవాలి. తదుపరి నగదు పంపాలనుకుంటున్న వ్యక్తి మొబైల్ నంబర్/UPI ID/ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి.ఎంత డబ్బు పంపాలో ఎంటర్ చేసి.. తర్వాత UPI పిన్ నంబర్ ఎంటర్ చేయాలి. అనంతరం మన బ్యాంక్ పేరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తరువాత మీ మొబైల్ నంబర్‌కు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్స్ లిస్ట్ కనిపిస్తుంది.ఏ అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్ జరగాలలో దానిని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ డెబిట్ కార్డు ఎక్స్‌పైరీ డేట్‌తో పాటు కార్డు నంబర్‌లోని చివరి ఆరు అంకెలను నమోదు చేయాలి. ఇలా చేస్తే మీకు కావాల్సిన నంబర్ కు డబ్బులు పంచుకోవచ్చు. ఈ ఆప్షన్‌తో ఒకసారి రూ. 5 వేల వరకు చెల్లించొచ్చు. దీని కోసం సర్వీస్ ఛార్జీలు చెల్లించాలి. ప్రతి సారి 50 పైసలు ఛార్జీ విధిస్తారు.